విధాత, క్రికెట్‌: భారత్ క్రికెట్ కంట్రోల్ బోర్డు కొత్త అధ్యక్షుడిగా రోజర్ బిన్నీ ఎన్నికయ్యారు. బీసీసీఐ అధ్యక్షుడిగా ఉన్న గంగూలీని తప్పించటంతో ఆ స్థానంలో బిన్నీ ఏకగ్రీవంగా ఎంపిక అయ్యారు. బీసీసీఐ వార్షిక సభ్య సమావేశంలో ఈ మేరకు ఎంపిక ప్రక్రియ పూర్తయింది. బిన్నీ ఛైర్మన్ గా కొత్త పాలక వర్గం బాధ్యతలు స్వీకరించింది. పోటీలో ఎవరూ లేకపోవటంతో సభ్యులంతా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు కార్యదర్శిగా జై షా ఎంపిక కాగా, ట్రెజరర్ గా ఆశిష్ షెలార్ ఎన్నికయ్యారు. […]

విధాత, క్రికెట్‌: భారత్ క్రికెట్ కంట్రోల్ బోర్డు కొత్త అధ్యక్షుడిగా రోజర్ బిన్నీ ఎన్నికయ్యారు. బీసీసీఐ అధ్యక్షుడిగా ఉన్న గంగూలీని తప్పించటంతో ఆ స్థానంలో బిన్నీ ఏకగ్రీవంగా ఎంపిక అయ్యారు. బీసీసీఐ వార్షిక సభ్య సమావేశంలో ఈ మేరకు ఎంపిక ప్రక్రియ పూర్తయింది. బిన్నీ ఛైర్మన్ గా కొత్త పాలక వర్గం బాధ్యతలు స్వీకరించింది.

పోటీలో ఎవరూ లేకపోవటంతో సభ్యులంతా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు కార్యదర్శిగా జై షా ఎంపిక కాగా, ట్రెజరర్ గా ఆశిష్ షెలార్ ఎన్నికయ్యారు. ఉపాధ్యక్షుడిగా రాజీవ్ శుక్లా, సంయుక్త కార్యదర్శిగా దేవజిత్ సైకియా బాధ్యతలు నిర్వహించనున్నారు. ముంబాయిలో జరిగిన బీసీసీఐ వార్షిక సమావేశంలో 67 సంవత్సరాల బిన్నీని సభ్యులు కొత్త ఛైర్మన్ గా ఎన్నుకున్నారు.

బీసీసీఐ పదవుల పైన క్లారిటీ రావటంతో ఇక..ఐసీసీ పదవుల పైన పోటీ నెలకొంది. ఐసీసీ ఛైర్మన్ పదవికి ఈ నెల 20వ తేదీతో నామినేషన్ల గడువు ముగుస్తుంది. నవంబర్ 11 నుంచి 13వ తేదీ వరకు మెల్ బోర్న్ లో ఐసీసీ బోర్డు సమావేశం కానుంది. గంగూలీని తప్పించటం పైన రాజకీయంగానూ దుమారం చెలరేగుతోంది. దీని పైన ఇప్పటికే బెంగాల్ సీఎం మమతా స్పందించారు. ఐసీసీ పదవి రేసులో క్రీడా శాఖ మంత్రి అనురాగ్ ఠూకూర్, బీసీసీఐ మాజీ అధ్యక్షుడు శ్రీనివాసన్ పోటీలో ఉన్నట్లుగా ప్రచారం సాగుతోంది.

Updated On 18 Oct 2022 9:07 AM GMT
krs

krs

Next Story