Best Teacher | కోటకొండ పుష్పలతకు ఉత్తమ ఉపాధ్యాయురాలు అవార్డు
Best Teacher | విధాత, కదిరి,సెప్టెంబర్ 5: శ్రీ సత్యసాయి జిల్లా ఓబుళదేవరచెరువు మండలం నాయనకోట తండా ఎంపిపిఎస్ స్కూలు హెడ్మాస్టర్ కోటకొండ పుష్పలత ఉత్తమ ఉపాధ్యాయురాలు అవార్డుకు ఎంపికయ్యారు. జాతీయ ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా కదిరి సిమ్స్ హాస్పటల్ ఆధ్వర్యంలో స్థానిక షాలిమర్ ఫంక్షన్ హాలులో మంగళవారం సాయంత్రం పలువురి ఉపాధ్యాయులకు సన్మానం చేశారు. ఓబుళదేవరచెరువు మండలం నుంచి ఈ అవార్డుకు కొండకమర్ల హిందీ టీచర్ కె. ఖాదర్ బాష, ఎస్టీటీ టీచర్ బి. సోమశేఖర్ […]

Best Teacher |
విధాత, కదిరి,సెప్టెంబర్ 5: శ్రీ సత్యసాయి జిల్లా ఓబుళదేవరచెరువు మండలం నాయనకోట తండా ఎంపిపిఎస్ స్కూలు హెడ్మాస్టర్ కోటకొండ పుష్పలత ఉత్తమ ఉపాధ్యాయురాలు అవార్డుకు ఎంపికయ్యారు. జాతీయ ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా కదిరి సిమ్స్ హాస్పటల్ ఆధ్వర్యంలో స్థానిక షాలిమర్ ఫంక్షన్ హాలులో మంగళవారం సాయంత్రం పలువురి ఉపాధ్యాయులకు సన్మానం చేశారు.
ఓబుళదేవరచెరువు మండలం నుంచి ఈ అవార్డుకు కొండకమర్ల హిందీ టీచర్ కె. ఖాదర్ బాష, ఎస్టీటీ టీచర్ బి. సోమశేఖర్ నాయక్‌లతో పాటు ఎన్‌పి కుంట మండలానికి చెందిన ఉపాధ్యాయులు బోగాధిరెడ్డి, వెంకటేశ్వర్లు, అనుసూయమ్మలు ఎంపికయ్యారు.
ఉత్తమ ఉపాధ్యాయులకు సిమ్స్ హాస్పిటల్స్ నిర్వాహకులు బి. నిసార్ యాసిన్ ఖాన్, బి. వసీం యాసిన్ ఖాన్‌లు శాలువతోపాటు, మెమెంటో బహూకరించారు. ఈ కార్యక్రమంలో పలువురు పట్టణ ప్రముఖులతో పాటు శ్రీ సత్యసాయి జిల్లా ఉపాధ్యాయ సంఘం నాయకులు కట్టుబడి గౌస్ లాజం పాల్గొన్నారు.
