Bihar | రాఖీ పండుగ ఓ ఉపాధ్యాయుడి ఉద్యోగాన్ని ఊడగొట్టింది. రక్షా బంధన్‌కు సెలవు ఇవ్వకపోడంతో.. ఉపాధ్యాయుడు పాఠశాలకు హాజరు కావాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఈ క్రమంలో సోదరి పాఠశాల వద్దకు రాగా, రాఖీ కట్టించుకున్న అనంతరం సదరు టీచర్.. ప్రభుత్వంపై విరుచుకుపడ్డాడు. దీంతో ఆ టీచర్‌ను విధుల నుంచి తొలగిస్తూ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. వివరాల్లోకి వెళ్తే.. బీహార్‌లోని ఖగరియా జిల్లాలోని మథురాపూర్ ప్రభుత్వ పాఠశాలలో సుశీల్ కుమార్ అనే వ్యక్తి టీచర్‌గా పని […]

Bihar | రాఖీ పండుగ ఓ ఉపాధ్యాయుడి ఉద్యోగాన్ని ఊడగొట్టింది. రక్షా బంధన్‌కు సెలవు ఇవ్వకపోడంతో.. ఉపాధ్యాయుడు పాఠశాలకు హాజరు కావాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఈ క్రమంలో సోదరి పాఠశాల వద్దకు రాగా, రాఖీ కట్టించుకున్న అనంతరం సదరు టీచర్.. ప్రభుత్వంపై విరుచుకుపడ్డాడు. దీంతో ఆ టీచర్‌ను విధుల నుంచి తొలగిస్తూ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది.
వివరాల్లోకి వెళ్తే.. బీహార్‌లోని ఖగరియా జిల్లాలోని మథురాపూర్ ప్రభుత్వ పాఠశాలలో సుశీల్ కుమార్ అనే వ్యక్తి టీచర్‌గా పని చేస్తున్నాడు. అయితే రాఖీ పండుగ రోజు.. కుమార్‌కు రాఖీ కట్టేందుకు తన సోదరి భగల్‌పూర్ నుంచి దాదాపు 90 కిలోమీటర్లు ప్రయాణించి సోదరుడి పాఠశాల వద్దకు చేరుకుంది. స్కూల్ ఆవరణలోనే కుమార్‌కు ఆమె రాఖీ కట్టింది.
ఈ సందర్భంగా టీచర్ ప్రభుత్వ అధికారులపై మండిపడ్డారు. రాఖీ పండుగకు సెలవు ఇవ్వకపోవడంపై ఆయన తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. విద్యాశాఖ అధికారులపై చిందులేశారు. ఇష్టమొచ్చినట్లు దూషించారు. టీచర్ ఆవేశాన్ని అక్కడున్న ఓ వ్యక్తి చిత్రీకరించి, సోషల్ మీడియాలో వైరల్ చేశాడు.
ఈ వీడియోపై విద్యాశాఖ ఉన్నతాధికారులు సీరియస్‌గా స్పందించారు. సుశీల్ కుమార్‌ను విధుల నుంచి తొలగిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. శాఖాపరమైన చర్యలు తీసుకుంటామని స్పష్టంచేశారు. ఆయనకు వచ్చే శాలరీని కూడా ఆపేశారు అధికారులు.
అయితే బీహార్‌లో మరో ఐదు నెలల్లో ముఖ్యమైన పండుగలు ఉన్నాయి. దీంతో ఆ ముఖ్యమైన పండుగలకు సెలవులు ఇవ్వాలని అధికారులు నిర్ణయించారు. ఈ నేపథ్యంలో రాఖీ పండుగకు రాష్ట్ర ప్రభుత్వం సెలవు మంజూరు చేయలేదు.
बिहार में नियोजित शिक्षकों का रक्षाबंधन की छुट्टी रद्द होने के बाद एक शिक्षक की बहन रोती हुई भागलपुर से खगड़िया के मथुरापुर विद्यालय पहुँची अपने भाई को बाँधी राखी,शिक्षक भाई ने निकाली भरास . pic.twitter.com/ZU5QnJlsIl
— बिहार शिक्षक मंच (@btetctet) August 31, 2023
