Wednesday, March 29, 2023
More
  HomelatestTSPSC | ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా.. BJP కలెక్టరేట్ల ముట్టడి

  TSPSC | ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా.. BJP కలెక్టరేట్ల ముట్టడి

  • వరంగల్, హనుమకొండ, ములుగుల్లో నిరసనలు
  • నాయకులు, కార్యకర్తల అరెస్టు
  • పోలీసులతో వాగ్వివాదం, ఉద్రిక్తత

  విధాత, వరంగల్ ప్రత్యేక ప్రతినిధి: టీఎస్పీఎస్సీ (TSPSC) పేపర్ లీకేజీకి సంఘటన పై హైకోర్టు సిట్టింగ్ జడ్జితో విచారణ జరపాలని ఇవ్వాలని డిమాండ్ చేస్తూ ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా బీజేపీ (BJP) చేపట్టిన జిల్లా కలెక్టరేట్ల ముట్టడి కార్యక్రమం ఉద్రిక్తతకు దారితీసింది. ఉమ్మడి వరంగల్ జిల్లాలోని హనుమకొండ, ములుగు ప్రాంతాలలో బీజేపీ ఆధ్వర్యంలో కలెక్టరేట్లను ముట్టడించారు. వరంగల్ చౌరస్తాలో ధర్నా చేపట్టి నిరసన వ్యక్తం చేశారు.

  హనుమకొండలో

  బీజేపీ హనుమకొండ జిల్లా అధ్యక్షురాలు రావు పద్మ అధ్వర్యంలో అమరవీరుల స్థూపం వద్ద ధర్నా నిర్వహించి, అక్కడి నుండి కలెక్టర్ కార్యాలయం వరకు ర్యాలీ నిర్వహించి కలెక్టర్ కార్యాలయాన్ని ముట్టడించారు. కలెక్టరేట్ వద్ద పోలీసులు బీజేపీ నాయకులను అడ్డుకోవడంతో తోపులాట జరిగి ఉద్రిక్తంగా మారింది. అనంతరం పోలీసులు బీజేపీ నేతలు రావు పద్మ, మాజీ ఎమ్మెల్యే మార్తినేని ధర్మారావు, మరియు ఇతర నేతలను అరెస్టు చేసి నగరంలోని వివిధ పోలీస్ స్టేషన్లకు తరలించారు.

  నిరుద్యోగుల జీవితంతో చెలగాటం

  బీజేపీ హనుమకొండ జిల్లా అధ్యక్షురాలు రావు పద్మ మాట్లాడుతూ గ్రూప్ 1 ఎగ్జామ్స్ రద్దు కాదు, అవినీతి, అక్రమాలతో తెలంగాణ ప్రజలను పీడిస్తున్న కల్వకుంట్ల కుటుంబ పాలనను రద్దు చేయాలన్నారు. ప్రభుత్వం, తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమీషన్ చేతగాని నిర్లక్ష్య వైఖరితో పరీక్ష పత్రాల లీకేజీతో లక్షలాది మంది నిరుద్యోగుల భవిష్యత్ మళ్ళి మొదటికి వచ్చిందన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే మొలుగురి బిక్షపతి, చాడ శ్రీనివాస్ రెడ్డి, ఏనుగుల రాకేష్ రెడ్డి, గురుమూర్తి శివకుమార్, గుజ్జ సత్యనారయణ తదితరులు పాల్గొన్నారు.

  ములుగులో

  ములుగు జిల్లా కలెక్టరేట్ వద్ద ధర్నా ఉద్రిక్తతకు దారి తీసింది. బీజేపీ కార్యకర్తలు కలెక్టరేట్ లోపలికి చొచ్చుకెళ్లేందుకు ప్రయత్నించారు. ఈ సందర్భంగా బీజేపీ కార్యకర్తలకు పోలీసులకు మధ్య కొద్దిసేపు తోపులాట జరిగి ఉద్రిక్తతకు దారితీసింది. ప్రభుత్వం ఏర్పాటు చేసిన బ్యానర్లను ప్లెక్సీలను బీజేపీ కార్యకర్తలు ఆగ్రహంతో చింపివేశారు. దీంతో పోలీసులు బీజేపీ కార్యకర్తలపై కాసింత ఆగ్రహం ప్రదర్శించారు. అనంతరం పార్టీ నాయకులు కార్యకర్తలను పోలీసులు అరెస్టు చేసి పోలీస్ స్టేషన్‌కు తరలించారు.

  వరంగల్ చౌరస్తాలో

  TSPSC పేపర్ లీకేజీతో నష్ట పోయిన విద్యార్థులకు వెంటనే న్యాయం చేయాలని వరంగల్ చౌరస్తాలో ధర్నా చేశారు. బీజేపీ నాయకులను పోలీసులు అరెస్ట్ చేసి, ఇంతేజర్ గంజ్ పోలీస్ స్టేషన్ కు తరలించారు. అరెస్ట్ అయిన వారిలో ఎర్రబెల్లి ప్రదీప్ రావు, జిల్లా అధ్యక్షులు కొండేటి శ్రీధర్, మాజీ జిల్లా అధ్యక్షులు ఎడ్ల అశోక్ రెడ్డి, జిల్లా నాయకులు, కార్యకర్తలు ఉన్నారు.

  పేపర్ లీకేజీ పై సిట్టింగ్ జడ్జితో విచారణ చేపట్టాలి.. కలెక్టరేట్ ఎదుట బీజేపీ శ్రేణుల ఆందోళనలు

  టీఎస్పీఎస్సీ పేపర్ల లీక్ వ్యవహారంపై సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని డిమాండ్ చేస్తూ బీజేపీ జిల్లా శాఖ ఆధ్వర్యంలో కరీంనగర్ కలెక్టరేట్ ముందు ఆ పార్టీ నేతలు పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమం చేపట్టగా పోలీసులు అధ్యక్షుడు గంగాడి కృష్ణారెడ్డితో సహా బీజేపీ నేతలను అరెస్టు చేశారు.ఈ సందర్భంగా బీజేపీ జిల్లా అధ్యక్షుడు గంగాడి కృష్ణారెడ్డి మాట్లాడుతూ పేపర్ లీకేజీ అంశంపై తాము శాంతియుతంగా ఆందోళన చేపడుతుంటే పార్టీ శ్రేణులందరినీ అరెస్టుచేయడం అప్రజాస్వామికమన్నారు.

  తెలంగాణలో ప్రజాస్వామ్యం లేకుండా పోయిందన్నారు. ప్రభుత్వ తప్పులను ప్రశ్నిస్తే అక్రమ అరెస్టులకు పాల్పడటం నిత్య కృత్యంగా మారిందన్నారు. ఇలాంటి నియంతృత్వ, నిరంకుశ విధానాలు కెసిఆర్ ప్రభుత్వానికే చెల్లాయన్నారు.రాష్ట్రం ఏర్పడ్డ 8 ఏళ్ల తర్వాత ఉద్యోగాలకు నోటిఫికేషన్లు ఇచ్చినట్టే,ఇచ్చి
  పేపర్ లీకేజీ సాకుతో పరీక్షలను రద్దుచేసి ఈ ప్రభుత్వం చేతులు దులుపుకుందన్నారు.

  నిరుద్యోగుల బాధ,అవస్థలు ప్రభుత్వానికి ఏమాత్రం పట్టడం లేదన్నారు. ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తర్వాత లక్షలాదిమంది నిరుద్యోగుల జీవితాలతో కేసిఆర్ చెలగాటమాడుకుంటున్నారని ఆయన విమర్శించారు. రాష్ట్రవ్యాప్తంగా టిఎస్పీఎస్సీలో 33 లక్షల మంది నిరుద్యోగులు ఉద్యోగుల కోసం రిజిస్టర్ చేసుకున్నారని తెలిపారు.

  ఉద్యోగాల మీద ఆశతో వేల రూపాయలు వెచ్చించి, ప్రైవేట్ కోచింగ్ సెంటర్లలో శిక్షణ తీసుకొని అనేక కష్టనష్టాలు పడిన నిరుద్యోగుల శ్రమ పేపర్ లీకేజీ వ్యవహారంతో బూడిదల పోసిన పన్నీరులా మారిందన్నారు. పరీక్షల రద్దుతో లక్షలాదిమంది నిరుద్యోగుల జీవితాలు రోడ్డున పడ్డాయని, అయినా కేసిఆర్ ప్రభుత్వం ఈ విషయంలో స్పందించకపోవడం దారుణమన్నారు. పబ్లిక్ సర్వీస్ కమిషన్ పేపర్ లీకేజీ అంశంపై సిట్టింగ్ జడ్జితో విచారణ చేపట్టాలని, నష్టపోయిన నిరుద్యోగులను ఆదుకోవడానికి తగిన చర్యలు తీసుకోవాలని ఆయన ఈ సందర్భంగా డిమాండ్ చేశారు.

  ఈ కార్యక్రమంలో మాజీ మేయర్ డి.శంకర్, బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శులు తాళ్లపల్లి శ్రీనివాస్ గౌడ్, కళ్లెం వాసుదేవరెడ్డి, బత్తుల లక్ష్మీనారాయణ, పార్లమెంట్ కన్వీనర్ బోయినపల్లి ప్రవీణ్ రావు, జిల్లా ఉపాధ్యక్షులు ఎర్రబెల్లి సంపత్ రావు, జిల్లా ఆఫీస్ సెక్రెటరీ మాడుగుల ప్రవీణ్, జిల్లా మీడియా కన్వీనర్ కటకంలోకేష్, జిల్లా అధికార ప్రతినిధులు బొంతల కళ్యాణ్ చంద్ర, జానపట్ల స్వామి ఎడమ సత్యనారాయణరెడ్డి, జెల్ల సుధాకర్ మహిళా మోర్చా జిల్లా అధ్యక్షురాలు చొప్పరి జయశ్రీ, బండ రమణారెడ్డి,కొలగాని శ్రీనివాస్, దురిశెట్టి అనూప్, నాగసముద్రం ప్రవీణ్,జాడి బాల్రెడ్డి,బల్బీర్ సింగ్, మాడ గౌతమ్ రెడ్డి, పుప్పాల రఘు, మామిడి చైతన్య, ఆవుదుర్తి శ్రీనివాస్, నరహరి లక్ష్మారెడ్డి, పాదం శివరాజ్, కడార్ల రతన్,జీడి మల్లేష్, లక్ష్మణ్ రమేష్ తదితరులు పాల్గొన్నారు.

  spot_img
  RELATED ARTICLES

  Latest News

  Cinema

  Politics

  Most Popular