అక్రమ అరెస్టులకు భయపడేది లేదు. పాత పాలమూరు బ్రిడ్జి ని వెంటనే పునర్నిర్మించాలి.. కలెక్టర్ ను కలిసి వినతిపత్రం ఇచ్చిన బీజేపీ విధాత‌: పాత పాలమూరు బ్రిడ్జి నిర్మించేంతవరకు పోరాడుతామని భారతీయ జనతా పార్టీ సీనియర్ నాయకులు ఎంపీ వెంకటేష్ అన్నారు. సోమవారం ఉదయం శిథిలావస్థలో ఉన్న పాత పాలమురు బ్రిడ్జిని పరిశీలించి జిల్లా కలెక్టర్ దృష్టికి తీసుకువెళ్లే సమయంలో వన్ టౌన్ పట్టణ పోలీసులు అక్రమంగా అరెస్టు చేయడం సరికాదన్నారు. ఎన్ని అరెస్టులు చేసిన భయపడేది […]

  • అక్రమ అరెస్టులకు భయపడేది లేదు.
  • పాత పాలమూరు బ్రిడ్జి ని వెంటనే పునర్నిర్మించాలి..
  • కలెక్టర్ ను కలిసి వినతిపత్రం ఇచ్చిన బీజేపీ

విధాత‌: పాత పాలమూరు బ్రిడ్జి నిర్మించేంతవరకు పోరాడుతామని భారతీయ జనతా పార్టీ సీనియర్ నాయకులు ఎంపీ వెంకటేష్ అన్నారు. సోమవారం ఉదయం శిథిలావస్థలో ఉన్న పాత పాలమురు బ్రిడ్జిని పరిశీలించి జిల్లా కలెక్టర్ దృష్టికి తీసుకువెళ్లే సమయంలో వన్ టౌన్ పట్టణ పోలీసులు అక్రమంగా అరెస్టు చేయడం సరికాదన్నారు. ఎన్ని అరెస్టులు చేసిన భయపడేది లేదని వారు హెచ్చరించారు. అనంతరం జిల్లా కలెక్టర్‌ను కలిసి బ్రిడ్జి నిర్మాణం గురించి వివరించారు.

ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షులు వీర బ్రహ్మచారి మాట్లాడుతూ.. వన్ టౌన్ నుండి భగీరథ కాలనీ వెళ్లే దారిలో ఉన్న పాత పాలమూరు బ్రిడ్జి శిథిలావస్థకు చేరుకొని అనేక ప్రమాదాలకు కేంద్రబిందువుగా మారిందని భారతీయ జనతా పార్టీ జిల్లా అధ్యక్షులు వీర బ్రహ్మచారి కలెక్టర్కు తెలిపారు.

సోమవారం బీజేపీ పట్టణ శాఖ ఆధ్వర్యంలో బ్రిడ్జిని పరిశీలించి నిరసన తెలిపేందుకు వెళ్లిన బీజేపీ సీనియర్ నాయకులు న్యాయవాది ఎన్‌పీ వెంకటేష్, జిల్లా కోశ అధ్యక్షులు శేరి పాండురంగారెడ్డి, పట్టణ అధ్యక్షులు నారాయణ యాదవ్, శక్తి కేంద్ర ఇన్చార్జి కుమార్ ముదిరాజ్, సంపత్, విజయ్ లతోపాటు బీజేపీ నాయకులను, కార్యకర్తలను వన్ టౌన్ పోలీసులు అక్రమంగా అరెస్టు చేయడం అమానుష‌మని ఆయన విమర్శించారు.

ప్రజాస్వామ్యంలో ప్రజల సమస్యలను ఎత్తి హక్కు కూడా ప్రతిపక్షాలకు లేదా అని ప్రశ్నించారు. టిఆర్ఎస్ ప్రభుత్వా నిరంకుశ పాలనకు అండగా నిలుస్తూ పోలీసులు అక్రమ అరెస్టులు చేయడం ఏమిటని ప్రశ్నించారు.

ప్రమాదాలు జరిగి ప్రజలు ప్రాణాలు కోల్పోతున్నారని,ఇకముందు ఇలాంటి ప్రాణ నష్టాలు అరికట్టేందుకు నూతన బ్రిడ్జిని నిర్మించి పాలమూరు పట్టణ ప్రజల ప్రాణాలను కాపాడాలని కలెక్టర్ కు విజ్ఞప్తి చేశారు.. కలెక్టర్ ను కలిసిన వారిలో జిల్లా ప్రధాన ఉపాధ్యక్షులు పి సత్యం. కౌన్సిలర్ అంజయ్య పట్టణ అధ్యక్షులు నారాయణ యాదవ్. సుబ్రహ్మణ్యం. రాజు కమలేకర్. తదితరులు పాల్గొన్నారు.

Updated On 27 March 2023 10:41 AM GMT
Somu

Somu

Next Story