Bhaskar Reddy | విధాత: వివేకా హత్య కేసులో సీబీఐ అరెస్ట్ నుంచి ముందస్తు బెయిల్ తో కడప ఎంపీ అవినాష్ రెడ్డి తప్పించుకున్నా ఆయన తండ్రి భాస్కర్ రెడ్డి మాత్రం బెయిల్ లేక ఇంకా జైల్లోనే ఉంటున్నారు. ఆయన భవితవ్యం మంగళవారం తేలనుంది. వివేకా హత్యకేసును జూన్ నెలాఖరుకు ముగించాలని సుప్రీం కోర్టు డెడ్ లైన్ పెట్టగా ఈ కేసులో ఇప్పటికే అవినాష్ తండ్రి భాస్కర్ రెడ్డిని..ఇంకొందరు అనుమానితులను సీబీఐ అరెస్ట్ చేసింది. అదే కేసులో […]

Bhaskar Reddy |
విధాత: వివేకా హత్య కేసులో సీబీఐ అరెస్ట్ నుంచి ముందస్తు బెయిల్ తో కడప ఎంపీ అవినాష్ రెడ్డి తప్పించుకున్నా ఆయన తండ్రి భాస్కర్ రెడ్డి మాత్రం బెయిల్ లేక ఇంకా జైల్లోనే ఉంటున్నారు. ఆయన భవితవ్యం మంగళవారం తేలనుంది.
వివేకా హత్యకేసును జూన్ నెలాఖరుకు ముగించాలని సుప్రీం కోర్టు డెడ్ లైన్ పెట్టగా ఈ కేసులో ఇప్పటికే అవినాష్ తండ్రి భాస్కర్ రెడ్డిని..ఇంకొందరు అనుమానితులను సీబీఐ అరెస్ట్ చేసింది.
అదే కేసులో అవినాష్ రెడ్డిని కూడా అరెస్ట్ చేద్దామని సీబీఐ భావించినా తెలంగాణ హైకోర్టు ఆయనకు ముందస్తు బెయిల్ ఇవ్వడంతో ఆయన అరెస్ట్ నుంచి తప్పించుకున్నారు. ఇక అరెస్ట్ అయి జైల్లో ఉన్న భాస్కర్ రెడ్డి బెయిల్ విషయమై కోర్టులో వాదనలు జరిగాయి.
ఆ హత్యతో భాస్కర్‌రెడ్డికి ఎలాంటి సంబంధం లేదని, బెయిల్ మంజూరు చేయాలని ఆయన తరపు న్యాయవాదులు కోరగా దర్యాప్తు సాగుతోందని, ఈ దశలో ఆయనకు బెయిల్ ఇవ్వొద్దని సీబీఐ తరపు న్యాయవాదులు వాదించారు. దీంతో విచారణను కోర్టు మంగళవారానికి వాయిదా వేసింది.
కేవలం తన అరెస్టును అడ్డం పెట్టుకొని తన కుమారుడిని సైతం అరెస్ట్ చేయాలని సీబీఐ చూస్తోందని భాస్కర్ రెడ్డి వాదిస్తున్నారు. మంగళవారం ఆయన భవితవ్యం తేలనుంది.
