విధాత: దొంగలు అనగానే అందరూ భయపడి పోతారు. మారణాయుధాలతో భయ పెట్టించే సరికి అందరూ లొంగిపోతారు. ఇక దొంగలు అందినకాడికి దోచుకొని పోతారు. కానీ ఈ బ్యాంక్ సిబ్బంది మాత్రం ఆ దొంగకు బెదరలేదు. అతనికే చుక్కలు చూపించారు. బ్యాంక్ మేనేజర్ మహిళా అయినప్పటికీ.. ఆమె అతన్ని ఎదురించింది. ఈ ఘటన రాజస్థాన్‌లోని శ్రీగంగానగర్‌లోని మరుధర గ్రామీణ బ్యాంకులో శనివారం చోటు చేసుకోగా, ఆలస్యంగా వెలుగు చూసింది. ఓ దొంగ తన ముఖానికి స్కార్ఫ్‌ ధరించి బ్యాంకు […]

విధాత: దొంగలు అనగానే అందరూ భయపడి పోతారు. మారణాయుధాలతో భయ పెట్టించే సరికి అందరూ లొంగిపోతారు. ఇక దొంగలు అందినకాడికి దోచుకొని పోతారు. కానీ ఈ బ్యాంక్ సిబ్బంది మాత్రం ఆ దొంగకు బెదరలేదు.

అతనికే చుక్కలు చూపించారు. బ్యాంక్ మేనేజర్ మహిళా అయినప్పటికీ.. ఆమె అతన్ని ఎదురించింది. ఈ ఘటన రాజస్థాన్‌లోని శ్రీగంగానగర్‌లోని మరుధర గ్రామీణ బ్యాంకులో శనివారం చోటు చేసుకోగా, ఆలస్యంగా వెలుగు చూసింది.


ఓ దొంగ తన ముఖానికి స్కార్ఫ్‌ ధరించి బ్యాంకు లోపలికి ప్రవేశించి బ్యాంకు సిబ్బందిని కత్తితో భయపెట్టి బ్యాగులో నగదు నింపాలని వారిని డిమాండ్ చేశాడు. కానీ ఓ ఉద్యోగి మాత్రం అతని ఆదేశాలను పట్టించుకోలేదు.

దొంగ అటు ఇటు తిరుగుతూ, గట్టిగా అరిచాడు. ఆ అరుపులు విన్న బ్యాంకు మేనేజర్ పూనం గుప్తా లోపలి నుంచి బయటకు వచ్చింది. ఆమెను కూడా దొంగ కత్తితో భయపెట్టాడు. కానీ గుప్తా బెదరలేదు. అతనికే చుక్కలు చూపించింది.

దొంగ బ్యాంకులో ఉండగానే, ఓ ఉద్యోగి చాకచక్యంగా అక్కడ్నుంచి బయటకు వచ్చి, బ్యాంకు డోర్‌ను మూసేసంది. పోలీసులకు సమాచారం అందడంతో, బ్యాంకు వద్దకు చేరుకుని దొంగను పట్టుకున్నారు. దొంగను లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్‌కు చెందిన లావీష్ ఆరోరాగా పోలీసులు గుర్తించారు. దొంగ బ్యాంకులోకి ప్రవేశించిన సమయంలో రూ. 30 లక్షలు ఉన్నట్లు బ్యాంకు అధికారులు తెలిపారు.

Updated On 18 Oct 2022 10:27 AM GMT
krs

krs

Next Story