Sunday, December 4, 2022
More
    Homelatestఅభిమానులకి షాకిచ్చిన బండ్ల గణేష్.. ఇక గుడ్ బై!

    అభిమానులకి షాకిచ్చిన బండ్ల గణేష్.. ఇక గుడ్ బై!

    విధాత‌, హైద‌రాబాద్‌: కాంగ్రెస్ పార్టీ అంటే నటుడు, కమెడియన్, నిర్మాత బండ్ల గణేష్‌కు ఎంత ఇష్టమో.. ఎంత ప్రాణమో మరోసారి సోషల్ మీడియా వేదికగా తెలిసేలా చేస్తున్నాడు. కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ ‘భారత్ జోడో యాత్ర’ అంటూ పాదయాత్ర చేస్తున్న విషయం తెలిసిందే.

     

    సమంత సర్జరీ చేయించిందా?

    ఆ యాత్రలో రాహుల్ గాంధీ‌కి చెమటలు పడితే.. తనకు చెమటలు పట్టినట్లుగా బండ్లన్న ఫీలైపోతున్నాడు. ఈ మధ్య రాజకీయాలకు ఇక దూరం అని ప్రకటించిన బండ్ల గణేష్.. ఈ యాత్రను చూసి మరోసారి యాక్టివ్ అవుతున్నాడా? అనిపించేలా ఆయన ట్వీట్స్ ఉన్నాయి.

     

    దీంతో అందరూ ఆయన మళ్లీ రాజకీయాల వైపు అడుగులు వేస్తున్నాడా? అనేలా కామెంట్స్ చేస్తున్నారు. అలాగే ఈ మధ్యకాలంలో ఆయన అటెంట్ అయ్యే ప్రతి ఇంటర్వ్యూలో.. రాజకీయాలకు సంబంధించి బండ్లకు అనేక ప్రశ్నలు ఎదురవుతున్నాయి.

     

    తనకు అనుకూలమైన వాటికి సమాధానమిస్తూ.. మిగతా వాటిని పాస్ చేస్తూ వస్తున్న బండ్ల.. ఇక రాజకీయాలకు గుడ్ ‌బై అన్నట్లుగా తాజాగా ట్వీట్ చేశారు. రాహుల్ గాంధీ పాదయాత్రతో బండ్లన్నలో కూడా హుషారు వచ్చి.. మళ్లీ ఎంటరవుతాడని అనుకుంటున్న వాళ్లందరికీ తాజా నిర్ణయంతో బండ్ల షాకిచ్చాడు.

     

    ‘‘నమస్కారం.. నా కుటుంబ బాధ్యతల వల్ల నా ఉమ్మడి కుటుంబ సభ్యుల నేపథ్యంలో.. వారి కోరికపై మా పిల్లల భవిష్యత్ గురించి ఆలోచిస్తూ నాకున్న పనులు వల్ల వ్యాపారాల వల్ల నేను రాజకీయాలకు దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నాను. నాకు ఏ రాజకీయ పార్టీతో శత్రుత్వం గానీ, మిత్రుత్వం గానీ లేదు.

    అంబటి రాంబాబు.. మాములు ‘కళాకారుడు’ కాదండోయ్!

    అందరూ నాకు ఆత్మీయలే.. అందరూ నాకు సమానులే.. ఇంతకుముందు నావల్ల ఎవరైనా ప్రత్యక్షంగా పరోక్షంగా బాధపడి ఉంటే నన్ను పెద్ద మనసుతో క్షమిస్తారని ఆశిస్తూ మీ బండ్ల గణేష్’’ అని బండ్ల తన ట్వీట్‌లో పేర్కొన్నారు. దీనికి నెటిజన్లు.. మరొక్కసారి ఆలోచించు అన్నా.. నీ అవసరం జనాలకి ఉంది.. అంటూ కామెంట్స్ చేస్తుండటం గమనార్హం.

     

    ఏంటి నిత్యామీనన్ పెళ్లి కాకుండానే తల్లి కాబోతోందా?

     

    ఇక్కడ ఆయన లేరు కదా.. గరికపాటిపై చిరు సెటైర్లు

    RELATED ARTICLES

    Latest News

    Cinema

    Politics

    Most Popular

    You cannot copy content of this page