విధాత‌: నటుడు, నిర్మాత బండ్ల గణేష్‌ను ఆయన వ్యతిరేకులు ఒక జోకర్‌గా చూస్తుంటారు. ఆయన చేసే పనులు కూడా, మాట్లాడే తీరు కూడా అలాగే ఉంటుంటాయి. ఎవరితో అవకాశం ఉంటే వారికి సన్నిహితమై పోతూ ఉంటాడు. వారితో పనుంటే చాలు.. వారిని ఆకాశానికి ఎత్తేస్తుంటాడు. కానీ ఏ మాత్రం వారి నుంచి తాను అనుకున్న సహకారం లభించకపోతే ఇక మరో వేదికలో వారిపై ఇండైరెక్ట్ గా విరుచుకు పడతాడు. అందుకే అతన్ని అవకాశవాది అంటుంటారు. బ్లాక్ బస్టర్ […]

విధాత‌: నటుడు, నిర్మాత బండ్ల గణేష్‌ను ఆయన వ్యతిరేకులు ఒక జోకర్‌గా చూస్తుంటారు. ఆయన చేసే పనులు కూడా, మాట్లాడే తీరు కూడా అలాగే ఉంటుంటాయి. ఎవరితో అవకాశం ఉంటే వారికి సన్నిహితమై పోతూ ఉంటాడు. వారితో పనుంటే చాలు.. వారిని ఆకాశానికి ఎత్తేస్తుంటాడు. కానీ ఏ మాత్రం వారి నుంచి తాను అనుకున్న సహకారం లభించకపోతే ఇక మరో వేదికలో వారిపై ఇండైరెక్ట్ గా విరుచుకు పడతాడు. అందుకే అతన్ని అవకాశవాది అంటుంటారు. బ్లాక్ బస్టర్ నిర్మాతగా ఆయ‌న‌పై ప‌లు జోక్స్ ఉన్నాయి.

నాడు నేడు మంత్రిగా ఉన్న బొత్స సత్యనారాయణకు బినామీగా ఇండస్ట్రీలోకి నిర్మాతగా ఎంట్రీ ఇచ్చాడు. అంతకుముందు చిన్న చిత‌కా పాత్రలు చేసుకుంటూ ఏదో కమెడియన్‌గా అలా కనిపిస్తూ.. ఇలా మాయమయ్యే పాత్రలు చేశాడు. అంతే కాదు.. ప్లీజ్ ఆంటీ అనే ఒక అడ‌ల్ట్‌మూవీలో కూడా నటించాడు.

ఇలాంటివి చెప్పుకుంటే ఇంకెన్నో..! ఆయ‌న ఓ పచ్చి అవకాశవాది అని అందరికీ చెప్పినా వారు మాత్రం అతనికి నిర్మాతగా అవకాశాలు ఇస్తూనే ఉంటారు. అందులో మామూలువారు కాదు బడా బడా స్టార్స్ ఆయన చెప్పే మాటలు, మనుషులను బోల్తా కొట్టించే తీరు.. ఇలా ప్రతిదీ ఎదుటి వారిని మునగ చెట్టు ఎక్కించేలా ఉంటుంది. లక్షల ఖరీదులు చేసే గిఫ్ట్ లిస్తుంటాడు. మొత్తానికి స్టార్ హీరోలను బోల్తా కొట్టించడం ఎలా అనేది ఒక నిర్మాతగా బండ్ల గణేష్‌ను చూసి నేర్చుకోవాలని చాలామంది అంటారు.

ఇటీవల పూరీ తనయుడు ఆకాశ్‌పూరి నటించిన ఓ చిత్రం వేడుకకు హాజరైన ఆయన ఆ వేడుకకు పూరీ జగన్నాథ్ రాకపోవడంపై ఏదేదో మాట్లాడేశాడు. ఇటీవల జరిగిన ధమాకా సక్సెస్ మీట్ లో కూడా రవితేజను చూసి పూనకం వచ్చిన వాడిలా మాట్లాడాడు. మైక్ అందుకొని రవితేజను తెగ పొగడ్తలతో ముంచెత్తాడు.

నిజానికి నిర్మాతగా బండ్ల గణేష్‌కు రవితేజ మొదటి హీరో. నిర్మాతగా అవకాశం ఇచ్చింది ఆయనే. అయినా అందుకోసం ఆయనను పొగడడంలో తప్పు లేకపోయినా.. అదే సమయంలో ఆయన చేసిన కొన్ని వ్యాఖ్యలు వివాదాస్పదం అయ్యాయి. అదృష్టం బాగుంటే ఎవరైనా సూపర్ స్టార్లు, మెగాస్టార్ లు అయిపోతారని కొత్త వివాదానికి తెర తీశాడు. దాంతో పవన్ అభిమానులు మా హీరోతో బ్యాక్ టు బ్యాక్ రెండు సినిమాలు చేశావు.. అది నీ అదృష్టం వల్లనే చేశావా అంటున్నారు.

బండ్ల‌న్న వ్యాఖ్యలపై మెగా ఫ్యాన్స్ తో పాటు మహేష్ బాబు అభిమానులు, కృష్ణ అభిమానులు కూడా మండిపడుతుండడం విశేషం. ఈయ‌న‌కు యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్‌తో ఎప్పుడో చెడింది. ఇక ప‌వ‌న్ వంతు. ఆయ‌న‌కి కూడా బండ్ల అవ‌కాశ‌వాదం గురించి బాగానే అర్ధ‌మైన‌ట్లు ఉంది. దాంతోనే ఆయ‌న ర‌వితేజ‌నే త‌న‌కి దిక్క‌ని భావించి అలా మాట్లాడి ఉంటాడు. అయితే బండ్ల చేసిన ఈ వ్యాఖ్యలపై మరో కమెడియన్ షకలక శంకర్ గట్టి కౌంటర్ వేశాడు.

నిర్మాత బండ్ల గణేష్‌పై షకలక శంకర్, తాగుబోతు రమేష్‌లు ఓ రేంజ్‌లో విడుచుకుపడ్డారు… చేతికి మైకు దొరికితే ఇష్టం వచ్చినట్టు వాగుతారా? తెలుగు ప్రజలు ప్రేమతో ఆరాధిస్తున్న సూపర్ స్టార్స్‌ని తేలిగ్గా తీసిపారేయడం అవసరమా? కొంతమంది మైకు తీసుకొని ఏవేవో మాట్లాడతారు. వాళ్లకి శతకోటి దండాలు. ఏం మాట్లాడుతారో వాళ్లకే అర్థం కాదు.

నిన్న మొన్న ఓ ప్రొడ్యూసర్ ఏదో అంటున్నాడు. రెండు మూడు సంవత్సరాలు ఏదో ట్రై చేస్తే అదృష్టవశాత్తు సూపర్ స్టార్స్, మెగా స్టార్స్ అయిపోతారట. మెగాస్టార్, సూపర్ స్టార్స్ అదృష్టంతో కాదండి.. ఎన్నో రాత్రులు సరైన తిండి తిప్పలు లేక కష్టాలు పడితే వాళ్ళు స్టార్స్ అయ్యారు. మరి ఆయన ఎందుకలా అన్నాడు… ఏ ఉద్దేశంతో అన్నాడు అనేది ఆయనకే తెలియదు.

నీ ఎదురుగా ఎవరో హీరో ఉన్నాడు కదా అని నువ్వు ఉబ్బిపోయి మైమ‌రిచిపోయి, విజ్ఞ‌త మరిచిపోయి నీ బుర్రలో ఏముందో కూడా మరిచిపోయి బుద్ధి లేకుండా ఇండస్ట్రీ చరిత్రను ఏలిన మహానుభావుల గురించి నువ్వు అంత చులకనగా, తక్కువగా మాట్లాడటం కరెక్ట్ కాదు. ఇది ఎవరికి కనెక్ట్ అవాలో వారికి కనెక్ట్ అవుద్ది… పేరెందుకులే అని ఉతికి ఆరేశాడు షకలక శంకర్.

బండ్లపై ష‌క‌ల‌క శంక‌ర్ చేసిన ఈ వ్యాఖ్యలను పక్కనే ఉన్న తాగుబోతు రమేష్ కూడా సమర్థించడం విశేషం. మొత్తానికి బండ్లన్న పై ఇప్పుడు ప్రస్తుతం వివాదం బాగా జోరందుకుంది. నెట్టింట వైరల్ అవుతుంది. మరి ఇది ఎంతవరకు కొనసాగుతుంది? ఏ పరిణామాలకు దారి తీస్తుందనేది భవిష్యత్తులో గాని తేలదు.

Updated On 2 Jan 2023 4:40 PM GMT
CH RAJITHA

CH RAJITHA

Next Story