వరుసగా పాన్ ఇండియా స్థాయిలో తీసిన సైరా నరసింహారెడ్డి నిరాశపరిచింది. ఆ తరువాత వచ్చిన ఆచార్య డిజాస్ట‌ర్ అయింది. లూసీఫ‌ర్‌కి రీమేక్‌గా చేసిన గాడ్ ఫాదర్ కేవలం పరవాలేదు అనిపించింది. దీంతో చిరంజీవితో పాటు ఆయన అభిమానులు కూడా బాగా నిరుత్సాహ‌ ప‌డ్డారు. ఇలాంటి సమయంలో ఈ సంక్రాంతికి వాల్తేరు వీరయ్యగా బాక్సాఫీస్ వద్ద వీరంగం ఆడేస్తున్నాడు. జనవరి 13న విడుదలైన ఈ చిత్రం బాక్స్ ఆఫీస్ తుఫాను ఉధృతి ఇంకా తగ్గలేదు. వర్కింగ్ డేస్‌లో సైతం […]

వరుసగా పాన్ ఇండియా స్థాయిలో తీసిన సైరా నరసింహారెడ్డి నిరాశపరిచింది. ఆ తరువాత వచ్చిన ఆచార్య డిజాస్ట‌ర్ అయింది. లూసీఫ‌ర్‌కి రీమేక్‌గా చేసిన గాడ్ ఫాదర్ కేవలం పరవాలేదు అనిపించింది. దీంతో చిరంజీవితో పాటు ఆయన అభిమానులు కూడా బాగా నిరుత్సాహ‌ ప‌డ్డారు. ఇలాంటి సమయంలో ఈ సంక్రాంతికి వాల్తేరు వీరయ్యగా బాక్సాఫీస్ వద్ద వీరంగం ఆడేస్తున్నాడు.

జనవరి 13న విడుదలైన ఈ చిత్రం బాక్స్ ఆఫీస్ తుఫాను ఉధృతి ఇంకా తగ్గలేదు. వర్కింగ్ డేస్‌లో సైతం అద్భుతమైన వసూళ్లను రాబట్టింది. ఇక వీకెండ్లో చెలరేగిపోయింది. ఆదివారం రోజు మార్నింగ్ షో నుంచి మొద‌లైన బాక్సాఫీస్ జోరు సెకండ్ షో వరకు సాగింది. రెండో రోజు ఈ సినిమాకి ఎలాంటి కలెక్షన్లు వచ్చాయో అలాంటి వ‌సూళ్ల‌నే ఈ ఆదివారం కూడా రాబట్టింది.

తొమ్మిది రోజులకు గాను 182 కోట్లకు పైగా గ్రాస్ను వసూలు చేసింది. పది రోజులకు కలిపి 200 కోట్ల గ్రాస్ రాబట్టింది. ఇది నిజంగా ఎవ్వరూ ఊహించని అద్భుతం. మెగాస్టార్ కమర్షియల్ సినిమా చేస్తే బాక్సాఫీస్ వద్ద రేంజ్లో వ‌సూళ్లు వస్తాయో అని ప్రతి ఒక్కరికి మరోసారి నిరూపితమైంది.

నైజాం ప్రాంతంలో 30 కోట్ల షేర్ మార్కెట్ దాటింది. ఇప్పటివరకు ఇక్కడ కేవలం పవన్ కళ్యాణ్ మహేష్ బాబు ప్రభాస్ అల్లు అర్జున్ మాత్రమే ఈ రేంజి వసూలను రాబట్టారు. వాళ్లతో పాటుగా రెండు సార్లు 30 కోట్ల షేర్ ని కొల్లగొట్టిన హీరోగా చిరు రికార్డ్స్ లోకి ఎక్కాడు.

సీడెడ్‌లో 16 కోట్ల షేర్ దాటింది మరో నాలుగు కోట్ల రూపాయలు వ‌సూలు చేస్తే నాన్ రాజ‌మౌళి ఇండస్ట్రీ హిట్ చిరంజీవి ఖాతాలో ఉంటుంది. అలా ఈ సినిమా పది రోజుల స‌మ‌యంలోనే నాన్ రాజమౌళి ఇండస్ట్రీ హిట్కి ఇంచుమించు నాలుగు అడుగుల దూరంలో ఉంది.

వచ్చే వారం ఈ దూరాన్ని కూడా కవర్ చేస్తుందని అంటున్నారు. ఓవర్సీస్ లో ఈ చిత్రం ఇప్పటివరకు 2.3 మిలియన్ డాలర్లు వసూలు చేసింది. మొత్తంగా లాంగ్ రన్లో ఈ చిత్రం ఎంతవరకు వసూలు చేస్తుందో వేచి చూడాలి..!

Updated On 23 Jan 2023 9:20 AM GMT
krs

krs

Next Story