Bhatti Vikramarka |
- ధరణితో పేదల భూములు లాక్కున్నారు
- ఓయూ, కేయూలకు వెళ్లి వచ్చే దమ్ము కేటీఆర్,తలసానిలకు ఉందా?
- సీఎల్‌పీ నేత మల్లు భట్టి విక్రమార్క
విధాత: పేదల భూములను భూ భకాసురులు లాక్కోవడానికి ఉపయోగపడిన సోమేశ్ కుమార్‌ను సలహాదారు పదవిని రద్దు చేసి, విచారించాలని సీఎల్‌పీ నేత మల్లు భట్టి విక్రమార్క (Bhatti Vikramarka) ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. బుధవారం ఆయన రంగారెడ్డి జిల్లా మహేశ్వరం మండలంలోని మామిడిపల్లి గ్రామంలో మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ పేదలకు ఇచ్చిన భూములను ధరణి పేరుతో లాక్కోని రియల్ ఎస్టేట్‌వ్యాపారం చేస్తున్నారని ఆరోపించారు.
తమ పార్టీ అధికారంలోకి వచ్చిన తరువాత కేసీఆర్ గుంజుకున్న భూములన్నీ తిరిగి పేదలకు ఇస్తామని ప్రకటించారు. సోమేశ్ కుమార్ కనుసన్నల్లోనే హైదరాబాద్ చుట్టుపక్కల లక్ష కోట్ల రూపాయల విలువ చేసే భూములు చేతులు మారాయని భట్టి ఆరోపించారు ఒక్క ఇబ్రహింపట్నంలోనే రూ. 5 లక్షల కోట్ల విలువైన భూములు లాక్కున్నారన్నారు.
రాష్ట్ర వ్యాప్తంగా రూ. 25 లక్షల కోట్ల భూములు లాక్కునే ప్లాన్‌లో సూత్రధారి సోమేశ్ కుమార్ అని ఆరోపించారు. దీని కోసమే ఆయనను తీసుకువచ్చి సలహాదారుగా నియమించుకున్నారన్నారు. ఫార్మా సిటీ కట్టుకోవాలంటే పేదల భూములే ఎందుకు లాక్కోవాలని, గజ్వెల్ సిరిసిల్లలో మీ భూములు లేవా? అని ప్రశ్నించారు. ఇప్పటికే ధరణితో ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారన్నారు. తిరిగి సోమేశ్ కుమార్‌ను సలహాదారుగా నియమించడమంటే మళ్లీ దోపిడీని ప్రారంభించినట్లేనని అన్నారు.
ఏపీకి వెళ్లకుండా సలహాదారుగా పని చేయడంపై ఆసక్తి ఎందుకో.. ఆలిండియా సర్వీసెస్ అధికారులైన ఐఏఎస్ లు ఏరాష్ట్రానికి కేటాయిస్తే గౌరవంగా ఆ రాష్ట్రానికి వెళ్లి పనిచేసుకోవాలని మల్లు భట్టి విక్రమార్క అన్నారు. అలా కాకుండా సోమేశ్ కుమార్ ఏపీ కి వెళ్లకుండా సీఎం ప్రధాన సలహాదారుడిగాఆ పనిచేయడం పై ఆసక్తి ఎందుకని ప్రశ్నించారు. దీని వెనుక ఉన్న ఆంతర్యం ఏమిటని ప్రశ్నించారు.
సోమేష్ కు సలహాదారు పదవి పై Mallu Bhatti Vikramarka ఆగ్రహం – TV9 #SomeshKumar #BhattiVikramarka #Telangana pic.twitter.com/ybdBNIY1kY
— TV9 Telugu (@TV9Telugu) May 10, 2023
అభివృద్ధికి ఐఏఎస్‌లు కానీ అమ్మకానికి కాదు..
ఐఏఎస్ అధికారులు అభివృద్ధికి పాటు పడాలి కానీ, అమ్మకానికి కాదని భట్టి విక్రమార్క హితవు పలికారు. ఓ ఆర్ ఆర్ లీజు వెనక సోమేశ్ కుమార్, అరవింద్ ఉన్నారని ఆరోపించారు. 30 సంవత్సరాలు లీజ్ కు ఇచ్చే ఐడీయా ఏమిటని ప్రశ్నించారు. వచ్చే 30 సంవత్సరాల ఆదాయం ఇప్పుడు తీసుకుంటే..వచ్చే ప్రభుత్వాలు ఏం చేయాలని అడిగారు.
ఇంత మంది సలహాదారులెందుకు?
రాష్ట్రానికి ఇంత మంది సలహాదారులు ఎందుకు అని భట్టి ప్రభుత్వాన్నిప్రశ్నించారు. రిటైర్ అధికారుల తో ప్రభుత్వం ను నడుపాలనుకుంటుంన్నారా అని అన్నారు. లక్షల కోట్లు ఖర్చు పెట్టే ఇరిగేషన్ శాఖ కు రిటైర్ అయిన వ్యక్తి ని ఈన్సీగా ఎలా కొనసాగిస్తారన్నారు. సోమేశ్ కుమార్ ను సలహాదారుగా నియమించడం అంటే..మళ్ళీ దోపిడీ ప్రారంబించినట్లేనని అన్న భట్టి వెంటనే సోమేశ్ కుమార్ సలహాదారు పదవి ని రద్దు చేసి, విచారణ చేయాలన్నారు.
సంక్షేమంలో కోతలు పెట్టడం తప్ప బీఆర్‌ఎస్ చేసిందేమీ లేదు
కాంగ్రెస్ సంక్షేమం లో కోత పెట్టడం తప్ప బీఆర్ఎస్ చేసింది ఏమిటని భట్టి ప్రశ్నించారు. ఇంధిరాగాంధీ ,ప్రియాంక గాంధీ ల గురించి మాట్లాడే అర్హత తలసాని కి లేదన్నారు. ఉద్యమంలో యువకుల మృతికి బి ఆర్ ఎస్ కారణమన్నారు. కేటీఆర్ ఉస్మానియా యూనివర్సిటీ కి ,కాకతీయ యూనివర్సిటీ కి వెళ్లి వచ్చే దమ్ము కేటీఆర్ కు తలసాని కి ఉందా? అని ప్రశ్నించారు. బెదిరింపు లతో ప్రభుత్వం ఎంత కాలం నడుస్తుందన్నారు.