Bigg Boss7 | బిగ్ బాస్ సీజన్ 7 సక్సెస్ ఫుల్‌గా రెండు వారాలు పూర్తి చేసుకుంది. 14మందితో మొదలైన షో నుండి ఇద్దరు ఎలిమినేట్ కాగా, ప్రస్తుతం హౌజ్‌లో 12 మంది మాత్రమే ఉన్నారు. తొలివారం కిరణ్ రాథోడ్ హౌజ్‌ని వీడింది. రెండో వారం ఎవరు ఎలిమినేట్ అవుతారా అని అందరు ఆసక్తిగా ఎదురు చూడగా, పెద్ద షాకే ఇచ్చారు. ఎన్నో ఆశలతో బిగ్ బాస్ హౌజ్ లోకి అడుగుపెట్టిన షకీలాని ఎలిమినేట్ చేశారు. ఆదివారం […]

Bigg Boss7 |
బిగ్ బాస్ సీజన్ 7 సక్సెస్ ఫుల్‌గా రెండు వారాలు పూర్తి చేసుకుంది. 14మందితో మొదలైన షో నుండి ఇద్దరు ఎలిమినేట్ కాగా, ప్రస్తుతం హౌజ్‌లో 12 మంది మాత్రమే ఉన్నారు. తొలివారం కిరణ్ రాథోడ్ హౌజ్‌ని వీడింది. రెండో వారం ఎవరు ఎలిమినేట్ అవుతారా అని అందరు ఆసక్తిగా ఎదురు చూడగా, పెద్ద షాకే ఇచ్చారు. ఎన్నో ఆశలతో బిగ్ బాస్ హౌజ్ లోకి అడుగుపెట్టిన షకీలాని ఎలిమినేట్ చేశారు.
ఆదివారం సండే, ఫండే కాబట్టి నాగార్జున హౌజ్‌మేట్స్‌తో పలు గేమ్స్ ఆడించాడు. 'బిగ్ బాస్ సామ్రాజ్యం' అంటూ టాస్క్ ఇచ్చిన నాగార్జున ఇందులో ప్రతి ఒక్క కంటెస్టెంట్ .. తమకు ఎవరు భల్లాలదేవ(విలన్), ఎవరు కట్టప్ప(వెన్నుపోటు దారు) అనేది చెప్పాలని సూచించిచారు. దీంతో ముందుగా శోభా శెట్టి భళ్లాలదేవ కిరీటం పెట్టుకొని తనకు యావర్ భల్లాల దేవ అని, గౌతమ్ కట్టప్ప అని చెప్పింది.
ఇక తర్వాత వచ్చిన గౌతమ్.. నాకు యావర్ భల్లాలదేవగా, రతిక కట్టప్ప అని చెప్పారు. రతికకి భల్లాలదేవగా గౌతమ్ అని, కట్టప్ప తేజ కాగా తేజకి శివాజీ భల్లాల దేవగా, గౌతమ్ కట్టప్ప అని చెప్పుకొచ్చారు. ఇక శివాజీ.. ప్రశాంత్‌ని.. భల్లాల దేవగా, తేజని.. కట్టప్ప అనిఅన్నారు. ప్రశాంత్ చెబుతూ, భల్లాల దేవ శివాజీ అని, కట్టప్ప తేజ అని అన్నాడు.
దామిని చెబుతూ, సందీప్ భల్లాల దేవ అని, శుభ శ్రీ కట్టప్ప అని, ఇక శుభ శ్రీ చెబుతూ, సందీప్ భల్లాలదేవగా, తేజ కట్టప్ప అని చెప్పుకొచ్చారు. అనంతరం ప్రియాంకకి.. సందీప్ భల్లాల దేవ అని, శివాజీ కట్టప్ప అని పేర్కొంది యావర్ చెబుతూ, భల్లాల దేవ శివాజీ అని, సందీప్ కట్టప్ప అన్నారు. అమర్ దీప్ కి భల్లాల దేవ సందీప్ అని, గౌతమ్ కట్టప్ప కాగా, షకీలాకి ప్రశాంత్ భల్లాల దేవ అని, యావర్ కట్టప్ప గా స్పష్టం చేశారు.
ఈ గేమ్ పూర్తయ్యాక రణధీర, మహాబలి టీమ్‌ల మధ్య సరదా గేమ్ పెట్టారు. ఈ గేమ్‌లో కాస్ట్యూమ్ ఆధారంగా హీరో పేరు చెప్పాల్సి ఉంటుందని అన్నారు. ఈ గేమ్ లో రణధీర టీమ్ కేవలం 2 పాయింట్లే సాధించగా, మహాబలి టీమ్ 8 పాయింట్లు సాధించి లగ్జరీ బడ్టెట్ గెలుచుకుంది. ఇక ఎలిమినేషన్ టైం వచ్చే సరికి చివర్లో తేజ, షకీలా మిగిలగా, ఇద్దరిలో ఊహించినట్టే షకీలాని పంపించారు.
షకీలా ఎలిమినేట్ అనగానే హౌజ్‌లో అందరు చాలా ఎమోషనల్ అయ్యారు. ఇక వేదికపై వచ్చిన షకీలా.. హౌజ్‌మేట్స్ ఒక్కొక్కరి గురించి చెప్పుకొచ్చింది. ప్రియాంక ఫ్రెండ్లీనేచర్‌తో ఉంటుందని, ప్రిన్స్ యావర్ తనే గొప్ప అనే ఫీలింగ్‌లో ఉంటాడని, ప్రశాంత్‌కి ఆవేశం ఎక్కువ అని, దామిని నమ్మకానికి కేరాఫ్ అని, రతిక సోల్ హార్టెడ్ అని, శివాజీ అందరికి ఆనందం పంచుతాడని ఇలా ఆరుగురి గురించి చెప్పుకొచ్చింది. ఇక చివరలో అమ్మ పాట పాడగా షకీలా కంట కన్నీళ్లు వచ్చాయి.
