విధాత, నిజామాబాద్: జిల్లాలోని ఆర్మూర్ ప్రభుత్వ ఆసుపత్రిలో ప్రసవం తర్వాత మగ బిడ్డ జన్మనిచ్చి తనువు చాలించిన బాలింత సంఘటన చోటు చేసుకుంది. దీంతో మృతురాలి బంధువులు ఆసుపత్రి ఎదుట ఆందోళనకు దిగారు. డొంకేశ్వర్ మండల కేంద్రానికి చెందిన కుమ్మరి శ్రీలత (25) ప్రసవం కోసం ఆర్మూర్ ప్రభుత్వ ఆసుపత్రిలో శుక్రవారం చేరగా ప్రసవం తర్వాత మృతి చెందినట్లు మృతురాలి బంధువులు తెలిపారు. వైద్యుల నిర్ల‌క్ష్యమే కారణమని వారు ఆరోపించారు. గర్భిణీ సాధారణ ప్రసవం కోసం డాక్టర్లు […]

విధాత, నిజామాబాద్: జిల్లాలోని ఆర్మూర్ ప్రభుత్వ ఆసుపత్రిలో ప్రసవం తర్వాత మగ బిడ్డ జన్మనిచ్చి తనువు చాలించిన బాలింత సంఘటన చోటు చేసుకుంది. దీంతో మృతురాలి బంధువులు ఆసుపత్రి ఎదుట ఆందోళనకు దిగారు.

డొంకేశ్వర్ మండల కేంద్రానికి చెందిన కుమ్మరి శ్రీలత (25) ప్రసవం కోసం ఆర్మూర్ ప్రభుత్వ ఆసుపత్రిలో శుక్రవారం చేరగా ప్రసవం తర్వాత మృతి చెందినట్లు మృతురాలి బంధువులు తెలిపారు. వైద్యుల నిర్ల‌క్ష్యమే కారణమని వారు ఆరోపించారు.

గర్భిణీ సాధారణ ప్రసవం కోసం డాక్టర్లు ప్రయత్నించగా నొప్పులు రాకపోవడంతో శ్రీలత రోదించింది. దీంతో కుటుంబ సభ్యులు సిజేరియన్ చెయ్యాలని డాక్టర్లను కోరారు. డాక్టర్లు సాధారణ ప్రసవం కోసం ప్రయత్నించారు. దీంతో శ్రీలత మగబిడ్డకు జన్మనిచ్చి గుండెపోటుతో మరణించినట్లు ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ నాగరాజు తెలిపారు.

కాని మృతురాలి బంధువులు సిజేరియన్ చెయ్యాలని ఎంత చెప్పినా వినకుండా వైద్యులు వినిపించుకోలేదని బంధువులు ఆరోపించారు. మృతురాలి బంధువులు ఆసుపత్రి ముందు ఆందోళనకు దిగారు.

మృతురాలిని మొదటి కాన్పు కోసం తీసుకొచ్చామని బంధువులు తెలిపారు. వైద్యుల నిర్లక్ష్యం తోనే మృతి చెందినట్లు బంధువులు ఆరోపిస్తున్నారు. ముందు జాగ్రత్త చర్యగా పోలీసులు ప్రభుత్వ ఆసుపత్రికి చేరుకొని భారీ బందో బస్తు ఏర్పాటు చేశారు. శవ పంచనామా నిర్వహించి పోలీసులు మృత‌దేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం మార్చురీకి తరలించారు.

Updated On 7 Jan 2023 12:11 PM GMT
krs

krs

Next Story