విధాత: హైద‌రాబాద్ జిల్లా ప‌రిధిలోని గోషామ‌హ‌ల్ బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్‌కు మ‌రోసారి బెదిరింపు ఫోన్ కాల్స్ వ‌చ్చాయి. దీంతో డీజీపీ అంజ‌నీ కుమార్‌ను రాజాసింగ్ క‌లిసి ఫిర్యాదు చేశారు. త‌న‌కు ర‌క్ష‌ణ క‌ల్పించాల‌ని డీజీపీకి ఎమ్మెల్యే విజ్ఞ‌ప్తి చేశారు. గుర్తు తెలియ‌ని నంబ‌ర్ నుంచి వాట్సాప్ కాల్ చేసిన అగంతకులు.. త‌న‌తో పాటు త‌న కుటుంబాన్ని చంపేస్తామ‌ని బెదిరించార‌ని రాజాసింగ్ పేర్కొన్నారు. త‌మ కుటుంబ స‌భ్యులంద‌రి పేర్ల‌ను అగంత‌కులు చెప్పార‌ని, వారి దిన‌చ‌ర్య‌ను కూడా చెప్ప‌డంతో.. ఈ […]

విధాత: హైద‌రాబాద్ జిల్లా ప‌రిధిలోని గోషామ‌హ‌ల్ బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్‌కు మ‌రోసారి బెదిరింపు ఫోన్ కాల్స్ వ‌చ్చాయి. దీంతో డీజీపీ అంజ‌నీ కుమార్‌ను రాజాసింగ్ క‌లిసి ఫిర్యాదు చేశారు. త‌న‌కు ర‌క్ష‌ణ క‌ల్పించాల‌ని డీజీపీకి ఎమ్మెల్యే విజ్ఞ‌ప్తి చేశారు.

గుర్తు తెలియ‌ని నంబ‌ర్ నుంచి వాట్సాప్ కాల్ చేసిన అగంతకులు.. త‌న‌తో పాటు త‌న కుటుంబాన్ని చంపేస్తామ‌ని బెదిరించార‌ని రాజాసింగ్ పేర్కొన్నారు. త‌మ కుటుంబ స‌భ్యులంద‌రి పేర్ల‌ను అగంత‌కులు చెప్పార‌ని, వారి దిన‌చ‌ర్య‌ను కూడా చెప్ప‌డంతో.. ఈ అంశాన్ని సీరియ‌స్‌గా తీసుకోవాల‌న్నారు.

మొబైల్ ఆప‌రేటింగ్ ద్వారా బాంబును అమ‌ర్చి చంపేస్తామ‌ని బెదిరించిన‌ట్లు రాజాసింగ్ తెలిపారు. గ‌త కొద్ది రోజుల నుంచి రాజాసింగ్‌కు బెదిరింపులు వ‌స్తుండ‌టంతో.. వెప‌న్ లైసెన్స్ ఇవ్వాల‌ని ఇప్ప‌టికే ప్ర‌భుత్వానికి విజ్ఞ‌ప్తి చేశారు. గ‌తంలో కూడా రాజాసింగ్‌కు బెదిరింపులు వ‌చ్చాయి.

Updated On 21 March 2023 2:54 PM GMT
krs

krs

Next Story