Saturday, April 1, 2023
More
    Homelatestత్రిపుర బీజేపీదే.. నాగాలాండ్‌లో ముందంజ, మేఘాలయలో దూసుకొచ్చిన NPP

    త్రిపుర బీజేపీదే.. నాగాలాండ్‌లో ముందంజ, మేఘాలయలో దూసుకొచ్చిన NPP

    Tripura, Nagaland Meghalaya ।

    త్రిపుర అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ ఘన విజయం దిశగా దూసుకుపోతున్నది. నాగాలాండ్‌లో మిత్రపక్షం ఎన్‌డీపీపీ (NDPP)తో కలిసి తిరుగులేని ఆధిక్యంలో ఉన్నది. ఇక మరో ఈశాన్య రాష్ట్రమైన మేఘాలయలో ఎన్‌పీపీ (NPP) ముందుకు వచ్చింది. ఇక్కడ బీజేపీతో కలిసి ప్రభుత్వం ఏర్పడే అవకాశాలు కనిపిస్తున్నాయి.

    విధాత: ఈశాన్య రాష్ట్రాలైన త్రిపుర (Tripura), మేఘాలయ (Meghalaya), నాగాలాండ్‌ (Nagaland) లో గురువారం ఓట్ల లెక్కింపు కొనసాగుతున్నది. బీజేపీ నేతృత్వంలోని ఎన్‌డీఏ కూటమి త్రిపుర, నాగాలాండ్‌లో ముందంజలో ఉన్నాయి. విజయానికి అవసరమైన మెజార్టీ మార్కును దాటేశాయి. మేఘాలయలో ఎన్‌పీపీ ఆధిక్యంలో ఉన్నా.. మెజార్టీ దక్కే అవకాశం కనిపించడం లేదు. ఇక్కడ బీజేపీతో కలిసి ఎన్‌పీపీ (Government in an alliance with BJP) ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే అవకాశం కనిపిస్తున్నదని అంటున్నారు.

    త్రిపురలో

    60 స్థానాలు ఉన్న త్రిపుర అసెంబ్లీ ఎన్నికల్లో ప్రతిపక్ష వామపక్ష కూటమి, కాంగ్రెస్‌ కలిసి పోటీ చేశాయి. బీజేపీ తన మిత్రపక్షమైన ఇండీజీనియస్‌ పీపుల్స్‌ ఫ్రంట్‌ ఆఫ్‌ త్రిపురతో కలిసి బరిలో నిలిచింది. అయితే.. గ్రేటర్‌ తిప్రలాండ్‌’ (Greater Tipraland) డిమాండ్‌తో తిప్ర మోత (Tipra Motha) పేరుతో కొత్త పార్టీ రంగంలోకి రావడం ఆసక్తి రేపింది.

    దీనికి ప్రద్యోత్‌ మాణిక్య దేబ్‌బర్మ నేతృత్వం వహిస్తున్నారు. తాజా సమాచారం అందేసరికి బీజేపీ(BJP), ఐపీఎఫ్‌టీ (IPFT) కూటమి 33 స్థానాల్లో దూసుకుపోతున్నది. కాంగ్రెస్‌, వామపక్షాలు 16 సీట్లు గెలుచుకునే అవకాశం కనిపిస్తున్నది. తిప్ర మోత 10 స్థానాల్లో ఆధిక్యం కనబరుస్తున్నది.

    మేఘాలయ

    ఎగ్జిట్‌ పోల్‌ (Exit polls) అంచనాలకు దగ్గరగా మేఘాలయలో హంగ్‌ అసెంబ్లీ (Hung Assembly) ఏర్పడే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇక్కడ ఏకైక పెద్ద పార్టీగా అవతరిస్తుందని అంచనా వేస్తున్న అధికార నేషనల్‌ పీపుల్స్‌ పార్టీ (National People’s Party) బీజేపీతో ఎన్నికల అనంతర పొత్తు పెట్టుకునే అవకాశాలు ఉన్నాయన్న చర్చ జరుగుతున్నది. ఇక్కడ ఎన్‌పీపీ 24 స్థానాల్లో ఆధిక్యంలో ఉండగా, కాంగ్రెస్‌, బీజేపీ చెరి ఐదేసి స్థానాల్లో ముందంజలో ఉన్నాయి. మేఘాలయ అసెంబ్లీలో 60 నియోజకవర్గాలు ఉన్నాయి. సోహియోంగ్ స్థానంలో ఒక అభ్యర్థి మరణంతో అక్కడ పోలింగ్‌ జరుగలేదు.

    నాగాలాండ్‌

    నాగాలాండ్‌లో బీజేపీ, చింగ్‌వాంగ్‌ కొన్యాక్‌ (Chingwang Konyak) నేతృత్వంలోని నేషనలిస్ట్‌ డెమోక్రటిక్‌ ప్రోగ్రెసివ్‌ పార్టీ ఏకంగా 37 స్థానాల్లో గెలుపు దిశగా దూసుకుపోతున్నది. నాగా పీపుల్స్‌ ఫ్రంట్‌ (Naga People’s Front) ఐదు, కాంగ్రెస్‌ 3 చోట్ల ఆధిక్యంలో ఉన్నాయి. నాగాలాండ్‌ అసెంబ్లీలో 60 స్థానాలు ఉన్నాయి.

    spot_img
    RELATED ARTICLES

    Latest News

    Cinema

    Politics

    Most Popular