Postmortem Room | పోస్టుమార్టం రూమ్‌లో శ‌వాలు కుప్ప‌లుతెప్ప‌లుగా ప‌డిఉంటాయి. పోస్టుమార్టం కాగానే మృత‌దేహాల‌ను వారి వారి కుటుంబ స‌భ్యులు తీసుకెళ్తుంటారు. గుర్తు తెలియ‌ని డెడ్ బాడీస్‌ను ఆ గ‌దిలోనే వ‌దిలేస్తుంటారు. అలా శ‌వాలు కుప్ప‌లుతెప్ప‌లుగా ప‌డి ఉంటాయి. అయితే ఓ మార్చురీ గ‌దిలో క‌ట్టెల నిచ్చెన ఐదారు అడుగులు న‌డిచింది. నిచ్చెన త‌నంత‌ట తానే ముందుకు క‌ద‌ల‌డాన్ని చూసి సిబ్బంది షాక్‌కు గుర‌య్యారు. ఈ ఘ‌ట‌న ఉత్త‌ర‌ప్ర‌దేశ్‌లోని బ‌రేలీలో కొద్ది రోజుల క్రితం చోటు చేసుకోగా, […]

Postmortem Room |

పోస్టుమార్టం రూమ్‌లో శ‌వాలు కుప్ప‌లుతెప్ప‌లుగా ప‌డిఉంటాయి. పోస్టుమార్టం కాగానే మృత‌దేహాల‌ను వారి వారి కుటుంబ స‌భ్యులు తీసుకెళ్తుంటారు. గుర్తు తెలియ‌ని డెడ్ బాడీస్‌ను ఆ గ‌దిలోనే వ‌దిలేస్తుంటారు. అలా శ‌వాలు కుప్ప‌లుతెప్ప‌లుగా ప‌డి ఉంటాయి.

అయితే ఓ మార్చురీ గ‌దిలో క‌ట్టెల నిచ్చెన ఐదారు అడుగులు న‌డిచింది. నిచ్చెన త‌నంత‌ట తానే ముందుకు క‌ద‌ల‌డాన్ని చూసి సిబ్బంది షాక్‌కు గుర‌య్యారు. ఈ ఘ‌ట‌న ఉత్త‌ర‌ప్ర‌దేశ్‌లోని బ‌రేలీలో కొద్ది రోజుల క్రితం చోటు చేసుకోగా, ప్ర‌స్తుతం సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతోంది.

వివ‌రాల్లోకి వెళ్తే.. బ‌రేలీలోని ఎస్ఆర్ఎంఎస్ మెడిక‌ల్ కాలేజీలోని మార్చురీ గ‌దిలో వెదురు క‌ట్టెల‌తో త‌యారు చేసిన ఒక నిచ్చెన ఉంది. అయితే ఆ నిచ్చెన ఉన్న‌ట్టుండి.. మ‌న‌షుల మాదిరిగానే న‌డ‌క సాగించింది. ఈ దృశ్యాన్ని అక్క‌డున్న ఓ వ్య‌క్తి త‌న మొబైల్‌లో చిత్రీక‌రించి త‌న ట్విట్ట‌ర్ ఖాతాలో పోస్టు చేశాడు.

గుండె ధైర్యం లేని వ్యక్తులు ఈ వీడియో క్లిప్‌ను చూడవద్దని ఆ పోస్ట్‌లో హెచ్చరించాడు. ఈ వీడియోపై నెటిజ‌న్లు ప‌లు ర‌కాలుగా స్పందించారు. దెయ్యాలు, లేదా ఆత్మలు ఆ నిచ్చెనను నడిపించినట్లు కొంద‌రు అనుమానించారు. గ్రాఫిక్‌ మాయాజాలమని మ‌రికొంద‌రు కామెంట్‌ చేశారు.

Updated On 5 Sep 2023 2:38 AM GMT
sahasra

sahasra

Next Story