BJP | 26నుంచి మూడు రూట్‌లలో బస్సుయాత్రలు 19 రోజులు..4040కిలోమీటర్ల బస్సుయాత్రలు ముగింపు సభకు ప్రధాని మోడీ విధాత : తెలంగాణలో అధికార సాధన దిశగా శ్రమిస్తున్న బీజేపీ పార్టీ ప్రజల్లో తమ పట్టు పెంచుకునేందుకు ఈ నెల 26 నుంచి రాష్ట్రంలో బస్సు యాత్రలకు శ్రీకారం చుట్టనుంది. బాసర, సోమశిల, భద్రాచలంల నుంచి మూడు వైపుల మూడూ రూట్‌లలో బస్సు యాత్రలను నిర్వహించాలని బీజేపీ నిర్ణయించింది.19రోజుల పాటు కొనసాగనున్న బీజేపీ బస్సుయాత్రలు 4040కిలో మీటర్లు కొనసాగనున్నాయి. […]

BJP |
- 26నుంచి మూడు రూట్‌లలో బస్సుయాత్రలు
- 19 రోజులు..4040కిలోమీటర్ల బస్సుయాత్రలు
- ముగింపు సభకు ప్రధాని మోడీ
విధాత : తెలంగాణలో అధికార సాధన దిశగా శ్రమిస్తున్న బీజేపీ పార్టీ ప్రజల్లో తమ పట్టు పెంచుకునేందుకు ఈ నెల 26 నుంచి రాష్ట్రంలో బస్సు యాత్రలకు శ్రీకారం చుట్టనుంది. బాసర, సోమశిల, భద్రాచలంల నుంచి మూడు వైపుల మూడూ రూట్‌లలో బస్సు యాత్రలను నిర్వహించాలని బీజేపీ నిర్ణయించింది.19రోజుల పాటు కొనసాగనున్న బీజేపీ బస్సుయాత్రలు 4040కిలో మీటర్లు కొనసాగనున్నాయి.
శుక్రవారం జరిగిన పార్టీ పదాధికారుల సమావేశంలో పార్టీ ఇంచార్జీ ప్రకాశ్ జవదేకర్, సునీల్ బన్సల్, రాష్ట్ర అధ్యక్షుడు జి.కిషన్‌రెడ్డి, జాతీయ ఉపాధ్యక్షురాలు డీకె. అరుణ, జితేందర్‌రెడ్డి, ఎన్నికల వ్యవహారాల కమిటీ చైర్మన్ ఈటల రాజేందర్, ఎంపీ సోయం బాపురావు, వివేక్ వెంకటస్వామి ప్రభృతులు హాజరయ్యారు.ఈ భేటీలో రాష్ట్ర రాజకీయ పరిస్థితులు, సెప్టెంబర్ 17న తెలంగాణ విమోచన వేడుకలు, పార్టీ ఎన్నికల ప్రణాళిక, అనుసరించాల్సిన వ్యూహాలపై చర్చించారు.
బస్సుయాత్రల షెడ్యూల్‌ను ఖరారు చేశారు. బస్సుయాత్రలను కొమరం భీమ్ జోన్, కృష్ణా జోన్, గోదావరి జోన్‌లుగా మూడు రూట్‌లుగా విభజించారు. కొమరం భీమ్ జిల్లాలోని బస్సు యాత్రలో ఆదిలాబాద్, మెదక్, నిజమాబాద్ జిల్లాలు ఉన్నాయి. ఈ జోన్‌లో బాసర నుంచి పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు జి.కిషన్‌రెడ్డి బస్సుయాత్ర ప్రారంభిస్తారు. కృష్ణా జోన్‌లో మహబూబ్‌నగర్, నల్లగొండ, రంగారెడ్డి జిల్లాలున్నాయి. ఈ జోన్‌లో బస్సు యాత్రను సోమశిల నుంచి పార్టీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకె. అరుణ ప్రారంభిస్తారు.
బిజెపికి వ్యతిరేకంగా బీఆర్ఎస్, కాంగ్రెస్, ఎంఐఎం కుట్రలను అడ్డుకోవాలని రాష్ట్ర పదాధికారులకు బిజెపి తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు శ్రీ @kishanreddybjp గారు పిలుపునిచ్చారు. pic.twitter.com/qWGAzdGHXP
— BJP Telangana (@BJP4Telangana) September 8, 2023
గోదావరి జోన్‌లో ఖమ్మం, కరీంనగర్, వరంగల్ జిల్లాలున్నాయి. ఈ జోన్‌లో బస్సు యాత్రను భద్రాచలం నుంచి పార్టీ ఎన్నికల వ్యవహారాల కమిటీ చైర్మన్ ఈటల రాజేందర్ ప్రారంభిస్తారు. రాష్ట్రంలోని అన్ని అసెంబ్లీ నియోజకవర్గాాల మీదుగా బస్సుయాత్రలు కొనసాగనున్నాయి. యాత్రలలో భాగంగా నియోజకవర్గ కేంద్రాల్లో రోడ్ షోలు, సభలు నిర్వహించనున్నారు. బస్సుయాత్రల ముగింపు సభకు ప్రధాని నరేంద్ర మోడీ హాజరుకానున్నారు.
కాగా ఉదయనిధి స్టాలిన్ సనాతన ధర్మంపై చేసిన వ్యాఖ్యలను నిరసిస్తూ ఈనెల 11న నిరసన ప్రదర్శనలు నిర్వహించనున్నారు. ఈనెల 13న నిరుద్యోగ సమస్యలపైన, 14న డబుల్ బెడ్‌రూమ్ ఇండ్ల సమస్యలపైన ఇందిరా పార్కుల వద్ద దీక్షలు నిర్వహించనున్నారు. 15,16వ తేదీలలో విమోచన దినోత్సవ బైక్ ర్యాలీలు నిర్వహించనున్నారు. 17న తెలంగాణ విమోచన దినోత్సవం సందర్భంగా అన్ని పోలింగ్ బూత్‌లలో జాతీయ జెండాలు ఎగురవేయనున్నారు. సికింద్రాబాద్ పరేడ్‌గ్రౌండ్‌లో అమిత్‌షా బహిరంగ సభ నిర్వహించనున్నారు.
