Friday, October 7, 2022
More
  Home latest మీడియాపై తమన్నా బౌన్సర్ల దాడి.. నిజమేనా? లేక ప్లాన్ చేశారా?

  మీడియాపై తమన్నా బౌన్సర్ల దాడి.. నిజమేనా? లేక ప్లాన్ చేశారా?

  విధాత: తమన్నా ప్రధాన పాత్రలో నటించిన చిత్రం ‘బబ్లీ బౌన్సర్’. తమన్నా ఇందులో లేడీ బౌన్సర్‌గా నటిస్తోంది. ఇప్పటి వరకు బౌన్సర్ అంటే మగవాళ్లే ఉండేవారు. ఈ సినిమా తర్వాత ఆడవాళ్లు కూడా ఆ జాబ్‌కి పోటీ పడేలా సినిమాని తెరకెక్కించినట్లుగా మేకర్స్ చెబుతున్నారు. స్టార్ స్టూడియోస్ మరియు జంగిలీ పిక్చర్స్ నిర్మిస్తోన్న ఈ చిత్రానికి జాతీయ అవార్డు గ్రహీత దర్శకుడు మధుర్ భండార్కర్ దర్శకుడు. సెప్టెంబర్ 23న ఈ చిత్రం డిస్నీ ప్లస్ హాట్‌స్టార్‌లో డైరెక్ట్‌గా విడుదల కాబోతోంది.

  ఈ సందర్భంగా హైదరాబాద్ అన్నపూర్ణ స్టూడియోస్‌లో మేకర్స్ మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సినిమా టైటిల్‌లో బౌన్సర్ ఉందని చెప్పి.. ఈ ఈవెంట్‌కి బౌన్సర్స్‌గా వచ్చిన వాళ్లు అతి చేయడం ఇప్పుడు టాక్ ఆఫ్ ద ఇండస్ట్రీగా మారింది. ఈ మధ్య సినిమాని వార్తలలో ఉంచడం కోసం మేకర్స్ ఎంతకైనా దిగజారుతున్నారు. ఆ మధ్య ‘అశోకవనంలో అర్జున కళ్యాణం’ చిత్రానికి ఏం జరిగిందో తెలియంది కాదు. ఐమ్యాక్స్ థియేటర్ వద్ద సినిమా ఎలా ఉందో చెప్పేవాడితో.. విష్వక్సేన్ కారు ముందు డ్రామా ఆడించారు. ఇప్పుడీ ప్రమోషనల్ ఈవెంట్‌లో జరిగింది చూస్తుంటే కూడా అలానే అనిపిస్తుంది.

  అసలేం జరిగిందంటే.. మీడియా సమావేశం అనంతరం.. తమన్నాని సోలోగా ఫొటోలు తీయాలని ఫొటోగ్రాఫర్లు కొందరు ప్రయత్నించగా.. దానికి బౌన్సర్లు.. కుదరదు అంటూ గొడవ పెట్టుకున్నారు. అయితే అప్పటికే తమన్నా అక్కడి నుండి వెళ్లిపోయింది. ఆ తర్వాత బౌన్సర్స్‌కి.. ఫొటోగ్రాఫర్లకి మధ్య గొడవ జరిగింది. ఈ గొడవలో ఒక బౌన్సర్.. కెమెరామ్యాన్‌పై చేయి కూడా చేసుకున్నాడనేలా టాక్ నడుస్తుంది.

  దీంతో అక్కడున్న కెమెరామ్యాన్స్ కూడా బౌన్సర్స్‌పై సీరియస్ అవడం, ఒక బౌన్సర్ అక్కడున్న డస్ట్‌బిన్ తీసుకుని వారిపై విసరబోవడం వంటి వాటితో.. ఈ ఈవెంట్ పెద్ద రసాభాసగా మారింది. అయితే వెంటనే బౌన్సర్ల హెడ్ కలుగజేసుకుని.. ఫొటోగ్రాఫర్లకు, కెమెరామ్యాన్స్‌కి ఆ బౌన్సర్స్ చేత క్షమాపణలు చెప్పించడంతో.. గొడవ సద్దుమణిగింది.

  అయితే, చిన్న విషయాన్ని కూడా చాలా సీరియస్‌గా తీసుకునే మీడియా వారు.. ఇలా కాసేపట్లో ఈ విషయాన్ని వదిలేయడం వెనుక.. ఏదో మతలబు ఉన్నట్లుగా తెలుస్తుంది. విష్వక్సేన్ విషయంలో ఏదైతే జరిగిందో.. అదే ఇక్కడ కూడా బౌన్సర్‌తో మేకర్స్ చేయించారనేలా టాక్ నడుస్తుండటం విశేషం. ఏదైతేనేం.. అసలింత వరకు వినిపించని ఈ ‘బబ్లీ బౌన్సర్’ పేరు.. ఈ గొడవ రూపంలో కాస్త మీడియా దృష్టిలో అయితే పడిందని మాత్రం చెప్పుకోవాలి.

  RELATED ARTICLES

  అయ్యబాబోయ్.. థమన్‌ని పట్టుకోలేకపోతున్నారుగా!

  విధాత: థమన్.. టాలీవుడ్‌లో మిస్సైల్‌లా దూసుకుపోతున్న పేరు. ఆయన సంగీతానికి ఇప్పుడు ప్రత్యేక ఫ్యాన్స్ ఉన్నారు. ఆయన సంగీతం అందించిన సినిమా అంటే.. థియేటర్లలో సౌండ్ బాక్స్‌లు మార్పించుకుంటున్న థియేటర్స్...

  మీరు క్రెడిట్ కార్డు వాడుతున్నారా..? అయితే, మీకు గుడ్ న్యూస్‌!

  విధాత: రెగ్యుల‌ర్‌గా క్రెడిట్ కార్డు వినియోగించే క‌స్ట‌మ‌ర్ల‌కు నేష‌న‌ల్ పేమెంట్స్ కార్పొరేష‌న్ ఆఫ్ ఇండియా శుభ‌వార్త వినిపించింది. రూపే క్రెడిట్ కార్డుతో రూ.2000 వ‌ర‌కు జ‌రిపే యూపీఐ ట్రాన్సాక్ష‌న్స్ మీద...

  గరికపాటినీ వదలని మెగా బ్రదర్.. సోషల్ మీడియాలో సెటైర్!

  విధాత: ‘‘ఏపాటి వాడికైనా చిరంజీవిగారి ఇమేజ్ చూస్తే ఆ పాటి అసూయ పడటం పరిపాటే’’.. ఇది నాగబాబు చేసిన ట్వీట్. ఇది గరికపాటి వారినే అని ఎలా, ఎందుకు అనుకోవాలి...

  Most Popular

  ఆస్కార్‌కు RRR.. ఇప్పుడైనా కల నెరవేరుతుందా?

  విధాత: దర్శకధీరుడు ఎస్.ఎస్. రాజమౌళి ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించిన చిత్రం ‘RRR’. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద పెను ప్రభంజనాన్ని సృష్టించిన విషయం తెలిసిందే. ఇద్దరు స్టార్ హీరోలతో రాజమౌళి...

  You cannot copy content of this page