విధాత‌: అదానీ గ్రూప్‌కు మ‌రిన్ని అప్పులిచ్చేందుకు సిద్ధ‌మ‌ని బ్యాంక్ ఆఫ్ బ‌రోడా (బీవోడీ) సీఈవో, ఎండీ సంజీవ్ చ‌ద్దా అన్నారు. ఈ ప్ర‌భుత్వ రంగ బ్యాంకింగ్ సంస్థ సార‌థి ఓ తాజా ఇంట‌ర్వ్యూలో అదానీ సంస్థ‌ల‌కు రుణాలిచ్చేందుకు సంశ‌యించ‌బోమ‌న్నారు. హిండెన్‌బ‌ర్గ్ రిపోర్టు, దేశీయ స్టాక్ మార్కెట్ల‌లో అదానీ కంపెనీల షేర్ల ప‌త‌నం, ప‌డిపోతున్న‌ ఆయా సంస్థ‌ల రేటింగ్‌, విలువ‌ను కోల్పోతున్న బాండ్లు త‌దిత‌ర ప‌రిణామాల మ‌ధ్య బీవోబీ సీఈవో చ‌ద్దా చేసిన ప్ర‌క‌ట‌న అత్యంత ప్రాధాన్య‌త‌ను సంత‌రించుకున్న‌ది. […]

విధాత‌: అదానీ గ్రూప్‌కు మ‌రిన్ని అప్పులిచ్చేందుకు సిద్ధ‌మ‌ని బ్యాంక్ ఆఫ్ బ‌రోడా (బీవోడీ) సీఈవో, ఎండీ సంజీవ్ చ‌ద్దా అన్నారు. ఈ ప్ర‌భుత్వ రంగ బ్యాంకింగ్ సంస్థ సార‌థి ఓ తాజా ఇంట‌ర్వ్యూలో అదానీ సంస్థ‌ల‌కు రుణాలిచ్చేందుకు సంశ‌యించ‌బోమ‌న్నారు.

హిండెన్‌బ‌ర్గ్ రిపోర్టు, దేశీయ స్టాక్ మార్కెట్ల‌లో అదానీ కంపెనీల షేర్ల ప‌త‌నం, ప‌డిపోతున్న‌ ఆయా సంస్థ‌ల రేటింగ్‌, విలువ‌ను కోల్పోతున్న బాండ్లు త‌దిత‌ర ప‌రిణామాల మ‌ధ్య బీవోబీ సీఈవో చ‌ద్దా చేసిన ప్ర‌క‌ట‌న అత్యంత ప్రాధాన్య‌త‌ను సంత‌రించుకున్న‌ది.

బ్యాంక్ నిబంధ‌న‌ల‌కు లోబ‌డి అదానీ గ్రూప్‌కు మ‌రిన్ని రుణాలిచ్చేందుకు సిద్ధ‌మ‌ని చ‌ద్దా ప్ర‌క‌టించారు. ఈ క్ర‌మంలోనే స్టాక్ మార్కెట్ల‌లో అదానీ షేర్ల ఒడిదుడుకులపై భ‌యాలేవీ లేవ‌న్నారు. అదానీ గ్రూప్‌కు ఇప్ప‌టికే బీవోబీ అప్పులిచ్చిన సంగ‌తి విదిత‌మే.

అదానీ గ్రూప్ కంపెనీలు దేశీయ‌ స్టాక్ మార్కెట్ల‌లో అవ‌క‌త‌వ‌క‌ల‌కు పాల్ప‌డ్డాయంటూ గ‌త నెల 24న అమెరికా షార్ట్ సెల్ల‌ర్ హిండెన్‌బ‌ర్గ్ ఓ నివేదిక‌ను విడుద‌ల చేసినది తెలిసిందే. దీంతో కేవ‌లం వారం రోజుల్లో 10 ల‌క్ష‌ల కోట్ల రూపాయ‌ల మేర అదానీ గ్రూప్ మార్కెట్ విలువ హ‌రించుకుపోయింది. ఇక అదానీ వ్య‌వ‌హారం రాజ‌కీయ దుమారాన్నీ రేపుతున్న‌ది విదిత‌మే.

Updated On 20 Feb 2023 8:57 AM GMT
Somu

Somu

Next Story