విధాత: దేశ వ్యాప్తంగా విస్తరించాలన్న లక్ష్యంతో వివిధ రాష్ట్రాలల్లో ఇతర పార్టీల నేతలను బీఆర్‌ఎస్‌లోకి తీసుకుంటున్న సీఎం కేసీఆర్‌కు, బీఆర్‌ ఎస్‌ పార్టీకి బిగ్‌షాక్‌ తగిలింది. ఉమ్మడి పాలమూరు జిల్లాల్లో బలమైన congress నేతగా గుర్తింపు పొందిన మాజీ ఎమ్మెల్ల్యే గురునాథ్‌రెడ్డి తన అనుయాయులతో కాంగ్రెస్‌ పర్టీలోకి చేరేందుకు సిద్దమయ్యారు. ఈ మేరకు కొడంగల్‌లో పీసీసీ అధ్యక్షులు రేవంత్‌రెడ్డితో శుక్రవారం ఉదయం భేటీ అయ్యారు. గురునాథ్‌రెడ్డితో పాటు కొడంగల్‌ మున్సిపల్‌ చైర్మన్‌ జగదీశ్వర్‌రెడ్డి, ఎంపీపీ ముదప్పలు కూడ […]

విధాత: దేశ వ్యాప్తంగా విస్తరించాలన్న లక్ష్యంతో వివిధ రాష్ట్రాలల్లో ఇతర పార్టీల నేతలను బీఆర్‌ఎస్‌లోకి తీసుకుంటున్న సీఎం కేసీఆర్‌కు, బీఆర్‌ ఎస్‌ పార్టీకి బిగ్‌షాక్‌ తగిలింది. ఉమ్మడి పాలమూరు జిల్లాల్లో బలమైన congress

నేతగా గుర్తింపు పొందిన మాజీ ఎమ్మెల్ల్యే గురునాథ్‌రెడ్డి తన అనుయాయులతో కాంగ్రెస్‌ పర్టీలోకి చేరేందుకు సిద్దమయ్యారు. ఈ మేరకు కొడంగల్‌లో పీసీసీ అధ్యక్షులు రేవంత్‌రెడ్డితో శుక్రవారం ఉదయం భేటీ అయ్యారు. గురునాథ్‌రెడ్డితో పాటు కొడంగల్‌ మున్సిపల్‌ చైర్మన్‌ జగదీశ్వర్‌రెడ్డి, ఎంపీపీ ముదప్పలు కూడ గురునాథ్‌రెడ్డితో కలిసి కాంగ్రెస్‌ జెండా కప్పుకోవడానికి సిద్దమయ్యారు.

రేవంత్‌రెడ్డితో భేటీ అయిన గురునాథ్‌రెడ్డి పాదయాత్రపై చర్చించారు. పాదయాత్రను విజయవంతం చేయాలని రేవంత్‌కు గురునాథ్‌రెడ్డి తెలిపారు. రాష్ట్రంలో పార్టీ పరిస్థితిపై ఇద్దరు చర్చించినట్లు సమాచారం.

గురునాథ్‌రెడ్డికి ఉమ్మడి పాలమూరు జిల్లా కొడంగల్‌ నియోజకవర్గంలో తిరుగులేని నేతగా గుర్తింపు పొందారు. గురునాథ్‌రెడ్డి ఆరు సార్లు ఎమ్మెల్ల్యేగా పని చేశారు. గత ఎన్నికల్లో బీఆర్ఎస్ ఎమ్మెల్యే పట్నం నరేందర్‌రెడ్డి గెలుపు లో గురునాథ్‌రెడ్డి కీలక పాత్ర పోషించారు. కొడంగల్‌ నియోజకవర్గంలో గురునాథ్‌రెడ్డికి సొంతంగా ౩౦ వేల పైచిలుకు ఓట్లు ఉన్నాయని స్థానికులు అంటున్నారు. తాజాగా గుర్నాథ్ రెడ్డి కాంగ్రెస్ గూటికి చేరడం కొడంగల్ రాజకీయాల్లో పెను మార్పునకు నాంది పలుకుతుందని రాజకీయ పరిశీలకులు అంటున్నారు. గుర్నాథ్ రెడ్డి చేరికతో కొడంగల్ నియోజకవర్గంలో బీఆర్ఎస్ కు పెద్ద దెబ్బ తగిలినట్లేనన్న చర్చ రాజకీయ వర్గాలలో జరుగుతోంది.

Updated On 27 Jan 2023 7:28 AM GMT
krs

krs

Next Story