Bigg Boss7 | కామన్ మ్యాన్‌గా బిగ్ బాస్ హౌజ్‌లోకి అడుగుపెట్టిన పల్లవి ప్రశాంత్ మిగతా వారికి గట్టి పోటీ ఇస్తుండగా, ఆయనని బయటకి పంపేందుకు హౌజ్ మొత్తం స్కెచ్‌లు వేస్తున్నట్టుగా అర్ధమవుతుంది. ప్రశాంత్ హౌజ్‌లోకి అడుగుపెట్టినప్పుడే అమర్ దీప్, ఆట సందీప్‌లు భయపడి ఆయన గురించి చాలా ముచ్చటించుకున్నారు. అయితే బిగ్ బాస్ సక్సెస్ ఫుల్‌గా రెండో వారంలోకి అడుగుపెట్టగా, మంగళవారం రోజు నామినేషన్ ప్రక్రియ జరిగింది. దాంతో పవర్ అస్త్రకి సంబంధించిన మాయాస్త్ర సాధించే […]

Bigg Boss7 |
కామన్ మ్యాన్‌గా బిగ్ బాస్ హౌజ్‌లోకి అడుగుపెట్టిన పల్లవి ప్రశాంత్ మిగతా వారికి గట్టి పోటీ ఇస్తుండగా, ఆయనని బయటకి పంపేందుకు హౌజ్ మొత్తం స్కెచ్‌లు వేస్తున్నట్టుగా అర్ధమవుతుంది. ప్రశాంత్ హౌజ్‌లోకి అడుగుపెట్టినప్పుడే అమర్ దీప్, ఆట సందీప్‌లు భయపడి ఆయన గురించి చాలా ముచ్చటించుకున్నారు.
అయితే బిగ్ బాస్ సక్సెస్ ఫుల్‌గా రెండో వారంలోకి అడుగుపెట్టగా, మంగళవారం రోజు నామినేషన్ ప్రక్రియ జరిగింది. దాంతో పవర్ అస్త్రకి సంబంధించిన మాయాస్త్ర సాధించే టాస్క్ బిగ్ బాస్ ఇవ్వడంతో, ఇది మరింత ఆసక్తికరంగా సాగింది. అయితే నామినేషన్ ప్రక్రియలో సంచాలకుడు సందీప్.. ప్రిన్స్ యావర్‌ని నామినేట్ చేయగా, శివాజీని అమర్ దీప్, ప్రియాంక, శోభాశెట్టి, దామిని నామినేట్ చేశారు.
ఇక గౌతంకృష్ణ, తేజ, ప్రియాంక, షకీలా, అమర్ దీప్ లు పల్లవి ప్రశాంత్‌లు నామినేట్ చేశారు. ఇక శోభాశెట్టిని శివాజీ, అమర్ దీప్‌ని శివాజీ, పల్లవి ప్రశాంత్, రతికని తేజ నామినేట్ చేయగా, షకీల కూడా నామినేషన్‌లో ఉన్నారు. మొత్తంగా పల్లవి ప్రశాంత్‌కి ఎక్కువగా ఎనిమిది ఓట్స్ పడడంతో రైతు బిడ్డని హౌజ్ మొత్తం బాగానే టార్గెట్ చేసినట్టు అర్ధమైంది.
ప్రశాంత్ అమ్మాయిల వెంటపడుతున్నాడని, అసలు గేమ్ ఆడటం లేదని శోభా శెట్టితో పాటు ఎక్కువ మంది కంటెస్టెంట్స్ ఆరోపించారు. గత సీజన్స్ ఇంపాక్ట్ చాలా ఉందని,అది మానేసి ఒరిజినల్ గేమ్ ఆడాలంటూ ప్రశాంత్ తోటి హౌజ్‌మేట్స్ తెలియజేశారు. ఇక శివాజీ, శోభా శెట్టి విషయంలో గొడవ జరగగా, నువ్వు తోపు అయితే బయట ఇక్కడ కాదని శివాజీకి ఇన్‌డైరెక్ట్ వార్నింగ్ ఇచ్చింది శోభా.
మొత్తానికి రెండో వారంలో పల్లవి ప్రశాంత్, ప్రిన్స్ యావర్, రతిక, షకీలా, శోభాశెట్టి, శివాజీ, తేజ, గౌతమ్ కృష్ణ, అమర్ దీప్ నామినేషన్స్‌లో ఉన్నారు. వీరిలో ఒకరు బిగ్ బాస్ హౌజ్ నుండి బయటకు వెళ్లనున్నారు. ఇక మాయాస్త్ర టాస్క్ లో భాగంగా హౌజ్‌ని రెండు సముహాలుగా విభిజించారు బిగ్ బాస్.
అమర్ దీప్, ప్రిన్స్ యావర్, షకీలా, శివాజీ, శోభా శెట్టి, ప్రియాంక.. ఈ ఆరుగురు సభ్యులను రణధీర టీమ్‌గా ఉండగా, గౌతమ్ కృష్ణ, తేజా, రతికా రోజ్, దామిని, పల్లవి ప్రశాంత్, శుభశ్రీ మహాబలి టీమ్ గా ఏర్పడ్డారు. ఆట సందీప్ ని సంచాలకుడిగా ఉన్నారు.
మూడు రౌండ్ల పాటు ఈ టాస్క్ జరగగా, మహాబలి టీమ్ ఒక్క పాయింట్ కూడా సంపాదించుకోకపోగా, మహాబలి టీం మాత్రం మూడు పాయింట్స్ సాధించి విన్నర్‌గా నిలిచింది.దీంతో మాయాస్త్ర కీని పొందే కీని బిగ్ బాస్ విన్నర్స్ కి ఇవ్వగా, దానిని కొట్టేసే స్కెచ్ కూడా వేశారు. మొత్తానికి మంగళవారం ఎపిసోడ్ చాలా రంజుగా సాగిందనే చెప్పాలి.
