Bandla Ganesh బాబు మళ్లీ గెలుస్తారు.. సీఎం అవుతారు సినీ నిర్మాత బండ్ల గణేష్ విధాత: టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రిమాండ్ పై సినీ నిర్మాత బండ్ల గణేష్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. బాబు రాజమండ్రి జైల్లో మగ్గుతుంటే, తనకు అన్నం కూడా తినబుద్ధి కావట్లేదని ఆవేదన చెందారు. చంద్రబాబు తెలుగు జాతి సంపద అనీ, బాబును కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిది అంటూ పిలుపునిచ్చారు. చంద్రబాబు మళ్లీ గెలుస్తారు.. సీఎం […]

Bandla Ganesh
- బాబు మళ్లీ గెలుస్తారు.. సీఎం అవుతారు
- సినీ నిర్మాత బండ్ల గణేష్
విధాత: టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రిమాండ్ పై సినీ నిర్మాత బండ్ల గణేష్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. బాబు రాజమండ్రి జైల్లో మగ్గుతుంటే, తనకు అన్నం కూడా తినబుద్ధి కావట్లేదని ఆవేదన చెందారు. చంద్రబాబు తెలుగు జాతి సంపద అనీ, బాబును కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిది అంటూ పిలుపునిచ్చారు.
చంద్రబాబు మళ్లీ గెలుస్తారు.. సీఎం అవుతారనీ చెప్పారు. చంద్రబాబుకు మద్దతుగా నిరసనలు చేపడుతున్న ఐటీ ఉద్యోగులకు.. ఆందోళనల తీరు మార్చాలని సూచించారు. ‘ఐటీ ఉద్యోగులు నిరసనలు చేపట్టాల్సింది… పార్కుల ముందు, రోడ్లపై కాదు. నెల రోజుల పాటు ఉద్యోగాలు మానేసి సొంతూళ్లకు వెళ్లండి. అక్కడ బొడ్రాయి ముందు కూర్చుని ధర్నాలు చేయండి’ అంటూ చెప్పుకొచ్చారు.
