BJP | బలవంతంగా అరెస్టు చేసిన పోలీసులు తోపులాటలతో ఉద్రిక్తత విధాత, హైదరాబాద్: బీఆరెస్ ప్రభుత్వానికి వ్యతరేకంగా నిరుద్యోగులకు సంఘీభావం తెలుపుతూ కేంద్ర మంత్రి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌రెడ్డి చేపట్టిన 24గంటల నిరాహార దీక్ష ఉద్రిక్తతల మధ్య ముగిసింది. బుధవారం ఇందిరా పార్క్ వద్ద ధర్నా చౌక్‌లో కిషన్ రెడ్డి పార్టీ శ్రేణులతో కలిసి దీక్ష నిర్వహించారు. ఈ దీక్షకు సంఘీభావం తెలుపుతూ బీజేపీ రాష్ట్ర వ్యవహారాల ఇంఛార్జీ తరుణ్ చుగ్, ఎంపీ బండి సంజయ్ […]

BJP |
- బలవంతంగా అరెస్టు చేసిన పోలీసులు
- తోపులాటలతో ఉద్రిక్తత
విధాత, హైదరాబాద్: బీఆరెస్ ప్రభుత్వానికి వ్యతరేకంగా నిరుద్యోగులకు సంఘీభావం తెలుపుతూ కేంద్ర మంత్రి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌రెడ్డి చేపట్టిన 24గంటల నిరాహార దీక్ష ఉద్రిక్తతల మధ్య ముగిసింది. బుధవారం ఇందిరా పార్క్ వద్ద ధర్నా చౌక్‌లో కిషన్ రెడ్డి పార్టీ శ్రేణులతో కలిసి దీక్ష నిర్వహించారు.
ఈ దీక్షకు సంఘీభావం తెలుపుతూ బీజేపీ రాష్ట్ర వ్యవహారాల ఇంఛార్జీ తరుణ్ చుగ్, ఎంపీ బండి సంజయ్ తదితర ముఖ్యనేతలతో పాటు కార్యకర్తలు హాజరయ్యారు. అయితే దీక్షకు ప్రభుత్వం సాయంత్రం ఆరు గంటల వరకే అనుమతి ఉందంటూ దీక్షా స్థలాన్ని ఖాళీ చేయాలని పోలీసులు తెలిపారు.
దీక్షను విరమించేది లేదని రేపటి దాకా 24 గంటల పాటు దీక్ష తప్పకుండా చేస్తానని కిషన్‌రెడ్డి పట్టుబట్టారు. దీంతో దీక్ష స్థలం వద్ధకు భారీగా చేరుకున్న పోలీసు బలగాలు దీక్షా శిబిరాన్ని చుట్టుముట్టి కిషన్ రెడ్డిని బలవంతంగా అరెస్టు చేశారు.
అరెస్టు సందర్భంగా పోలీసులకు, పార్టీ శ్రేణులకు మధ్య తోపులాటతో ఘర్షణాపూరిత ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. పోలీసులను బీజేపీ కార్యకర్తలు ప్రతిఘటించి అడ్డుకోగా, వారిని లాగిపడేసి కిషన్‌రెడ్డి సహా ఇతర నేతలను అరెస్టు చేశారు.
