అరెస్ట్‌ చట్ట వ్యతిరేకమన్న సర్వోన్నత న్యాయస్థానం విధాత: పాకిస్తాన్‌ మాజీ ప్రధాని ఇమ్రాన్‌ ఖాన్‌ (Imran Khan) అరెస్ట్‌ చట్ట వ్యతిరేకమని ఆ దేశ సుప్రీం కోర్టు తీర్పు ఇచ్చింది. పాకిస్తాన్‌లో అధికారంలో ఉన్న పీపీపీ ప్రభుత్వం మంగళవారం మాజీ ప్రధాని ఇమ్రాన్‌ ఖాన్‌ను అరెస్ట్‌ చేసిన విషయం తెలిసిందే. ఇమ్రాన్‌ ఖాన్‌ అరెస్ట్‌కు వ్యతిరేకంగా పాకిస్తాన్‌ అంతటా నిరసనలు జరుగుతున్నాయి. పాకిస్తాన్‌లో క్షణక్షణం పరిస్థితులు మారుతున్నాయి. ఎప్పుడు ఏమవుతుందో తెలియని పరిస్థితి ఏర్పడింది. ఇమ్రాన్‌ ప్రధానిగా […]

  • అరెస్ట్‌ చట్ట వ్యతిరేకమన్న సర్వోన్నత న్యాయస్థానం

విధాత: పాకిస్తాన్‌ మాజీ ప్రధాని ఇమ్రాన్‌ ఖాన్‌ (Imran Khan) అరెస్ట్‌ చట్ట వ్యతిరేకమని ఆ దేశ సుప్రీం కోర్టు తీర్పు ఇచ్చింది. పాకిస్తాన్‌లో అధికారంలో ఉన్న పీపీపీ ప్రభుత్వం మంగళవారం మాజీ ప్రధాని ఇమ్రాన్‌ ఖాన్‌ను అరెస్ట్‌ చేసిన విషయం తెలిసిందే. ఇమ్రాన్‌ ఖాన్‌ అరెస్ట్‌కు వ్యతిరేకంగా పాకిస్తాన్‌ అంతటా నిరసనలు జరుగుతున్నాయి. పాకిస్తాన్‌లో క్షణక్షణం పరిస్థితులు మారుతున్నాయి. ఎప్పుడు ఏమవుతుందో తెలియని పరిస్థితి ఏర్పడింది.

ఇమ్రాన్‌ ప్రధానిగా ఉన్న కాలంలో అవినీతికి పాల్పడి తోషిఖానాలో ప్రభుత్వ ఆస్తులు అమ్ముకున్నారని, అల్‌ ఖదీర్‌ ట్రస్ట్‌ నడిపించడంలో ఇష్టమైన వారికి కాంట్రాక్ట్‌ ఇచ్చి అవినీతికి పాల్పడ్డారన్న ఆరోపణలపై పాక్‌ ప్రభుత్వం అరెస్ట్‌ చేసింది. వాస్తవంగా ఇమ్రాన్‌ ఖాన్‌ ఈ కేసుల్లో ఇస్లామాబాద్‌ హైకోర్టులో సరెండర్‌ కావడానికి వచ్చినప్పుడు పోలీస్‌లు అరెస్ట్‌ చేశారు.

ఇమ్రాన్‌ అరెస్ట్‌తో దేశ వ్యాప్తంగా ఆందోళనలు జరిగాయి. ఆస్తుల విధ్వంసం, కాల్పులు చోటు చేసుకున్నాయి. ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. పరిస్థితులు అదుపు తప్పుతుండడంతో ఇస్లామాబాద్‌లో 144 సెక్షన్‌ విధించారు.

అయితే తన అరెస్ట్‌ను సవాల్‌ చేస్తూ ఇమ్రాన్‌ఖాన్‌ సుప్రీం కోర్టును ఆశ్రయించారు. దీంతో ముగ్గురు జడ్జిలతో కూడిన బెంచ్‌ కేసును విచారించి, గురువారం మధ్యాహ్నం అరెస్ట్‌ చట్ట వ్యతిరేకమని ప్రకటించింది.

పాకిస్తాన్‌ దేశానికి చెందిన ప్రతి పౌరుడు న్యాయం కోసం కోర్టుకు రావచ్చునని తెలిపింది. కోర్టు పరిసరాలలో రిజిస్ట్రార్‌ అనుమతి లేకుండా అరెస్ట్‌ చేయకూడదని, అలా చేసిన అరెస్ట్‌ చట్ట వ్యతిరేకంగా జరిగిన అక్రమ చర్య అవుతుందని ప్రకటించింది.

ఇదే సమయంలో హైకోర్టును విచారించాలని ఆదేశించింది. దీంతో ఇమ్రాన్‌ ఖాన్‌ను పాకిస్తాన్‌ పోలీసులు భారీ బందోబస్తు మధ్య హైకోర్టుకు తీసుకు వెళ్లనున్నారు. అయితే ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరుగకుండా తగిన చర్యలు తీసుకుంటున్నట్లు పోలీసులు తెలిపారు.

ఇమ్రా­న్‌­ఖా­న్‌కు షర­తులతో కూడిన బెయిల్‌

పాకి­స్తాన్‌ మాజీ ప్రధాని ఇమ్రాన్‌ ఖాన్‌కు ఇస్లా­మా­బాద్‌ కోర్టు షర­తులతో కూడిన బెయిల్‌ మంజూరు చేసింది. అల్‌ ఖదీర్‌ ట్రస్ట్‌ కేసులో అరెస్ట్‌ అయిన ఇమ్రాన్‌ ఖాన్‌ కేసును విచా­రిం­చిన సుప్రీం కోర్టు.. ఆయన అరెస్ట్‌ అక్రమమని తెలిపింది.

బెయిల్‌పై హైకోర్టు విచారించాలని తెలిపింది. సుప్రీం ఆదేశాల మేరకు విచారించిన ఇస్లామాబాద్‌ హైకోర్టు రెండు వారాలు మధ్యంతర బెయిల్‌ అన్ని కేసుల‌పై ఇచ్చింది. అయితే ఇప్పటికే ఇమ్రాన్‌ ఖాన్‌పై 10 అరెస్ట్‌ వారెంట్లు ఉన్నాయి. దీంతో ఇమ్రాన్‌ బెయిల్‌పై బయటకు రాగానే మరో కేసులో అరెస్ట్‌ చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది

Updated On 12 May 2023 11:04 AM GMT
Somu

Somu

Next Story