Thursday, March 23, 2023
More
    Homelatestగ్రామ దేవ‌త‌ల‌కు ప్ర‌తినిధి బొడ్రాయి: మంత్రి జ‌గ‌దీష్‌రెడ్డి

    గ్రామ దేవ‌త‌ల‌కు ప్ర‌తినిధి బొడ్రాయి: మంత్రి జ‌గ‌దీష్‌రెడ్డి

    • దైవ చింత‌న‌తో మాన‌సిక ప్ర‌శాంత‌త..
    • సంస్కృతి, సంప్రదాయాలు కాపాడేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలి..
    • విగ్రహ ప్రతిష్ట మహోత్సవాల్లో పాల్గొన్న మంత్రి.. ప్ర‌త్యేక పూజ‌లు

    విధాత: బీఆర్ఎస్ ప్రభుత్వ పాలనలో ఆలయాలకు పునర్వైభవం వచ్చిందని, రాష్ట్రంలో అన్ని మతాలకు సమ ప్రాధాన్యం ఇస్తూ వారి వారి మత ఆచారాలకు అనుగుణంగా ప్రభుత్వమే పండుగలను నిర్వహించిన ఘనత దేశంలో కేసీఆర్ ఆర్ ప్రభుత్వానిదేనని మంత్రి జి.జగదీష్ రెడ్డి అన్నారు. తెలంగాణ సంస్కృతి సంప్రదాయాలకు బొడ్రాయి పండుగ నిర్వచనం అన్నారు.

    సోమవారం చివ్వెంల మండలం మున్యా నాయక్ తండాతో పాటు పంచాయ‌తీ పరిధిలోని దేవ్లా తండా, పీక్లా తండాలలో కన్నుల పండుగగా సాగుతున్న బొడ్రాయి, కోదండ రామాలయం, అంజనేయ స్వామి విగ్రహ ప్రతిష్ట మహోత్సవంలో పాల్గొన్న మంత్రి దేవతా మూర్తులకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ… బొడ్రాయి ప్రతిష్టా మహోత్సవము అనేది మహాలక్ష్మి అంశ అన్నారు. బొడ్రాయి అనేది గ్రామ దేవతలకు ప్రతినిధి అన్నారు.

    ఊరి భౌగోళిక పరిమాణం, ఊరి నిర్మాణం పైన ప్రజందరికీ అవగాహన కల్పించడం కోసమే ఈ పండుగ చేస్తారని అంటారన్నారు.. ప్రతీ ఒక్కరు తమ తమ మత ఆచారాల కు అనుగుణంగా దైవ చింతన ను కలిగి ఉండాలని తద్వారా మానసిక ప్రశాంతత చేకూరుతుందని మంత్రి అన్నారు.

    సీఎం కేసీఆర్‌ నాయకత్వంలో రాష్ట్రంలోని ఆలయాల పున:ప్రతిష్ట ఎంతో వైభవంగా కొనసాగుతున్నదన్నారు. కొందరు దేవుడు వారికి మాత్రమే సొంతం అనే విధంగా మాట్లాడుతున్నారని, అది సరికాదు అని మంత్రి అన్నారు. తండాలను గ్రామ పంచాయ‌తీలుగా మార్చి తండాల అభివృద్ధికి శ్రీకారం చుట్టిన కేసీఆర్ కు గిరిజన సమాజం అండగా నిలబడాలని మంత్రి కోరారు.

    గ్రామాల్లో సంస్కృతి, సంప్రదాయాలు కాపాడేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని మంత్రి సూచించారు.ఎప్పుడూ ఆధ్యాత్మిక కాంతితో వెలుగొందే మున్యా నాయక్ తండా, దెవ్లా, పీక్లా తండాలు అభివృద్ధి చెందాలనీ, దేవతా మూర్తుల అశీస్సులు గ్రామంలోని ప్రతీ ఒక్కరి పై వుండాలని కోరుకుంటున్నట్లు మంత్రి తెలిపారు.

    కార్యక్రమంలో ఎంపిపి కుమారి బాబూ నాయక్, జడ్పీటిసి సంజీవ నాయక్, వైస్ ఎంపిపి జీవన్ రెడ్డి, రౌతు నర్సింహారావ్, బీఆర్ఎస్ రాష్ట్ర కార్యదర్శి వై.వీ, రాష్ట్ర నాయకులు ఉప్పల ఆనంద్, మున్యా నాయక్, తండా సర్పంచ్ బికారు, ఎంపిటిసి సుశీల సాగర్, టి.ఆర్.ఎస్వీ నాయకుడు బాలాజీ నాయక్,
    తదితరులు పాల్గొన్నారు.

    RELATED ARTICLES

    LEAVE A REPLY

    Please enter your comment!
    Please enter your name here

    Latest News

    Cinema

    Politics

    Most Popular