ఉన్న‌మాట‌: తెలుగు రాష్ట్రాల్లో విస్తృతంగా ప్రాచుర్యం పొందిన బిగ్ బాస్ ఇప్పుడు కోర్టు బోనులో నిలబడింది. నాగార్జున హోస్ట్‌గా నడుస్తున్న ఈ ప్రోగ్రాం ఇప్పటికే పలు సీజన్లను పూర్తి చేసుకుని ఇంకో సీజన్‌ని ఇప్పుడు కొనసాగిస్తోంది. అయితే ఈ ప్రోగ్రాం మీద ఇప్పటికే పలు ఫిర్యాదులు, తీవ్ర అభ్యంతరాలు వెల్లువెత్తుతున్న విషయం తెలిసిందే. బూతు, సెక్స్ వంటి అనైతిక అంశాలు తప్ప ఇందులో ఏమీ లేదని సీపీఐ నేత కే.నారాయణ బహిరంగంగానే ఆరోపించారు. దీంతో కొందరు వ్యక్తులు […]

ఉన్న‌మాట‌: తెలుగు రాష్ట్రాల్లో విస్తృతంగా ప్రాచుర్యం పొందిన బిగ్ బాస్ ఇప్పుడు కోర్టు బోనులో నిలబడింది. నాగార్జున హోస్ట్‌గా నడుస్తున్న ఈ ప్రోగ్రాం ఇప్పటికే పలు సీజన్లను పూర్తి చేసుకుని ఇంకో సీజన్‌ని ఇప్పుడు కొనసాగిస్తోంది.

అయితే ఈ ప్రోగ్రాం మీద ఇప్పటికే పలు ఫిర్యాదులు, తీవ్ర అభ్యంతరాలు వెల్లువెత్తుతున్న విషయం తెలిసిందే. బూతు, సెక్స్ వంటి అనైతిక అంశాలు తప్ప ఇందులో ఏమీ లేదని సీపీఐ నేత కే.నారాయణ బహిరంగంగానే ఆరోపించారు.

దీంతో కొందరు వ్యక్తులు వేసిన పిటిషన్‌ను విచారణకు తీసుకున్న ఏపీ హైకోర్టు అసలు ఆ ప్రోగ్రాంలో ఏముందో స్వయంగా చూసి నిర్ణయం తీసుకుంటామని పేర్కొంది. ఈ మేరకు తామూ రెండు మూడు ఎపిసోడ్లు చూస్తామని హైకోర్టు వెల్లడించడం విశేషం.

ఎలాంటి సెన్సార్షిప్ లేకుండా ఈ షో ప్రసారమవుతోందని పిటిషనర్ ఆరోపిస్తుస్తున్నారని.. ఈ నేపథ్యంలో ఈ షో పూర్తి వివరాలను తమ ముందుంచాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను హైకోర్టు ఆదేశించింది.

ఈ మేరకు ప్రధాన న్యాయమూర్తి (సీజే) జస్టిస్ ప్రశాంత్ కుమార్ మిశ్రా న్యాయమూర్తి జస్టిస్ డీవీఎస్ఎస్ సోమయాజులతో కూడిన ధర్మాసనం ఉత్తర్వులు జారీ చేసింది.

ఎలాంటి సెన్సార్షిప్ లేకుండా బిగ్బాస్ షో ప్రసారం అవుతోందని పిటిషనర్ తరఫు న్యాయవాది ఏపీ హైకోర్టు దృష్టికి తెచ్చారు. ఇందుకు సంబంధించిన ఫొటోలను పరిశీలించాలని విన్నవించారు.

చివరకు ఈ పోటీలో పాల్గొనే మహిళలకు ప్రెగ్నెన్సీ పరీక్షలు కూడా చేస్తున్నారని అభ్యంతరం వ్యక్తం చేశారు. దీనికి ధర్మాసనం స్పందిస్తూ.. ఈ షోలో ఏముందో తెలుసుకునేందుకు తాము కూడా రెండు మూడు ఎపిసోడ్లు చూస్తామని వెల్లడించింది.

అశ్లీల అనైతిక హింసాత్మక చర్యలను ప్రోత్సహిస్తూ సమాజాన్ని కలుషితం చేస్తున్న బిగ్బాస్ షో ప్రసారాన్ని నిలిపివేసేలా ఆదేశాలు జారీ చేయాలని కోరుతూ సామాజిక కార్యకర్త కేతిరెడ్డి జగదీశ్వరరెడ్డి 2019లోనూ ఇటీవల రెండు ప్రజాప్రయోజన వ్యాజ్యాలను హైకోర్టులో దాఖలు చేశారు. ఈ పిటిషన్లపై తాజాగా హైకోర్టు ధర్మాసనం విచారణ జరిపింది.

ఇటీవల నెగెటివ్ ప్రచారం (నిర్వాహకులే ప్రచారం కోసం వివాదం సృష్టించడం) చేసుకోవడం ఎక్కువైందని ధర్మాసనం వ్యాఖ్యానించడం విశేషం. ఈ వ్యాజ్యం కూడా అందులో భాగమే అనిపిస్తోందని ధర్మాసనం వ్యాఖ్యానించింది. అలాంటిదేమీ లేదని ప్రజా ప్రయోజనాల కోణంలోనే తాము పిల్ దాఖలు చేసినట్టు పిటిషనర్ తరఫు న్యాయవాది శివప్రసాద్రెడ్డి కోర్టుకు నివేదించారు.

Updated On 13 Oct 2022 11:54 AM GMT
somu

somu

Next Story