Friday, October 7, 2022
More
  Home latest బండి "ఐపాయె".. నెటిజ‌న్ల సెటైర్లు

  బండి “ఐపాయె”.. నెటిజ‌న్ల సెటైర్లు

  ఉన్నమాట: బీజేపీ రాష్ట్ర అధ్య‌క్షుడు చేప‌ట్టిన నాలుగో విడ‌త‌ ప్ర‌జా సంగ్రామ యాత్ర ముగింపు స‌భ గురువారం రాత్రి పెద్ద అంబ‌ర్ పేట‌లో ఆయ‌న మాట్లాడిన మాట‌లు హాస్యాస్పదంగా ఉన్నాయి. మునుగోడు ఉప ఎన్నిక‌లో బీజేపీ గెలువ‌డం ఖాయ‌ని, ఆ ఎన్నిక త‌ర్వాత రాష్ట్ర ప్ర‌భుత్వం కూలిపోతుంద‌ని ఆయ‌న వ్యాఖ్యానించారు. రాష్ట్రంలో 119 నియోజ‌క‌వ‌ర్గాలు ఉన్నాయి, అందులో ఒక నియోజ‌క‌వ‌ర్గానికి ఉప ఎన్నిక జ‌ర‌గ‌నున్న‌ది. ఒక్క సీటు బీజేపీ గెలిస్తే రాష్ట్ర ప్ర‌భుత్వం ఎట్లా కూలిపోతుందో బండి సంజ‌య్‌కే తెలియాలి.

  ప్ర‌స్తుతం అసెంబ్లీలో టీఆర్ఎస్‌కు 100 పైగా ఎమ్మెల్యేలు ఉన్నారు. అలాగే ఎంఐఎం అల‌యెన్స్ అని సీఎం బ‌హిరంగంగానే అనేక సంద‌ర్భాల్లో చెప్పారు. ఈ ర‌కంగా చూస్తే సుమారు 110 ఎమ్మెల్యేల మ‌ద్ద‌తు ఉన్న ప్ర‌భుత్వాన్ని కూలిపోతుంద‌న్న సంజ‌య్ వ్యాఖ్య‌ల‌పై సోష‌ల్ మీడియాలో నెటీజ‌న్లు సెటైర్లు వేస్తున్నారు. అలాగే ఆయ‌న ఇటీవ‌ల‌ ఉఫ్ అంటే టీఆర్ఎస్ ప్ర‌భుత్వం ఊడి పోతుంద‌న్నారు.

  దీనిపై కూడా నెటిజ‌న్లు వ్యంగ్యంగా స్పందిస్తున్నారు. ప్ర‌జాతీర్పును కాల‌రాసి మ‌ధ్య‌ప్ర‌దేశ్‌, మ‌హారాష్ట్ర‌లో ప్ర‌భుత్వాల‌ను కూల్చిన‌ట్లు కూలుస్తారా? అని ప్ర‌శ్నిస్తున్నారు. బండి సంజయ్ ఏం మాట్లాడుతారో ఆయ‌నకే అర్థం కాద‌ని, ఆయ‌న‌కు క‌త్తీ లేదు నెత్తీ లేద‌ని కేసీఆర్ అందుకే అన్నార‌ని కౌంట‌ర్లు రాస్తున్నారు.

  అలాగే బీజేపీ అధికారంలోకి వ‌స్తే ప్ర‌భుత్వ కార్య‌క్ర‌మాలు నిలిపి వేస్తామ‌ని కొంద‌రు దుష్ఫ్ర‌చారం చేస్తున్నారు. కాంగ్రెస్‌, టీఆర్ఎస్ తీసుకువ‌చ్చిన వాటిలో మంచివి ఉంటే ర‌ద్దు చోయ‌బోమ‌ని, ఇంకా విస్త‌రించి ప్ర‌జ‌ల‌కు లాభం చేకూరుస్తామ‌న్నవ్యాఖ్య‌ల‌పై కూడా నెటీజ‌న్లు స్పందిస్తున్నారు.

  సంజ‌య్ చేసిన కామెంట్ల‌కు సంబంధించిన పేప‌ర్ క్లిప్‌ల‌ను షేర్ చేస్తూ.. “ఐపాయె “అంటున్నారు. మంచివి కొన‌సాగిస్తాం, మ‌రింత విస్త‌రిస్తామ‌న్న సంజ‌య్ అస‌లు సంక్షేమ ప‌థ‌కాల్లో మంచివి ఏవి, ప‌నికి రానివి ఏవి అని చెప్ప‌కుండా ఏది ప‌డితే అది మాట్లాడితే ఎట్లా అని ప్ర‌శ్నిస్తున్నారు. ఆయ‌న మాట‌లు జీహెచ్ ఎంసీ ఎన్నిక సంద‌ర్భంలో మాట్లాడిన బండి పోతే బండి ఫ్రీ అన్న‌ట్టే ఉన్నాయంటున్నారు.

  దోపిడిదారుల ఇళ్ల‌ను బుల్డోజ‌ర్లతో కూల్చివేస్తామ‌ని ఇదే స‌భ‌లో పాల్గొన్న కేంద్ర మంత్రి సాధ్వి నిరంజ‌న్ జ్యోతి వ్యాఖ్య‌ల‌పై ఆగ్ర‌హం వ్య‌క్తం చేస్తున్నారు. దోపిడిదారుల ఎవ‌రన్న‌ది ఆధారాల‌తో స‌హా ప్ర‌జ‌ల ముందు ఉంచ‌వ‌చ్చు, కోర్టులకు, విచార‌ణ సంస్థ‌ల‌కు ఆ ఆధారాలు అంద‌జేసి విచార‌ణ కోర‌వ‌చ్చు.

  కానీ ఇవేవీ చేయకుండా ఊక‌దంపుడు ఉప‌న్యాసాలు దించిపోవ‌డం ప‌రిపాటిగా మారింది. బీజేపీ నేత‌లు మాట్లాడితే బుల్డోజ‌ర్ల , ఏక్ నాథ్ షిండేలు, హిజాబ్‌, మ‌సీదు అంశాలే త‌ప్పా త‌మ‌కు అవ‌కాశం ఇస్తే ఏం చేస్తామ‌న్నది స్ప‌ష్టంగా చెప్పాల‌ని సూచిస్తున్నారు.

  RELATED ARTICLES

  అయ్యబాబోయ్.. థమన్‌ని పట్టుకోలేకపోతున్నారుగా!

  విధాత: థమన్.. టాలీవుడ్‌లో మిస్సైల్‌లా దూసుకుపోతున్న పేరు. ఆయన సంగీతానికి ఇప్పుడు ప్రత్యేక ఫ్యాన్స్ ఉన్నారు. ఆయన సంగీతం అందించిన సినిమా అంటే.. థియేటర్లలో సౌండ్ బాక్స్‌లు మార్పించుకుంటున్న థియేటర్స్...

  మీరు క్రెడిట్ కార్డు వాడుతున్నారా..? అయితే, మీకు గుడ్ న్యూస్‌!

  విధాత: రెగ్యుల‌ర్‌గా క్రెడిట్ కార్డు వినియోగించే క‌స్ట‌మ‌ర్ల‌కు నేష‌న‌ల్ పేమెంట్స్ కార్పొరేష‌న్ ఆఫ్ ఇండియా శుభ‌వార్త వినిపించింది. రూపే క్రెడిట్ కార్డుతో రూ.2000 వ‌ర‌కు జ‌రిపే యూపీఐ ట్రాన్సాక్ష‌న్స్ మీద...

  గరికపాటినీ వదలని మెగా బ్రదర్.. సోషల్ మీడియాలో సెటైర్!

  విధాత: ‘‘ఏపాటి వాడికైనా చిరంజీవిగారి ఇమేజ్ చూస్తే ఆ పాటి అసూయ పడటం పరిపాటే’’.. ఇది నాగబాబు చేసిన ట్వీట్. ఇది గరికపాటి వారినే అని ఎలా, ఎందుకు అనుకోవాలి...

  Most Popular

  ఆస్కార్‌కు RRR.. ఇప్పుడైనా కల నెరవేరుతుందా?

  విధాత: దర్శకధీరుడు ఎస్.ఎస్. రాజమౌళి ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించిన చిత్రం ‘RRR’. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద పెను ప్రభంజనాన్ని సృష్టించిన విషయం తెలిసిందే. ఇద్దరు స్టార్ హీరోలతో రాజమౌళి...

  You cannot copy content of this page