విధాత: అమ్మకానికి నమ్మకానికి మధ్య మునుగోడు యుద్ధం సాగుతుందని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి పేర్కొన్నారు. చౌటుప్పల్ మండలంలో నిర్వహించిన కాంగ్రెస్ ఎన్నికల ప్రచార సభలో ఆయన మాట్లాడుతూ సీఎం కేసీఆర్‌పై మండిపడ్డారు. బంగారు తెలంగాణ చేస్తానన్న కేసీఆర్ తాగుబోతుల తెలంగాణగా మార్చాడని విమర్శించారు. కేసీఆర్ సీఎం అయ్యే నాటికి లిక్కర్‌తో రాష్ట్ర ఆదాయం రూ.10వేల కోట్లు ఉండేదని కానీ ఎనిమిదేళ్లలో 36 వేల కోట్లకు పెరిగిందన్నారు. ఇది మా ఆడబిడ్డల రెక్కల కష్టం కాదా? అంటూ ప్రశ్నించారు. […]

విధాత: అమ్మకానికి నమ్మకానికి మధ్య మునుగోడు యుద్ధం సాగుతుందని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి పేర్కొన్నారు. చౌటుప్పల్ మండలంలో నిర్వహించిన కాంగ్రెస్ ఎన్నికల ప్రచార సభలో ఆయన మాట్లాడుతూ సీఎం కేసీఆర్‌పై మండిపడ్డారు. బంగారు తెలంగాణ చేస్తానన్న కేసీఆర్ తాగుబోతుల తెలంగాణగా మార్చాడని విమర్శించారు.

కేసీఆర్ సీఎం అయ్యే నాటికి లిక్కర్‌తో రాష్ట్ర ఆదాయం రూ.10వేల కోట్లు ఉండేదని కానీ ఎనిమిదేళ్లలో 36 వేల కోట్లకు పెరిగిందన్నారు. ఇది మా ఆడబిడ్డల రెక్కల కష్టం కాదా? అంటూ ప్రశ్నించారు. అమరుల ప్రాణ త్యాగాలు, పోరాటాలు చేసింది ఇలాంటి తెలంగాణ కోసమా? తెలంగాణ సాధించుకుంది ఇందుకేనా? అని దుయ్యబట్టారు.

మునుగోడు ఆడబిడ్డలు ఒక్కసారి ఆలోచించండి తెలంగాణను తాగుబోతుల అడ్డాగా మార్చినందుకు కేసీఆర్‌ను చెప్పుతో కొట్టినా తప్పులేదన్నారు. మునుగోడులో ఎన్నో సమస్యలు ఉన్నాయన్నారు. లక్కారం చెరువు నిండితే కాలువలు తీసే సోయి కేసీఆర్‌కు లేదంటూ మండిపడ్డారు. మునుగోడు సమస్యలపై అసెంబ్లీలో కొట్లాడే స్రవంతిని గెలిపించండి అని రేవంత్‌ కోరారు.

ఇప్పుడే ఓ మాట చెబుతున్నా దీపావళి రోజు యాదగిరిగుట్టకు రండి.. అక్కడ ప్రమాణం చేద్దాం. మందు పోయకుండా ఎవరు గెలుస్తారో వారే తెలంగాణకు సికిందర్ అని, సమస్యలపై చౌటుప్పల్ చౌరస్తాలో లక్ష మందిలో చర్చకు మేం సిద్ధమని, మరి మీరు సిద్ధమా? అంటూ రాజగోపాల్ రెడ్డికి సవాల్ విసిరారు. ధైర్యముంటే ఆడబిడ్డ సవాల్‌ను స్వీకరించాలన్నారు.

కేసీఆర్‌.. అన్నం పెట్టిన చేతికే సున్నం పెట్టే రకమని.. తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్‌నే లేకుండా చేయాలని కేసీఆర్ చూస్తున్నాడని విమర్శించారు. కాంగ్రెస్ ఆడబిడ్డను గెలిపిస్తే సమస్యలపై నిరంతరం పోరాడుతుందని హామీ ఇచ్చారు.

Updated On 18 Oct 2022 5:01 PM GMT
krs

krs

Next Story