Saturday, April 1, 2023
More
    HomelatestChandrababu : గెలవని సీట్లో బీసీ మహిళ.. చంద్రబాబు చాణక్యం..

    Chandrababu : గెలవని సీట్లో బీసీ మహిళ.. చంద్రబాబు చాణక్యం..

    • ఎమ్మెల్సీ అభ్యర్థిగా పంచుమర్తి అనురాధ

    Chandrababu Chanakyam..

    విధాత‌: ఆంధ్రప్రదేశ్(AndhraPradesh) శాసన మండలి(Legislative Council)కి ఎన్నికలు జరుగుతున్నాయి… గవర్నర్(Governor) కోటా, స్థానిక సంస్థల కోటా, శాసన సభ్యుల కోటా, ఇంకా పట్టభద్రులు, ఉపాధ్యాయ నియోజకవర్గాలకు సంబంధించి వేర్వేరు కేటగిరీల్లో పోటీ చేసేందుకు అధికార వైసీపీ(YCP), ప్రతిపక్ష టీడీపీ(TDP)లు బరిలో దిగుతున్నాయి.

    ఉపాధ్యాయ, పట్టభద్రుల కోటాకు సంబంధించి ఎవరి సత్తా వారిదే కానీ మిగతా విభాగాలకు మాత్రం వైసీపీ వారి ఆధిపత్యం స్పష్టంగా ఉంది… ఇక్కడ ఒక్కో ఎమ్మెల్సీ గెలుపునకు దాదాపు 23 మంది ఎమ్మెల్యేలు ఓట్లు వేయాలి.. వాస్తవానికి టిడిపికి అదే సంఖ్యలో ఎమ్మెల్యేలు గెలిచినా వారిలో నలుగురు వైసిపి వైపు మారిపోవడంతో అసెంబ్లీలో టిడిపి ఎమ్మెల్యేల సంఖ్యా 19కి తగ్గిపోయింది.. అయినా సెట్…దింపుడు కళ్ళం ఆశతో చంద్రబాబు మాత్రం విజయవాడకు చెందిన పంచుమర్తి అనురాధ అనే బీసీ నాయకురాలికి టికెట్ ఇచ్చి.. పార్టీ ఎమ్మెల్యేలకు విప్ జారీ చేసారు.. వైసిపి వైపు మారిపోయిన వల్లభనేని వంశి, మద్దాలి గిరి, వాసుపల్లి గణేష్ వంటి వాళ్ళు కూడా ఓటేస్తే తప్ప ఆమె గెలిచే ఛాన్స్ లేదు కానీ.. ఆమెకు టికెట్ ఇచ్చినట్లు జస్ట్ ఓ కలరింగ్ ఇచ్చేసారు… అదే ఖచ్చితంగా గెలిచే సీట్ ఐతే ఆమెకు ఇచ్చేవారు కాదని, ఓ ప్రయోగం కాబట్టే ఆమెకు ఇచ్చారని పార్టీలో గుసగుసలు వినిపిస్తున్నాయి.

    గతంలో కూడా ఇదే విధంగా తెలంగాణ‌కు చెందిన టీడీపీ సీనియ‌ర్ నాయ‌కుడు మోత్కుప‌ల్లి న‌ర్సింలును సైతం బీజేపీతో ఒప్పించి గ‌వ‌ర్న‌ర్ పోస్టును ఇప్పిస్తాన‌ని ప్ర‌లోభ పెట్టి చివరికి ఉత్తి చేతులు చూపించారు. ప్ర‌తిప‌క్షంలో ఉన్న‌ప్పుడు టీడీపీ ద‌క్కే ఒకే ఒక్క పీఏసీ చైర్మ‌న్ ప‌ద‌విని మాత్రం పయ్యావుల కేశ‌వ్ కు ఇచ్చ‌కున్నాడు త‌ప్ప‌ వేరే బీసీ, ఎస్సీలకు ఇవ్వలేదు. ఈసారి కూడా గెలవని సీటు ఆమెకు ఇచ్చి ఓటమిని ఆమె ఖాతాలో వేసేందుకు చంద్రబాబు ప్రయత్నిస్తున్నారని అంటున్నారు. ఖచ్చితంగా గెలిచే సీట్ ఐతే ఆమెకు ఇచ్చేవారు కాదని అంటున్నారు.

    spot_img
    RELATED ARTICLES

    Latest News

    Cinema

    Politics

    Most Popular