Walnuts | అన్ని తరగతుల విద్యార్థులకు( Students ) పబ్లిక్ పరీక్షలు( Public Exams ) కొనసాగుతున్నాయి. పబ్లిక్ పరీక్షల నేపథ్యంలో విద్యార్థులు తీవ్ర ఒత్తిడికి గురవుతారు. చదివింది గుర్తుండక సతమతమవుతుంటారు. ఒకానొక దశలో బుర్ర హీటెక్కిపోతోంది. ఏ ప్రశ్న చదవాలో అర్థం కాక కన్ఫ్యూజన్‌కు గురవుతుంటారు. ఎగ్జామ్ హాల్‌లో కూడా ఆందోళన చెందుతారు విద్యార్థులు. మరి ఇలాంటి విద్యార్థులు ఈ ఎగ్జామ్ టైమ్‌లో ఒక చిన్న చిట్కా పాటిస్తే.. పరీక్షల్లో సులభంగా విజయం సాధించొచ్చు. అంతే కాదు జ్ఞాపకశక్తిని మెరుగు పరుచుకోవచ్చు. ఆ చిట్కా ఏంటంటే ప్రతి రోజు రాత్రి పూట ఓ రెండు వాల్‌నట్స్‌ను నానబెట్టి పొద్దున్నే ఖాళీ కడుపున తినడమే.
- వాల్‌నట్స్‌లో ప్రోటీన్, ఇనుము, రాగి, కాల్షియం, మెగ్నీషియం, ఒమెగా -3 ఫ్యాటీ యాసిడ్స్ వంటి పోషకాలు ఉంటాయి.
- ప్రతి రోజు వాల్ నట్స్ తినే పిల్లల్లో మానసిక అభివృద్ధి గట్టిగా ఉంటుంది.
- వాల్ నట్స్ తినడం వల్ల చదువు ఒత్తిడి కూడా తగ్గించుకోవచ్చు.
- పరీక్షల సమయంలో నానబెట్టిన వాల్ నట్స్ తినడం వల్ల మెదడు చురుకుగా పని చేస్తుంది. తద్వారా జ్ఞాపకశక్తిని మెరుగుపరుచుకోవచ్చు.
- ఇలా ప్రతి రోజు వాల్ నట్స్ తినడం వల్ల చదివింది గుర్తుండిపోతుంది. పరీక్షల్లో మీరు అనుకున్నట్టే అత్యధిక స్కోర్ సాధించే అవకాశం ఉంటుంది.