Wednesday, March 29, 2023
More
    HomelatestH3N2 | అచ్చం కరోనాలాగే పెరుగుతున్న ఇన్‌ఫ్లుఎంజా వైరస్‌ కేసులు.. జాగ్రత్తగా ఉండాలని ఎయిమ్స్‌ మాజీ...

    H3N2 | అచ్చం కరోనాలాగే పెరుగుతున్న ఇన్‌ఫ్లుఎంజా వైరస్‌ కేసులు.. జాగ్రత్తగా ఉండాలని ఎయిమ్స్‌ మాజీ డైరెక్టర్‌ గులేరియా

    H3N2 | కరోనా మహమ్మారి తర్వాత ఇప్పుడు దేశవ్యాప్తంగా కొత్త ఫ్లూ కేసులు నమోదవుతున్నాయి. ఈ ఫ్లూ హెచ్‌3ఎన్‌2 ఇన్‌ఫ్లుఎంజా వైరస్‌ కేసులు నమోదువుతున్నాయి. ఈ క్రమంలో ఢిల్లీ ఎయిమ్స్‌ మాజీ డైరెక్టర్‌ డాక్టర్‌ రణదీప్‌ గులేరియా హెచ్చరించారు. వైరస్‌ తుపర్ల ద్వారా వ్యాపిస్తుందని పేర్కొన్నారు.

    ప్రస్తుతం జర్వాల కేసులు పెరుగుతున్నాయన్నారు. జ్వరం, గొంతు నప్పి, శరీర నొప్పి, ముక్కు నుంచి నీరుకారడం తదితర లక్షణాలు కనిపిస్తాయి. ఇది ఒక రకమైన ఇన్‌ఫ్లుఎంజా వైరస్‌. ఈ వైరస్‌ ఏటా ఏదో ఒక మార్పుతో విజృంభిస్తుందని, ఆసుపత్రిలో చేరే రోగుల సంఖ్య ఎక్కువగా లేనందున పెద్దగా ఆందోళన చెందాల్సిన అవసరం లేదని డాక్టర్ గులేరియా పేర్కొన్నారు.

    రెండు నెలల నుంచి పెరుగుతున్న జ్వరాల తీవ్రత

    ఇన్‌ఫ్లుఎంజా-A ఉప రకం H3N2తో వస్తుంది. గత రెండు మూడు నెలలుగా దేశంలో ఈ సమస్య కొనసాగు తోంది. ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ (ICMR) నిపుణులు దీనికి ఇన్‌ఫ్లుఎంజా-A సబ్‌ వేరియంట్‌ H3N2 కారణమని పేర్కొంది. ఇతర ఉపరకాలతో పోలిస్తే.. దీని బారిన పడిన ఎక్కువ మంది వ్యక్తులు ఆసుపత్రి పాలయ్యారు. వైరస్ నుంచి తమను తాము రక్షించుకోవడానికి ప్రజలు చేయాల్సిన, చేయకూడని జాబితాను విడుదల ఐఎంఏ విడుదల చేసింది.

    జలుబు, వికారం పెరుగుతున్న కేసుల మధ్య యాంటీబయాటిక్స్ విచక్షణారహిత వినియోగానికి వ్యతిరేకంగా అడ్వైజరీని జారీ చేసింది. సీజనల్ జ్వరం ఐదు నుంచి ఏడు రోజుల వరకు ఉంటుందని పేర్కొంది. చాలా సందర్భాలో జ్వరం మూడు రోజుల్లో నయమవుతుందని ఐఎంఏ నిపుణుల కమిటీ పేర్కొంది. వాయు కాలుష్యం కారణంగా వైరల్ కేసులు కూడా పెరిగాయని, ఇది ఎక్కువగా 15 ఏళ్లలోపు, 50 ఏళ్లు పైబడిన వారిలో వస్తుందని కమిటీ తెలిపింది. ఇది జ్వరంతో ఎగువ శ్వాసకోశ సంక్రమణకు కారణమవుతుందని పేర్కొంది.

    పాటించాల్సిన జాగ్రత్తలు

    • బహిరంగంగా మాస్క్ ధరించాలి
    • క్రమం తప్పకుండా చేతులు కడుక్కోవాలి.
    • కరచాలనం చేయడం మానుకోవడంతో పాటు బహిరంగ ప్రదేశాల్లో ఉమ్మివేయడం మానాలి.
    • కండ్లు, ముక్కును తాకకుండా ఉండాలి.
    • దగ్గుతున్నప్పుడు నోరు, ముక్కును కప్పి ఉంచాలి.
    • కాలుష్య ప్రదేశాలకు దూరంగా ఉండాలి.
    • నీరు, పండ్ల రసాలు వంటివి ఎక్కువగా తీసుకోవాలి.
    • ఒంటి నొప్పి, జ్వరం ఉన్నట్లు అనిపిస్తే పారాసెటమాట్‌ మాత్రను వేసుకోవాలి.
    spot_img
    RELATED ARTICLES

    Latest News

    Cinema

    Politics

    Most Popular