Friday, October 7, 2022
More
  Home latest కాబోయే భార్య న‌గ్న చిత్రాలు ఆన్‌లైన్‌లో.. చంపేసిన యువ‌తి

  కాబోయే భార్య న‌గ్న చిత్రాలు ఆన్‌లైన్‌లో.. చంపేసిన యువ‌తి

  విధాత‌: అత‌ను ఓ డాక్ట‌ర్.. ఆమె ఆర్కిటెక్ట్‌.. ఆ ఇద్ద‌రి మ‌ధ్య సోష‌ల్ మీడియా వేదిక‌గా ప‌రిచ‌యం ఏర్ప‌డింది. ఆ ప‌రిచ‌యం కాస్త ప్రేమ‌గా మారింది. త‌మ మ‌న‌సులో మాట‌ను త‌మ త‌మ కుటుంబ స‌భ్యుల‌కు కూడా చెప్పేశారు. కుటుంబ స‌భ్యుల నుంచి కూడా గ్రీన్ సిగ్న‌ల్ వ‌చ్చేసింది. ఇక మిగిలింది పెళ్లి మాత్ర‌మే. కానీ అంత‌లోనే ఆ డాక్ట‌ర్ ఓ పాడు ప‌ని చేశాడు.

  కాబోయే భార్య న‌గ్న చిత్రాల‌ను ఫేక్ ఐడీతో ఇన్‌స్టాలో పోస్టు చేశాడు. ఆ ఫోటోలు కాస్త కాబోయే భార్య కంట‌ప‌డ‌టంతో అత‌న్ని నిల‌దీసింది. స‌ర‌దా కోస‌మే ఆ న‌గ్న చిత్రాల‌ను ఇన్‌స్టాలో పోస్టు చేశాన‌ని చెప్ప‌డంతో ఆమె షాక్‌కు గురైంది. ఒక్క క్ష‌ణం కూడా ఆలోచించ‌కుండా అత‌న్ని చంపేసింది.

  వివ‌రాల్లోకి వెళ్తే.. వికాస్ రాజ‌న్ అనే యువ‌కుడు ఉక్రెయిన్‌లో ఎంబీబీఎస్ పూర్తి చేసి చెన్నైలో ప్రాక్టీస్ ప్రారంభించాడు. ఇటీవ‌లే బెంగ‌ళూరుకు వ‌చ్చేసి, కొత్త ఉద్యోగంలో జాయిన్ అయ్యాడు. బెంగ‌ళూరులో వైద్యుడిగా కొన‌సాగుతూనే, విదేశాల్లో వైద్య విద్య‌ను అభ్య‌సించాల‌నుకునే వారికి శిక్ష‌ణ ఇస్తున్నాడు.

  అయితే రెండేండ్ల క్రితం సోష‌ల్ మీడియాలో వికాస్‌కు ఆర్కిటెక్ట్‌ ప్ర‌తిభ ప‌రిచ‌య‌మైంది. ఆమెతో ఏర్ప‌డిన ప‌రిచ‌యం కాస్త ప్రేమ‌గా మారడంతో వికాస్‌, ప్ర‌తిభ క‌లిసి ఉండ‌టం ప్రారంభించారు. త‌మ ప్రేమ విష‌యాన్ని ఇంట్లో చెప్పేయ‌డంతో, వారు కూడా అంగీక‌రించారు. ఇక పెళ్లే మిగిలింది.

  అయితే వికాస్.. త‌న కాబోయే భార్య న‌గ్న చిత్రాల‌ను ఫేక్ ఐడీతో ఇన్‌స్టాలో పోస్టు చేశాడు.ఈ విష‌యం ప్ర‌తిభ‌కు తెలియ‌డంతో నిల‌దీసింది. స‌ర‌దా కోస‌మే అలా చెప్ప‌డంతో ఆమె మ‌రింత ఆగ్ర‌హావేశాల‌కు లోనైంది. అదే రోజు రాత్రి గెట్ టు గెదర్ ఏర్పాటు చేసి వికాస్‌ను పిలిచింది. ఈ పార్టీకి ప్ర‌తిభ స్నేహితులు కూడా హాజ‌ర‌య్యారు.

  పార్టీ మ‌ధ్య‌లోనే వికాస్‌కు, ప్ర‌తిభ‌కు మ‌ధ్య తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది. ఆ త‌ర్వాత వికాస్‌ను ప్ర‌తిభ త‌న స్నేహితుల‌తో క‌లిసి తీవ్రంగా కొట్టింది. అత‌ను స్పృహ కోల్పోవ‌డంతో ఆస్ప‌త్రికి త‌ర‌లించారు. కోమాలోకి వెళ్లిన వికాస్ ప్రాణాలు కోల్పోయాడు.

  వికాస్ మృతిపై కేసు న‌మోదు చేసుకున్న బెంగ‌ళూరు పోలీసులు ద‌ర్యాప్తు చేప‌ట్టారు. వికాస్ మృతికి త‌న‌కు ఎలాంటి సంబంధం లేద‌ని ప్ర‌తిభ మొద‌ట చెప్పింది. కానీ పోలీసులు త‌మ‌దైన శైలిలో విచారిచంగా చేసిన నేరాన్ని ఆమె అంగీకరించింది. దీంతో ప్ర‌తిభ‌తో పాటు ఆమె స్నేహితులైన గౌతమ్, సుశీల్, సునీల్‌ను పోలీసులు అరెస్టు చేశారు.

  RELATED ARTICLES

  అయ్యబాబోయ్.. థమన్‌ని పట్టుకోలేకపోతున్నారుగా!

  విధాత: థమన్.. టాలీవుడ్‌లో మిస్సైల్‌లా దూసుకుపోతున్న పేరు. ఆయన సంగీతానికి ఇప్పుడు ప్రత్యేక ఫ్యాన్స్ ఉన్నారు. ఆయన సంగీతం అందించిన సినిమా అంటే.. థియేటర్లలో సౌండ్ బాక్స్‌లు మార్పించుకుంటున్న థియేటర్స్...

  మీరు క్రెడిట్ కార్డు వాడుతున్నారా..? అయితే, మీకు గుడ్ న్యూస్‌!

  విధాత: రెగ్యుల‌ర్‌గా క్రెడిట్ కార్డు వినియోగించే క‌స్ట‌మ‌ర్ల‌కు నేష‌న‌ల్ పేమెంట్స్ కార్పొరేష‌న్ ఆఫ్ ఇండియా శుభ‌వార్త వినిపించింది. రూపే క్రెడిట్ కార్డుతో రూ.2000 వ‌ర‌కు జ‌రిపే యూపీఐ ట్రాన్సాక్ష‌న్స్ మీద...

  గరికపాటినీ వదలని మెగా బ్రదర్.. సోషల్ మీడియాలో సెటైర్!

  విధాత: ‘‘ఏపాటి వాడికైనా చిరంజీవిగారి ఇమేజ్ చూస్తే ఆ పాటి అసూయ పడటం పరిపాటే’’.. ఇది నాగబాబు చేసిన ట్వీట్. ఇది గరికపాటి వారినే అని ఎలా, ఎందుకు అనుకోవాలి...

  Most Popular

  ఆస్కార్‌కు RRR.. ఇప్పుడైనా కల నెరవేరుతుందా?

  విధాత: దర్శకధీరుడు ఎస్.ఎస్. రాజమౌళి ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించిన చిత్రం ‘RRR’. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద పెను ప్రభంజనాన్ని సృష్టించిన విషయం తెలిసిందే. ఇద్దరు స్టార్ హీరోలతో రాజమౌళి...

  You cannot copy content of this page