Vijay Antony | చెన్నైలోని నివాసంలో ఉరేసుకొని బలవన్మరణం విధాత: ప్రఖ్యాత సినీ నటుడు, సంగీత దర్శకుడు విజయ్ ఆంటోని ఇంట్లో విషాదం నెలకొన్నది. ఆయన కుమార్తె మీరా (16) మంగళవారం ఆత్మహత్య చేసుకున్నది. చెన్నైలోని నివాసంలో ఉరేసుకొని బలవన్మరణానికి పాల్పడ్డారు. చెన్నైలోని ఓ ప్రైవేటు స్కూల్‌లో 12వ తరగతి చదువుతున్న మీరా.. కొన్నాళ్లుగా మానసిక ఒత్తిడితో బాధపడుతున్నది. ఇందుకు చికిత్స కూడా తీసుకుంటున్నట్టు తెలుస్తున్నది. చెన్నైలోని తేనంపేటలో ఉన్న ఆంటోని నివాసంలో మంగళవారం తెల్లవారుజామున 3 […]

Vijay Antony |
చెన్నైలోని నివాసంలో ఉరేసుకొని బలవన్మరణం
విధాత: ప్రఖ్యాత సినీ నటుడు, సంగీత దర్శకుడు విజయ్ ఆంటోని ఇంట్లో విషాదం నెలకొన్నది. ఆయన కుమార్తె మీరా (16) మంగళవారం ఆత్మహత్య చేసుకున్నది. చెన్నైలోని నివాసంలో ఉరేసుకొని బలవన్మరణానికి పాల్పడ్డారు.
చెన్నైలోని ఓ ప్రైవేటు స్కూల్‌లో 12వ తరగతి చదువుతున్న మీరా.. కొన్నాళ్లుగా మానసిక ఒత్తిడితో బాధపడుతున్నది. ఇందుకు చికిత్స కూడా తీసుకుంటున్నట్టు తెలుస్తున్నది.
చెన్నైలోని తేనంపేటలో ఉన్న ఆంటోని నివాసంలో మంగళవారం తెల్లవారుజామున 3 గంటల ప్రాంతంలో తన బెడ్‌రూమ్‌లో మీరా ఉరేసుకొని కనిపించింది. ఆమెను హుటాహుటిన సమీపంలోని దవాఖానకు తరలించారు. అయితే, అప్పటికే ఆమె చనిపోయినట్టు వైద్యులు ధ్రువీకరించారు.
మానసిక ఒత్తిడితో బాధపడుతున్న మీరా.. డిప్రెషన్‌లో తీవ్ర నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తున్నది.
పూర్తి వివరాలు తెలియాల్సి ఉన్నది. పోలీసులు కేసు నమోదు చేసుకొని అన్ని కోణాల్లో దర్యాప్తు జరుపుతున్నారు.
