Friday, December 9, 2022
More
  Homelatestబీజేపీ ట్రాప్‌.. KCR రివ‌ర్స్‌ ట్రాప్‌

  బీజేపీ ట్రాప్‌.. KCR రివ‌ర్స్‌ ట్రాప్‌

  ఉన్నమాట: బీజేపీ తాను వేసిన వ‌ల‌లో తానే చిక్కుకుపోయింది. టీఆర్ఎస్‌ను చావు దెబ్బ తీయాల‌ని బీజేపీ నాయ‌క‌త్వం క‌సితో చేసిన ప్ర‌య‌త్నాలు బెడిసికొట్టాయ‌ని జ‌రుగుతున్న ప‌రిణామాలు తెలియ‌జేస్తున్నాయి.

  రాత్రంతా సెలబ్రేట్ చేసుకున్నాం: నరేష్, పవిత్రా లోకేష్‌!

  టీఆర్ఎస్‌ ఎమ్మెల్యేలు 12 మంది త్వ‌ర‌లో త‌మ పార్టీలో చేర‌నున్నార‌ని, ఇక నుంచి వ‌రుస‌గా ఉప ఎన్నిక‌లు జ‌రుగుతాయ‌ని బండి సంజ‌య్ ఆగ‌స్టు నాలుగున భువ‌న‌గిరిలో ప్ర‌జాసంగ్రామ యాత్ర సంద‌ర్భంగా విలేక‌రుల‌తో మాట్లాడుతూ చెప్పారు.

   

  ఆ త‌ర్వాత ఇదే మాట‌ను ర‌ఘునంద‌న్‌రావు, ప‌లువురు బీజేపీ నేత‌లు ప‌దేప‌దే చెబుతూ వ‌స్తున్నారు. ఏ ఆధారంతో బండి సంజ‌య్ ఈ ప్ర‌క‌ట‌న చేశారు? ఏ ప్ర‌య‌త్నం చేయ‌కుండానే ఈ ప్ర‌క‌ట‌న‌లు చేశారా? తాజాగా మ‌రో బీజేపీ నాయ‌కుడు ఉప ఎన్నిక‌లు ముగియ‌గానే ఎనిమిది మంది టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు త‌మ పార్టీలో చేరుతార‌ని ప్ర‌క‌టించారు.

   

  ఏంటి నిత్యామీనన్ పెళ్లి కాకుండానే తల్లి కాబోతోందా?

   

  ఏ ప్ర‌య‌త్నాలు చేయ‌కుండా, ఏ వాస‌న లేకుండా ఎనిమిది మంది ఎమ్మేల్యేలు పార్టీ మార‌తార‌ని బీజేపీ నాయ‌క‌త్వం ఎలా చెప్పింది? అంటే టీఆర్‌ఎస్ ఎమ్మెల్యేల‌ను ట్రాప్ చేయ‌డానికి బీజేపీ కొంత‌కాలంగా ప్ర‌య‌త్నిస్తూ ఉండాలి. అందులో భాగంగా బీజేపీ నాయ‌క‌త్వం, వారికి న‌మ్మిన బంట్లుగా ఉన్న స్వామీజీలు, ద‌ళారీలో కొనుగోలు ప్ర‌య‌త్నాల్లో ఉండి ఉండాలి.

   

   

  బైక్‌పై స్టంట్‌ చేస్తు.. ప్రీ వెడ్డింగ్ షూట్ (వీడియో వైరల్‌)

   

  ఈ ప్ర‌య‌త్నాలు కేసీఆర్ ముందే ప‌సిగ‌ట్టి దీనిని బ‌ట్ట‌బ‌య‌లు చేసేందుకు రివ‌ర్సు వ‌ల విసిరి ఉండాలి. ఏయే ఎమ్మెల్యేల‌తో బీజేపీ సంప్ర‌దింపులు జ‌రుపుతున్న‌దో కేసీఆర్ ముందే తెలుసుకుని, వారిని పిలిపించుకుని విశ్వాసంలోకి తీసుకుని, బీజేపీకి అనుకూల సంకేతాలు పంపించే ఏర్పాటు చేసి ఉండాలి.

   

  క్యాన్సర్‌ను గుర్తించి.. బాలిక ప్రాణాలు కాపాడిన యాపిల్ వాచ్

   

  అవ‌త‌ల బీజేపీ నాయ‌క‌త్వం ఈ రివ‌ర్సు వ‌ల విష‌యం తెలియ‌క‌, ఎమ్మెల్యేల‌ను న‌మ్మి కొనుగోలుకు ముంద‌డుగు వేసి ఉండాలి. డ‌బ్బులు, స్వామీజీలు అంతా సీనులోకి రాగానే మీడియాను రంగ ప్ర‌వేశం చేయించి ఉండాలి.

   

  ఏంటి బ్లాక్‌మెయిల్ చేస్తున్నారా?.. ఒక్క రూపాయ్ ఇవ్వను: పూరీ ఫైర్!

   

  త‌మ ఎమ్మెల్యేల‌తో బీజేపీ మంత‌నాల గురించి ముందుగానే కేసీఆర్‌కు తెలిసి ఉండాలి. ఎందుకంటే ఫామ్ హౌజ్ వ‌ద్ద అర‌వై డెబ్బై సీసీ కెమెరాలు ఏర్పాటు చేయించ‌డం అంటే చిన్న విష‌యం కాదు. ఎమ్మెల్యేల‌తో బీజేపీ మంత‌నాల గురించి కేసీఆర్‌కు ఎలా తెలిసి ఉంటుంద‌న్న‌ది ఈ వ్య‌వ‌హారంలో ఎదుర‌వుతున్న మ‌రో ప్ర‌శ్న‌.

   

  కిచ్చా సుదీప్‌తో హీరోయిన్ మీనా సీక్రెట్ మ్యారేజ్.. అసలు విషయం ఏంటంటే?

   

  ఫోన్లు టాపింగ్ చేసి క‌నిపెట్టారా లేక ఏదైనా గూఢ‌చారి శోధ‌న‌లో తెలిసిందా అన్న విష‌యం తేల‌వ‌ల‌సి ఉంది. ఇదంతా ప్ర‌భుత్వంలోని పెద్ద‌ల‌కు తెలిసి జ‌రిగింద‌న్న‌ది మాత్రం అర్థ‌మ‌వుతున్న‌ది. మొత్తంగా ఈ కొనుగోళ్ల వ్య‌వ‌హారంలో టీఆర్‌స్, బీజేపీలలో ఎవ‌రూ ఎవ‌రికీ తీసిపోర‌ని అర్థ‌మ‌వుతున్న‌ది.

   

  ‘అల్లు’వారి ఫ్రీ రిలీజ్‌కు బాలకృష్ణ: బాలయ్య ఇమేజ్ తగ్గిందా.. అల్లు ఇమేజ్ పెరిగిందా?

   

  రెండు పార్టీలూ పోటీలు ప‌డి రాజ‌కీయ హ‌న‌నాకి పాల్ప‌డుతున్నాయ‌ని, అన్ని విలువ‌ల‌నూ తుంగ‌లో తొక్కుతున్నాయ‌ని రాజ‌కీయ విమ‌ర్‌ీకులు అభిప్రాయ‌ప‌డుతున్నారు. తమ‌కు ఏ పాపం తెలియ‌ద‌ని, ఇదంతా త‌మ పార్టీని బ‌ద్నాం చేసే కుట్ర అని బీజేపీ నాయ‌కులు ఎంత గింజుకున్నా, ఎమ్మెల్యేల‌ను కొనుగోలు చేసేందుకు బీజేపీ కుట్ర చేసింద‌న్న‌ది వాస్త‌వం. ఆ కుట్ర‌ను టీఆర్ఎస్ ఛేదించింద‌న్న‌దీ వాస్త‌వం.

  జాన్వీ అంత మాట అనేసిందేంటి?.. రష్మిక, విజయ్‌ బంధం గురించి తెలిసేనా!

  RELATED ARTICLES

  Latest News

  Cinema

  Politics

  Most Popular

  You cannot copy content of this page