విధాత: కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం రాజ్యాంగ వ్యతిరేక పాలన సాగిస్తున్నందునా బీజేపీని గద్దె దించాల్సిన అవసరం ఉందని తెలంగాణ రాష్ట్ర సీపీఎం కార్యదర్శి తమ్మినేని వీరభద్రం అన్నారు. సోమవారం పార్టీ జన చైతన్య యాత్ర నల్గొండకు వచ్చిన సందర్భంగా ఆయన మాట్లాడుతూ లౌకిక రాజ్యాంగ స్ఫూర్తికి తూట్లు పొడుస్తున్న మోడీ ప్రభుత్వం ప్రజా ఆస్తులను ఆదాని వంటి కార్పొరేట్ల పరం చేస్తూ ప్రజల ఉద్యోగ అవకాశాలను, రిజర్వేషన్లను నీరుగారుస్తుందన్నారు. హిందూ జపం చేసే బీజేపీ ప్రభుత్వ రంగ […]

విధాత: కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం రాజ్యాంగ వ్యతిరేక పాలన సాగిస్తున్నందునా బీజేపీని గద్దె దించాల్సిన అవసరం ఉందని తెలంగాణ రాష్ట్ర సీపీఎం కార్యదర్శి తమ్మినేని వీరభద్రం అన్నారు. సోమవారం పార్టీ జన చైతన్య యాత్ర నల్గొండకు వచ్చిన సందర్భంగా ఆయన మాట్లాడుతూ లౌకిక రాజ్యాంగ స్ఫూర్తికి తూట్లు పొడుస్తున్న మోడీ ప్రభుత్వం ప్రజా ఆస్తులను ఆదాని వంటి కార్పొరేట్ల పరం చేస్తూ ప్రజల ఉద్యోగ అవకాశాలను, రిజర్వేషన్లను నీరుగారుస్తుందన్నారు.

హిందూ జపం చేసే బీజేపీ ప్రభుత్వ రంగ సంస్థల ప్రైవేటీకరణ ద్వారా హిందువుల్లోని మెజారిటీ బీసీ వర్గం రిజర్వేషన్లకు గండి కొడుతుందన్నారు, బీసీ గణన చేపట్టకుండా అన్యాయం చేస్తుందన్నారు. కేంద్ర ప్రభుత్వ దర్యాప్తు సంస్థలను దుర్వినియోగం చేస్తూ ప్రతిపక్షాలను దెబ్బతీసే కుట్ర చేస్తుందని, రాష్ట్రాల హక్కులను కాజేస్తుందన్నారు.

రైతు వ్యతిరేక విధానాలతో దేశం వ్యవసాయ రంగాన్ని మోడీ ప్రభుత్వం దెబ్బతీస్తుంది అన్నారు. స్వార్ధ రాజకీయాల కోసం దేశంలోని ప్రజాస్వామ్య రాజ్యాంగ వ్యవస్థలను నాశనం చేస్తున్న బిజెపికి వ్యతిరేకంగా విపక్షాలు సంఘటితం కావాల్సిన అవసరం ఉందన్నారు.

గతంలో బీజేపీని సమర్థించి తప్పు తెలుసుకుని బీజేపీకి వ్యతిరేకంగా గట్టిగా పోరాడుతున్నందునే తాము సీఎం కేసీఆర్ పార్టీ బీఆర్ఎస్ తో కలిసి సాగుతున్నామన్నారు. మోడీని గద్దే దించే లక్ష్యంతో పోరాడుతున్న కేసిఆర్ కు మద్దతుగా రాజకీయ పోరాటానికి వామపక్షాలు సహకరిస్తున్నాయన్నారు. కాంగ్రెస్ కీలక నేత రాహుల్ గాంధీ అనర్హత పైటు వేసి కాంగ్రెస్ పని అయిపోయిందని బీజేపీ ప్రచారం చేయచూస్తుందన్నారు.

ఈ పరిస్థితుల్లో బిజెపిని నిలవరించే క్రమంలో బిఆర్ఎస్ తో కలిసి వెళ్తున్నామన్నారు . అందులో భాగంగా మునుగోడులో బిఆర్ ఎస్ తో కలిసి బిజెపిని ఓడించామన్నారు. సీఎం కేసీఆర్ ఖమ్మం బిఆర్ఎస్ అవీర్భావ సభలో బిఆర్ఎస్ కమ్యూనిస్టుల పొత్తు కొనసాగుతుందని స్పష్టం చేశారన్నారు. ఎన్నికల్లో సీట్ల కేటాయింపు లెక్కలపై ప్రస్తుతానికి తమ పార్టీల మధ్య స్పష్టత లేకపోయినా బిజెపి వ్యతిరేక అజెండాతోనే ముందుకు సాగుతున్నామన్నారు.

ఎన్నికల్లో రెండు సీట్లు అటు ఇటు అయినా పరస్పరం గెలిపించుకునే ప్రయత్నం చేస్తామన్నారు. అలాగే సీఎం కేసీఆర్ ప్రభుత్వం ప్రజా వ్యతిరేక విధానాలను ఖచ్చితంగా తమ సహజ ధరణిలో కమ్యూనిస్టులు వ్యతిరేకిస్తారన్నారు. టీఎస్పీఎస్సీ పేపర్ల లీకేజీని నిరసిస్తూ సమగ్ర విచారణ చేసి దోషులను శిక్షించాలని సిపిఎం డిమాండ్ చేస్తుందన్నారు.

కాంగ్రెస్ తో పొత్తులేదని రాహుల్ గాంధీ పై వేసిన అనర్హత వేటును వ్యతిరేకించకుండా కమ్యూనిస్టులు మౌనంగా ఉండలేదన్నారు. ప్రజాస్వామ్యంపై దాడిగా రాహుల్ అనర్హత ఉదంతాన్ని చూస్తున్న కమ్యూనిస్టులు కాంగ్రెస్ పోరాటానికి నైతిక మద్దతుని ఇస్తున్నాయన్నారు. రాష్ట్రంలో సీఎం కేసీఆర్ వివిధ వర్గాల ఉద్యోగులకు, ప్రజలకు, ఎస్సీ ఎస్టీ బీసీలకు ఇచ్చిన హామీలను అమలు చేయాలని సిపిఎం డిమాండ్ చేస్తుందన్నారు.

సిపిఎం జిల్లా కార్యదర్శి ముదిరెడ్డి సుధాకర్ రెడ్డి అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో స్థానిక బిఆర్ఎస్ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే జూలకంటి రంగారెడ్డి, సిపిఐ జిల్లా కార్యదర్శి నెల్లికంటి సత్యం, సిపిఎం నాయకులు మల్లు లక్ష్మి , పాలడుగు నాగార్జున, సత్తయ్య, హశం, ప్రభావతి తదితరులు పాల్గొన్నారు.

Updated On 27 March 2023 9:01 AM GMT
Somu

Somu

Next Story