విధాత, నిజామాబాద్‌: కామారెడ్డి పట్టణంలో బంద్ కొనసాగుతుంది. మాస్టర్ ప్లాన్‌ను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ బంద్‌కు పిలుపునిచ్చిన నేపథ్యంలో శుక్రవారం ఉదయం నుంచి కామారెడ్డి పట్టణంలో దుకాణాలు, పెట్రోల్ బంకులు, ఇతర వాణిజ్య సంస్థలు మూసి ఉన్నాయి. పోలీసులు బీజేపీ నాయకులు, రైతులను అరెస్ట్ చేసి వివిధ పోలీస్ స్టేషన్‌లకు తరలించారు. బీజేపీ నాయకుడు కాటిపల్లి వెంకటరమణారెడ్డిని ఇంటి వద్ద అరెస్ట్ చేసి రాజంపేట పోలీస్ స్టేషన్ కు తరలించారు. కాంగ్రెస్ నాయకులు సైతం అరెస్ట్ […]

విధాత, నిజామాబాద్‌: కామారెడ్డి పట్టణంలో బంద్ కొనసాగుతుంది. మాస్టర్ ప్లాన్‌ను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ బంద్‌కు పిలుపునిచ్చిన నేపథ్యంలో శుక్రవారం ఉదయం నుంచి కామారెడ్డి పట్టణంలో దుకాణాలు, పెట్రోల్ బంకులు, ఇతర వాణిజ్య సంస్థలు మూసి ఉన్నాయి. పోలీసులు బీజేపీ నాయకులు, రైతులను అరెస్ట్ చేసి వివిధ పోలీస్ స్టేషన్‌లకు తరలించారు.

బీజేపీ నాయకుడు కాటిపల్లి వెంకటరమణారెడ్డిని ఇంటి వద్ద అరెస్ట్ చేసి రాజంపేట పోలీస్ స్టేషన్ కు తరలించారు. కాంగ్రెస్ నాయకులు సైతం అరెస్ట్ అయినట్లు సమాచారం. మరికొంత మంది బీజేపీ నాయకులను అరెస్ట్ చేసి మాచారెడ్డి స్టేషన్ కు తరలించారు.

పట్టణంలో డీఎస్పీ సోమనాథం, పట్టణ సీఐ ఆధ్వర్యంలో పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశారు. కాగా స్టేషన్ రోడ్, సుభాష్ రోడ్, తిలక్ రోడ్, సిరిసిల్ల రోడ్, నేషనల్ హైవే, కొత్త బస్టాండ్, పాత బస్టాండ్ ప్రాంతాల్లో దుకాణాలు మూసి వుండగా పోలీసులు రోడ్డు పై కనిపించిన బీజేపీ నాయకులను అరెస్ట్ చేస్తున్నారు.

రైతులు గుంపులు గుంపులుగా వచ్చి దుకాణాలను మూసి వేయిస్తుండగా నిజాంసాగర్ చౌరస్తాలో పోలీసులు లింగాపూర్ గ్రామానికి చెందిన రైతులను అరెస్ట్ చేసి ఠాణాకు తరలించారు. రైతులు జై జవాన్ జై కిసాన్ అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు.

బంద్‌కు కాంగ్రెస్ సంపూర్ణ మద్దతు: పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి

కామారెడ్డి రైతు జేఏసీ ఇచ్చిన బంద్‌కు కాంగ్రెస్ శ్రేణులు మద్దతు ఇచ్చి అంత పాల్గొని విజయవంతం చేయాలని రేవంత్‌ రెడ్డి పిలుపు ఇచ్చారు. కామారెడ్డి మాస్టర్ ప్లాన్ ముసాయిదా ను రద్దు చేసి ప్రజా క్షేత్రం లో సభలు జరిపి రైతులతో చర్చించాలన్నారు.

మంత్రి కేటీఆర్, జిల్లా కలెక్టర్ నిర్లక్ష్యం వల్లనే సమస్య జఠిలం అయ్యిందన్నారు. రైతుల సమస్యలపై ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరించిందని పేర్కొన్నారు. వెంటనే ప్రభుత్వం రైతులతో చర్చించి సమస్యలను పరిష్కరించి రైతులకు న్యాయం చేయాలన్నారు. రైతులకు న్యాయం జరిగే వరకు కాంగ్రెస్ పార్టీ రైతులకు అండగా ఉంటుందని రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు.

Updated On 6 Jan 2023 7:04 AM GMT
krs

krs

Next Story