విధాత: తెలంగాణ కెనడా అసోసియేషన్ (టీసీఏ) ఆధ్వర్యంలో టొరంటోలో తెలంగాణ వాసులు బతుకమ్మ సంబురాలు అత్యంత భక్తి శ్రద్ధలతో జరుపుకున్నారు. ఈ ఉత్సవాలను అసోసియేషన్ అధ్యక్షుడు రాజేశ్వర్ ఈద, గవర్నింగ్ బోర్డు ఆధ్వర్యంలో ఘనంగా ప్రారంభించారు.
ఈ సందర్భంగా నూతన కమిటీ అధ్యక్షడు శ్రీనివాస్ మన్నెం, కొత్త గవర్నింగ్ బోర్డు టీంను సభాముఖంగా ఆహ్వానించి వారికి అభినందనలు తెలిపారు.
దాదాపు పన్నెండు వందల మంది స్థానిక Oakville Legacy Banquet కన్వెన్షన్ సెంటర్‌లో ఆరు ఫీట్ల ఎత్తైన బతుకమ్మను పేర్చి సుమారు 6 గంటలు ఏకధాటిగా ఆట పాటలతో మహిళలు, చిన్నారులు బతుకమ్మ ఆడి చివరగా పోయి రావమ్మ బతుకమ్మ, పోయి రావమ్మ గౌరమ్మ పాటతో ఊరేగింపు నిర్వహించి నిమజ్జనం చేశారు. సత్తు పిండి, నువ్వులపిండి , పల్లీలపిండి ఫలహారాలు పంపిణీ చేశారు.
ఆరు గంటల పాటు మహిళలు, చిన్నారులు బతుకమ్మ ఆడి ఊరేగింపు నిమజ్జనం చేశారు. అసోసియేషన్ అధ్యక్షుడు రాజేశ్వర్ ఈద, సభ్యులు దీప గజవాడ నేతృత్వంలో వేడుకలను నిర్వహించారు. అనంతరం సంబరాలకు సహకరించిన సభ్యులకు జ్ఞాపికలు అందజేశారు.
కార్యక్రమంలో బోర్డు అఫ్ ట్రస్టీ చైర్మన్ సంతోష్ గజవాడ, ఉపాధ్యక్షుడు శ్రీనివాస్ మన్నెం, జనరల్ సెక్రెటరీ దామోదర్ రెడ్డి మాది, ట్రెజరర్ నవీన్ ఆకుల, కల్చరల్ team శ్రీమతి దీప గజవాడ, కార్యవర్గ సభ్యులు, గిరిధర్ క్రోవిడి, ఉదయ్ భాస్కర్ గుగ్గిళ్ల, రాహుల్ బాలినేని, ధాత్రి అంబటి,
బోర్డ్ అఫ్ ట్రస్టీ సభ్యులు శ్రీనివాస్ రెడ్డి దేప, రాజేష్ ఆర్రా, ప్రకాశ్ చిట్యాల, మనోజ్ రెడ్డి, సంస్థ ఫౌండేషన్ కమిటీ సభ్యులు కోటేశ్వర రావు చిత్తలూరి, దేవేందర్ రెడ్డి గుజ్జుల, ప్రభాకర్ కంబాలపల్లి, శ్రీనివాస్ తిరునగరి, శ్రీనాథ్ కుందూరి పాల్గొన్నారు.
చివరగా ఈవెంట్ కో స్పాన్సర్స్ పబ్బ రియాల్టీ శ్రీనివాస్ పబ్బ, శ్వేతా పుల్లూరి, Townhill కన్స్ట్రక్షన్, లవ్ ప్రీత్ టీం, Get-Home Realty ప్రశాంత్ మూల, Remax మానస్వని వేళాపాటి, హోమ్ లైఫ్ లాండ్‌మార్క్ ఇంక్, బ్రోకరేజ్ రియాల్టీ రికెల్ హూంగే, బెస్ట్ బ్రైన్స్ లెర్నింగ్ సెంటర్ OAKVILLEలను ప్రెసిడెంట్ రాజేశ్వర్ ఈద శాలువాలతో అభినందించి మొమెంటోస్ బహుకరించారు.