BJP-JDS alliance | న్యూఢిల్లీ: మరోసారి కేంద్రంలో అధికారం చేజిక్కించుకునేందుకు భారతీయ జనతా పార్టీ ప్రయత్నిస్తోంది. వచ్చే ఏడాది జరగబోయే లోక్‌సభ ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని బీజేపీ ఆయా రాష్ట్రాల రాజకీయాలపై దృష్టి సారించింది. ఈ క్రమంలోనే కర్ణాటకలో జనతాదళ్(సెక్యులర్)(జేడీఎస్)తో చేతులు కలిపేందుకు సిద్ధమైనట్లు సమాచారం. జేడీఎస్ అధినేత హెచ్‌డీ దేవెగౌడ ఇటీవల బీజేపీ జాతీయ అధ్యక్షుడు జయప్రకాశ్ నడ్డా, కేంద్ర హోం మంత్రి అమిత్ షాతో సమావేశమై పొత్తులపై చర్చించినట్లు తెలుస్తోంది. అయితే కర్ణాకటలో మొత్తం […]

BJP-JDS alliance |
న్యూఢిల్లీ: మరోసారి కేంద్రంలో అధికారం చేజిక్కించుకునేందుకు భారతీయ జనతా పార్టీ ప్రయత్నిస్తోంది. వచ్చే ఏడాది జరగబోయే లోక్‌సభ ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని బీజేపీ ఆయా రాష్ట్రాల రాజకీయాలపై దృష్టి సారించింది. ఈ క్రమంలోనే కర్ణాటకలో జనతాదళ్(సెక్యులర్)(జేడీఎస్)తో చేతులు కలిపేందుకు సిద్ధమైనట్లు సమాచారం. జేడీఎస్ అధినేత హెచ్‌డీ దేవెగౌడ ఇటీవల బీజేపీ జాతీయ అధ్యక్షుడు జయప్రకాశ్ నడ్డా, కేంద్ర హోం మంత్రి అమిత్ షాతో సమావేశమై పొత్తులపై చర్చించినట్లు తెలుస్తోంది.
అయితే కర్ణాకటలో మొత్తం 28 లోక్‌సభ స్థానాలు ఉన్నాయి. ఇందులో దేవెగౌడ ఐదు లోక్‌సభ స్థానాలను తమకు కేటాయించాలని బీజేపీ అధిష్టానాన్ని కోరినట్లు సమాచారం. ఈ విషయంలో ప్రధాని నరేంద్ర మోదీ తుది నిర్ణయం తీసుకుంటారని దేవెగౌడకు జేపీ నడ్డా సూచించినట్లు సమాచారం. మాండ్య, హసన్, తుముకూరు, చిక్‌బళ్లాపూర్, బెంగళూరు రూరల్ స్థానాలను కేటాయించాలని జేడీఎస్ కోరినట్లు తెలుస్తోంది.
అయితే ఈ సీట్ల పంపకాలపై జేడీఎస్ నేతలు ఏకాభ్రిప్రాయానికి వచ్చిన తర్వాతనే బీజేపీతో దేవెగౌడ సంప్రదింపులు జరిపినట్లు సమాచారం. లోక్‌సభ ఎన్నికల్లో తాము ఒంటరిగానే పోటీ చేస్తామని గతంలో దేవెగౌడ ప్రకటించిన విషయం తెలిసిందే. కానీ అంతలోనే మళ్లీ బీజేపీతో పొత్తుకు సంప్రదింపులు జరగడం గమన్హరం.
కర్ణాటకలో మొత్తం 28 లోక్‌సభ నియోజకవర్గాలు ఉన్నాయి. 2019 ఎన్నికల్లో బీజేపీ 25 సీట్లు గెలుచుకోగా, కాంగ్రెస్, జేడీ(ఎస్)లు ఒక్కో సీటును దక్కించుకున్నాయి. జేడీ(ఎస్) కంచుకోట హాసన్‌లో దేవెగౌడ మనవడు ప్రజ్వల్ రేవణ్ణ విజయం సాధించారు.
