- మెదక్ నియోజక వర్గంలో గెలుపు బీజేపీదే
- సిద్దిపేట, సిరిసిల్ల గజ్వేల్ కే డబుల్ బెడ్రూం ఇండ్లు….
- నిజాం షుగర్ ఫ్యాక్టరీని తెరిపిస్తామని చెప్పి గాలికొదిలేసిన సీఎం
- నియోజకవర్గ ముఖ్య కార్యకర్తల సమావేశంలో ఎంపీ అరవింద్
విధాత, మెదక్ ఉమ్మడి జిల్లా బ్యూరో: రాబోయే ఎన్నికల్లో తెలంగాణలో బీజేపీ పార్టీ గెలుపు ఖాయమని, సునాయాసంగా అధికారంలోకి వస్తామని నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ స్పష్టం చేశారు. గురువారం మెదక్ జిల్లా కేంద్రంలోని ద్వారకా గార్డెన్స్ లో బీజేపీ శక్తి కేంద్ర ఇన్చీర్జీలు, బూత్ స్థాయి ముఖ్య కార్యకర్తల సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు.
బీఆర్ ఎస్ పార్టీ నాయకులు కేంద్రంలో పార్టీ ఏర్పాటు చేసినా, అంతరిక్షంలో తిరిగినా, కేసీఆర్ తలకిందులుగా తపస్సు చేసినా బీజేపీ గెలుపు తథ్యమని పేర్కొన్నారు. తెలంగాణా రాష్ట్రంలో 10 సంవత్సరాల కాలంలో డబుల్ బెడ్ రూంలు ఒక్క లక్షా 70 వేలు పూర్తయ్యాయని కేసీఆర్ చెపుతున్నప్పటికి కేవలం 23శాతమే పూర్తయ్యాయని తెలిపారు.
ఢిల్లీ నుండి తెలంగాణ వరకు కల్వకుంట్ల కుటుంబం దోచుకుందని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. మంత్రి హరీష్ రావు ఎక్కడ ఇన్చార్జిగా ఉంటే అక్కడ ఓటమి తథ్యమన్నారు. రాష్ట్రంలో బీజేపీ పార్టీ నెంబర్ వన్ గా ఉందన్నారు. మెదక్ ఎమ్మెల్యే పద్మాదేవేందర్ రెడ్డి నియోజకవర్గ అభివృద్ధిలో పూర్తిగా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని ఎమ్మెల్యే పై తీవ్ర వ్యతిరేకత ఉందన్నారు.
మెదక్ నియోజకవర్గంలో బీజేపీ గెలుపు ఖాయమన్నారు. మెదక్, నిజామాబాద్ జిల్లాలో ఉన్న నిజాం చక్కర పరిశ్రమను అధికారంలోకి వచ్చిన 100 రోజుల్లో తెరిపిస్తామని చెప్పిన సీఎం పట్టించుకోలేదన్నారు.
నిరుద్యోగ యువకులకు ఉద్యోగాల కల్పన లేదన్నారు. సిద్దిపేట, సిర్సిల్ల, గజ్వేల్ కే 23 శాతం ఇండ్లు కేటాయించు కున్నారని విమర్శించారు. 3 నియోజక వర్గాలకే ఎక్కువ నిధులు కేటాయించారని అన్నారు. సీఎం కెసిఆర్ ముందుస్తు కు పొయే ముచ్చేటే లేదన్నారు. అలా జరిగితే రాష్ట్ర పతి పాలన వస్తుందని సీఎం భయపడుతున్నారని అన్నారు.
కార్యక్రమంలో బీజేపీ జిల్లా అధ్యక్షులు గడ్డం శ్రీనివాస్, మల్లారెడ్డి, సీనియర్ నాయకులు నందు జనార్దన్ రెడ్డి, రాజశేఖర్ గుప్త, జిల్లా ఉపాధ్యక్షులు బైండ్ల సత్యనారాయణ ముదిరాజ్, సిద్దరాములు, పట్టణ అధ్యక్షుడు నాయిని ప్రసాద్, ప్రధాన కార్యదర్శి నల్లాల విజయ్ కుమార్, అసెంబ్లీ నియోజకవర్గ ఇన్చార్జి ఎక్కలదేవి మధుసూదన్, మహిళా మోర్చా నాయకురాలు బెండే వీణ, నాయకులు శ్రీపాల్, నియోజకవర్గ, జిల్లా నాయకులు, ఇన్చార్జిలు, బూత్ స్థాయి నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.