Bigg Boss7 | బిగ్ బాస్ సీజన్ 7లో పవర్ అస్త్ర కోసం ప్రతి వారం వేట కొనసాగుతుంది. తొలివారం సందీప్, రెండో వారం శివాజి పవర్ అస్త్ర సంపాదించుకున్నారు. ఇప్పుడు మూడో వారం పవర్ అస్త్ర వేట కొనసాగుతుంది. అయితే బిగ్ బాస్ హౌజ్‌లో రతికి సెంట్రాఫ్ అట్రాక్షన్‌గా మారింది. ఒకవైపు తన అందంతో పాటు మరో వైపు తన మొండితనంతో చేస్తున్న రచ్చ అంతా ఇంతా కాదు. తాజా ఎపిసోడ్‌లో శివాజీ, రతిక గుసగుసలాడుకున్నారు. […]

బిగ్ బాస్ సీజన్ 7లో పవర్ అస్త్ర కోసం ప్రతి వారం వేట కొనసాగుతుంది. తొలివారం సందీప్, రెండో వారం శివాజి పవర్ అస్త్ర సంపాదించుకున్నారు. ఇప్పుడు మూడో వారం పవర్ అస్త్ర వేట కొనసాగుతుంది. అయితే బిగ్ బాస్ హౌజ్‌లో రతికి సెంట్రాఫ్ అట్రాక్షన్‌గా మారింది. ఒకవైపు తన అందంతో పాటు మరో వైపు తన మొండితనంతో చేస్తున్న రచ్చ అంతా ఇంతా కాదు.
తాజా ఎపిసోడ్‌లో శివాజీ, రతిక గుసగుసలాడుకున్నారు. నా ఎక్స్ గురించి మాట్లాడుతున్నారు అని రతిక అంటే అప్పుడు శివాజి.. అలా మాట్లాడే వారిని ఏం పీక్కుంటారో పీక్కోమను. మనం వాళ్లకు ఛాన్స్ ఇవ్వకూడదు. స్ట్రాంగ్ గా ఉండాలి అంటూ రతికతో చెప్పుకొచ్చాడు శివాజీ. అనంతరం బిగ్ బాస్ హౌజ్‌లో వినాయక చవితి సెలబ్రేషన్స్ జరిగాయి.
మూడవ పవర్ అస్త్ర కోసం కంటెండర్‌గా అర్హత సాధించిన వారిని బిగ్ బాస్ ప్రకటించాడు. ఇన్ని రోజుల ఆటతో పాటు నేను చేసిన పరిశీలన ద్వారా ఈ కంటెండర్స్ ని ఎంపిక చేసినట్టు బిగ్ బాస్ తెలిపారు. అమర్, శోభా శెట్టి, ప్రిన్స్ యావర్ మూడవ పవర్ అస్త్ర కంటెండర్స్ గా నిలిచినట్లు బిగ్ బాస్ ప్రకటించగా, తనకు అవకాశం దక్కలేదని మళ్లీ ప్రశాంత్ తెగ ఏడ్చేశాడు.
నేను బిగ్ బాస్ టైటిల్ గెలుస్తానని నమ్మకం పోయిందని అన్నాడు. అప్పుడు బిగ్ బాస్ ప్రశాంత్‌ని పిలిచి ఆ ముగ్గురికి కంటెండర్‌గా ఎవరికి అర్హత లేదని అనుకుంటున్నావు అని ప్రశాంత్‌ని అడుగుతాడు. అప్పుడు శోభా పేరు చెబుతాడు ప్రశాంత్. ఇక ప్రియాంక.. అమర్ దీప్ పేరు చెబుతుంది. ఇక తేజ, దామిని, రతిక.. యావర్ కి కంటెండర్ గా అర్హత లేదని తమ అభిప్రాయాన్నిచెప్పుకొస్తారు.
ఇక రతిక, ప్రశాంత్ లు సరదాగా కాసేపు తిట్టుకున్నారు. ఒకరిని ఒకరు దూషించుకుంటూ ఫన్ అందించారు. నువ్వు దొబ్బెయ్ అంటే నువ్వే దొబ్బెయ్ అంటూ ప్రశాంత్, రతిక తిట్టుకోగా, వీరిద్దరి మధ్య బాండింగ్ గట్టిగానే ఉన్నట్టు తెలుస్తుంది. అయితే ఎపిసోడ్‌లో ట్విస్ట్ ఏంటంటే..ప్రశాంత్‌తో కటీఫ్ చేసుకున్న తర్వాత యావర్ తో కాస్త క్లోజ్‌గా మూవ్ అయింది రతిక. కాని కంటెండర్‌గా అతనిని వ్యతిరేఖించింది.
అతనికి షార్ట్ టెంపర్ ఎక్కువని.. ఇక్కడ హౌస్‌లో అది పనికిరాదని చెప్పగా, ఆమె మట్లాడిన మాటలని బిగ్‌బాస్ అందరిముందు టీవీలో చూపించాడు. అప్పుడు అతనికి ఏం అర్ధం కాక రెండు చేతులు జేబులో పెట్టుకొని సైలెంట్‌గా లేచి గార్డెన్‌లోకి వెళ్లి అయోమయంలో ఉన్నాడు. రతిక చేసిన పనికి సిగరెట్ తాగుతూ కోపంతో అక్కడే ఉన్న గ్లాస్ టీపాయిని గుద్దడంతో మిగతా కంటెస్టెంట్స్ కంగారు పడ్డారు. రతిక మాత్రం మెల్లగా సైడ్ అయింది.మొత్తానికి హౌజ్‌మేట్స్‌కి మూడు చెరువుల నీళ్లు తాగిస్తుంది రతిక.
