విధాత: తెలుగు సినీ పరిశ్రమలో దాసరి నారాయణరావు తర్వాత తమ్మారెడ్డి భరద్వాజను ఇండస్ట్రీ పెద్దగా కార్మికులు భావిస్తారు. వాస్తవానికి ఆయన తనకు ఆ స్థాయి లేదని అంటూ ఉంటారు. ఎందుకంటే ఆయన ప్రతిదీ ముక్కు సూటిగా మాట్లాడతారు. ఏదైనా మొహానే చెప్పేస్తారు. అభిప్రాయాలను చెబుతూ యూట్యూబ్ ఛానల్ కూడా రన్ చేస్తున్నారు.
తమ్మారెడ్డి భరద్వాజ గురించి తెలిసినవారు ఆయనను అన్నయ్య, గురువుగారు అని పిలుస్తూ ఉంటారు. దాసరి తర్వాత అలా పిలిపించుకునే కార్మిక నాయకుడు సినీ కార్మికుడు భరద్వాజ. ఇక ఇండస్ట్రీ పెద్ద ఎవరు అనే విషయం పక్కన పెడితే తాజాగా తమ్మారెడ్డి భరద్వాజ మాట్లాడుతూ చిరంజీవిపై కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు.
చిరంజీవి లాంటి మెగాస్టార్‌ని ఏదో జాకీలు పెట్టి లేపాల్సిన అవసరం లేదు. ఆయన స్థాయి, రేంజ్ వేరు. ఇండస్ట్రీలో చిరంజీవి, బాలకృష్ణకి పడదని ఏదేదో అనుకుంటారు. కానీ అలా ఏముండదు. ఇక ప్రతి ఒక్క స్టార్ హీరోకి ఒక బ్యాడ్ టైమ్ ఉంటుంది. దాన్ని అధిగమించి వచ్చిన వాళ్ళు మళ్ళీ స్టార్స్ అవుతారు.
అధిగమించలేనోళ్లు అస్తమిస్తారు. కొందరు చిరంజీవికి మార్కెట్ తగ్గిపోయిందని.. రెండో హీరో ఉంటేనే చిరంజీవి సినిమాలు ఆడుతాయని పిచ్చి కూతలు కూస్తున్నారు.
నాకు తెలిసి అప్పటికీ ఇప్పటికీ ఎప్పటికీ టాలీవుడ్లో నెంబర్ వన్ నుంచి నెంబర్ 10 వరకు అన్నీ చిరంజీవి. ఆయన స్థాయి, మార్కెట్, రేంజ్ ఆయనకు ఉన్నాయి. ఇటీవల బాలకృష్ణకి వరుసగా రెండు ఫ్లాప్స్ వచ్చాయి. కానీ ఇప్పుడు బాలయ్య ఓవర్ కమ్ అయ్యాడు. ఇలా ఉంటుంది… సినీ పరిశ్రమ అంటే.
ఇటీవల ఎవరో చిరంజీవికి రెడ్ కార్పెట్ పరిచారు.. తర్వాత తక్కువగా మాట్లాడారు అని నాగబాబు వ్యాఖ్యానించాడు. నాకు తెలిసి చిరంజీవి గారు కొన్ని విషయాలను అస్సలు పట్టించుకోరు. నిజం చెప్పాలంటే చిరంజీవిగారు ఆ స్థాయికి మించి ఎదిగిపోయారు. ఆయనకు పట్టించుకోవాల్సిన అవసరం కూడా లేదు.
ఆ రెడ్ కార్పెట్ పరిచిన వ్యక్తి చిరంజీవిగారితో ఏ అవసరం ఉండి అలా చేశాడో తెలీదు. అలాంటి విషయాలను అనవసరంగా నాగబాబు మాట్లాడడం తగ్గిస్తే.. ఆయన సైలెంట్‌గా ఉంటే ఉత్తమమని నా అభిప్రాయం అని చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం తమ్మారెడ్డి చేసిన ఈ వ్యాఖ్యలపై ఇండస్ట్రీలో బాగానే చర్చలు నడుస్తున్నాయి.