Bank Holidays | వరుసగా మూడురోజులు బ్యాంకులకు సెలవులు రానున్నాయి. వినాయక నవరాత్రి ఉత్సవాలకు దేశం సర్వాంగ సుందరంగా ముస్తాబవుతున్నది. ఇప్పటికే పలు రాష్ట్రాల్లో వేడుకలు మొదలయ్యాయి. అందంగా తీర్చిదిద్దిన మండపాల్లో భారీ వినాయకులు కొలువుదీరుతున్నాయి. పండుగ సందర్భంగా దేశవ్యాప్తంగా సెలవుదినం. వచ్చే వారంలో బ్యాంకులకు వరుసగా మూడురోజులు సెలవులు రానున్నాయి. పలు ప్రాంతాల్లో వినాయక చవితిని 18న జరుపుకుంటున్నారు. మరికొన్నిచోట్ల 19న జరుపుకుంటున్నారు. ఆర్‌బీఐ క్యాలెండర్‌ ప్రకారం.. ఈ నెల 18న హైదరాబాద్‌తో పాటు తెలంగాణ, […]

Bank Holidays |

వరుసగా మూడురోజులు బ్యాంకులకు సెలవులు రానున్నాయి. వినాయక నవరాత్రి ఉత్సవాలకు దేశం సర్వాంగ సుందరంగా ముస్తాబవుతున్నది. ఇప్పటికే పలు రాష్ట్రాల్లో వేడుకలు మొదలయ్యాయి. అందంగా తీర్చిదిద్దిన మండపాల్లో భారీ వినాయకులు కొలువుదీరుతున్నాయి.

పండుగ సందర్భంగా దేశవ్యాప్తంగా సెలవుదినం. వచ్చే వారంలో బ్యాంకులకు వరుసగా మూడురోజులు సెలవులు రానున్నాయి. పలు ప్రాంతాల్లో వినాయక చవితిని 18న జరుపుకుంటున్నారు. మరికొన్నిచోట్ల 19న జరుపుకుంటున్నారు.

ఆర్‌బీఐ క్యాలెండర్‌ ప్రకారం.. ఈ నెల 18న హైదరాబాద్‌తో పాటు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌, బెంగళూరు, చెన్నైలో బ్యాంకులకు సెలవులు. ఈ నెల 19న ముంబయి, నాగ్‌పూర్‌, పనాజీ, అహ్మదాబాద్‌, బేలాపూర్‌, భువనేశ్వర్‌లో బ్యాంకులకు హాలీడే.

20న వినాయక చవితి రెండోరోజైన నౌఖై నేపథ్యంలో ఒడిశా భువనేశ్వర్‌తో పాటు పనాజీలో బ్యాంకులకు సెలవులు ఇవ్వనున్నారు. ఆదివారంతో కలిపితే నాలుగు సెలవులు వచ్చినట్లే. ఇక ఈ నెలలో మరికొన్ని సెలవులు రానున్నాయి. 22న శ్రీ నారాయణ గురు సమాధి డే సందర్భంగా కేరళలో బ్యాంక్​లకు సెలవు.

23న మహారాజ హరిసింగ్‌ జయంతి సందర్భంగా జమ్మూ కశ్మీర్‌లో 25న శ్రీమంత శంకరదేవ జయంతి రోజున అసోంలో, 27న మిలాద్‌ ఈ షెరిఫ్‌ సందర్భంగా జమ్మూకశ్మీర్‌, కేరళలో బ్యాంకులు మూసివేయనున్నారు. అయితే, బ్యాంకులకు వరుస సెలవులు ఉన్నా ప్రస్తుతం ఇంటర్నెట్‌, మొబైల్‌ బ్యాంకింగ్‌, యూపీఐ సేవలు కొనసాగనున్నాయి.

వీటితో బ్యాంకుకు వెళ్లకుండానే డబ్బులను ట్రాన్స్‌ఫర్‌ చేసుకునే వీలుంది. అయితే, చెక్కుల విత్‌డ్రా తదితర పనులకు బ్యాంకులకు వెళ్లక తప్పదు. ఇలాంటి సమయంలో ముందుగానే బ్యాంకుల సెలవుల గురించి తెలిస్తే.. ఆయా పనులను ముందుస్తగానే తెలుసుకునే వీలుంటుంది.

Updated On 17 Sep 2023 9:44 AM GMT
cm

cm

Next Story