Bigg Boss7 | బిగ్ బాస్‌లో ప్రతి శని, ఆదివారాలకి గాను నాగార్జున హౌజ్‌మేట్స్‌తో కలిసి సందడి చేస్తుండడం మనకు తెలిసిందే. తాజా ఎపిసోడ్‌లో నాగార్జున గ్రాండ్ ఎంట్రీ ఇచ్చి శుక్రవారం ఏం జరిగిందో చూపించారు. కొన్ని సీన్స్ చూసి తెగ నవ్వుకున్నాడు. తొలివారం అనో లేక ఇంక మరేదైన కారణమో తెలియదు కానీ హౌజ్‌మేట్స్‌తో నాగార్జున చాలా కూల్‌గానే మాట్లాడాడు. అయితే శుభశ్రీని యావర్ యూజ్ లెస్ అని తిట్టడంతో ఆయన్ని కాస్త మందలించాడు. అలాంటి […]

Bigg Boss7 |
బిగ్ బాస్‌లో ప్రతి శని, ఆదివారాలకి గాను నాగార్జున హౌజ్‌మేట్స్‌తో కలిసి సందడి చేస్తుండడం మనకు తెలిసిందే. తాజా ఎపిసోడ్‌లో నాగార్జున గ్రాండ్ ఎంట్రీ ఇచ్చి శుక్రవారం ఏం జరిగిందో చూపించారు. కొన్ని సీన్స్ చూసి తెగ నవ్వుకున్నాడు. తొలివారం అనో లేక ఇంక మరేదైన కారణమో తెలియదు కానీ హౌజ్‌మేట్స్‌తో నాగార్జున చాలా కూల్‌గానే మాట్లాడాడు.
అయితే శుభశ్రీని యావర్ యూజ్ లెస్ అని తిట్టడంతో ఆయన్ని కాస్త మందలించాడు. అలాంటి పదాలు వాడడం వలన కొందరు హర్ట్ అవుతారు, కొంచెం చూసుకొని మాట్లాడాలంటూ యావర్‌కి సూచన చేశారు. ఇక ఆ తర్వాత నాగార్జున ఇంటి సభ్యుల పెర్ఫామెన్స్ గురించి మాట్లాడుతూ…శివాజీ యాక్టింగ్ టాస్క్ లో అదరగొట్టావంటూ ప్రశంసలు కురిపించాడు.
అప్పటికప్పుడు ఆ ఆలోచన చేసి చాలా అద్భుతంగా నటించావు అని శివాజీని పొగిడాడు. ఇక ఆ తర్వాత శోభా శెట్టి పదేపదే హౌస్ లో ఏడుస్తుండడంతో.. ఫస్ట్ వీక్ లోనే ఏడ్చేవాళ్ళు బిగ్ బాస్ లో ఎప్పుడూ టాప్ 5లో లేరు అని నాగార్జున కూల్ వార్నింగ్ ఇచ్చారు. ఆమె హౌజ్‌లోకి వెళ్లే ముందు శోభాకి ఓ విషయం చెప్పారు నాగార్జున.
నిన్ను ఎవరైన హాట్ అని అంటే శిక్ష విధిస్తా అని అన్నారు. టేస్టీ తేజ శోభా శెట్టిని హాట్ అని పిలవడంతో ముందుగా చెప్పినట్లుగా శిక్ష విధించారు. వారం రోజుల పాటు శోభా శెట్టి హౌస్ లో వాష్ రూమ్స్ క్లీన్ చేయాలని, నీకు వేరే ఎవరైన సాయం కావలన్నా తీసుకోవచ్చని తెలిపారు. హాట్ గర్ల్ వాష్ రూమ్ క్లీన్ చేస్తుంటే ఎలా ఉంటుందో ఊహించుకోవచ్చు అంటూ నాగార్జున చిన్నపాటి సెటైర్ కూడా వేశారు.
ఇక ..రతిక రోజ్ ప్రతిభని నాగార్జున ప్రత్యేకంగా అభినందించారు. ఉడతా ఉడతా సాంగ్ ప్లే చేసినప్పుడు.. ఎన్ని ఉడత పదాలు వచ్చాయో కరెక్ట్ గా లెక్కించి కరెక్ట్‌గా చెప్పిందని,తన టాలెంట్ మాములుగా లేదంటూ నాగ్ ప్రశంసలు కురిపించారు.ఇక పల్లవి ప్రశాంత్ గురించి మాట్లాడిన నాగ్.. బీస్ట్ టాస్క్‌లో మంచి ప్రదర్శన చేశావ్ కానీ.. నీకిచ్చిన మొక్కని వదిలేసి రోజ్ వెంట పడుతున్నావ్ అంటూ సెటైర్ వేశారు.
దీంతో తోటి కంటెస్టెంట్స్ తెగ నవ్వేసుకున్నారు. ఇక తొలి వారం హౌజ్‌మేట్స్ తమ ప్రదర్శనకి ఎన్ని మార్క్స్ ఇచ్చుకున్నారు, ఆడియన్స్ వారికి ఎన్ని మార్క్స్ ఇచ్చారనేది నాగార్జున తెలియజేస్తూ.. జాగ్రత్తగా గేమ్ ఆడాలని అన్నారు. ఇక చివరిగా పవర్ అస్త్ర కోసం సందీప్,ప్రియాంక మధ్య గేమ్ జరగగా, ఆ ఆటలో సందీప్ గెలవడంతో ఆయనకి ప్రత్యేక ఇమ్యునిటి లభించింది.
