HomelatestBollywood | సల్మాన్‌ఖాన్‌ సినిమాలో.. మన బతుక‌మ్మ పాట‌..

Bollywood | సల్మాన్‌ఖాన్‌ సినిమాలో.. మన బతుక‌మ్మ పాట‌..

విధాత‌, సినిమా: బాలీవుడ్ అగ్ర న‌టుడు స‌ల్మాన్ ఖాన్ హీరోగా న‌టిస్తున్న కిసీ కా భాయ్.. కిసీ కా జాన్ అనే చిత్రంలో మ‌న బ‌తుక‌మ్మ పాట (Bathukamma Song) మెరిసింది. పవన్‌ కల్యాణ్‌ కాటమరాయుడుకు రిమేక్‌గా ఈ చిత్రం తెర‌కెక్కుతుండగా టాలీవుడ్ హీరోలు వెంక‌టేశ్‌, జ‌గ‌ప‌తి బాబు, న‌టి పూజాహెగ్డే, షెహ్‌నాజ్ గిల్ కీల‌క పాత్ర‌ల్లో న‌టిస్తున్నారు. అయితే ఈ చిత్రాన్ని సల్మాన్ ఖాన్ స్వ‌యంగా నిర్మిస్తున్నారు.

ఈ చిత్రంలో హీరోయిన్‌ తెలంగాణ రాష్ట్రానికి చెందినట్లుగా చూపించగా పూజాహెగ్డే అన్నగా వెంకటేశ్‌, విలన్‌గా జగపతిబాబు నటిస్తున్నారు. అయితే  ఈ చిత్రంలో హీరోయిన్‌ ఇంటి వద్ద జరిగే బతుకమ్మ వేడుకలో సల్మాన్‌ ఖాన్‌, ఆయన తమ్ముళ్లు పాల్గొనే సందర్భంగా ఈ పాటను తెరకెక్కించారు.

ఈ చిత్రం ఏప్రిల్ 21న ప్రేక్ష‌కుల ముందుకు రానుంది. ఈ నేప‌థ్యంలో మూవీలోని బ‌తుక‌మ్మ పాట‌ను చిత్ర బృందం శుక్ర‌వారం విడుద‌ల చేసింది. ఈ పాట‌లో స‌ల్మాన్ ఖాన్, వెంక‌టేశ్‌, భూమిక‌, పూజా హెగ్డే సంద‌డి చేశారు. తెలంగాణ‌లో గొప్ప‌గా నిర్వ‌హించుకునే బ‌తుక‌మ్మ పండుగ‌ను ఆ పాట‌లో కూడా అంతే గొప్ప‌గా చూపించారు. ఇక ఈ పాట‌ను బీఆర్ఎస్ ఎమ్మెల్సీ క‌విత త‌న ట్విట్ట‌ర్ ఖాతాలో షేర్ చేశారు.

spot_img
spot_img
RELATED ARTICLES
spot_img

Latest News

Cinema

Politics

Most Popular