Saturday, April 1, 2023
More
    HomelatestBrave Dog | మంచం కింద విష‌పూరిత స‌ర్పం.. య‌జ‌మానిని కాపాడిన శున‌కం..

    Brave Dog | మంచం కింద విష‌పూరిత స‌ర్పం.. య‌జ‌మానిని కాపాడిన శున‌కం..

    Brave Dog | శునకం మనిషికి అత్యంత విశ్వాస పాత్రమైన జంతువు. అలాంటి శున‌కం (Dog) ఓ విష‌పూరిత స‌ర్పం (Snake) నుంచి త‌న య‌జ‌మానిని కాపాడింది. మంచం (Couch) కింద న‌క్కి ఉన్న పామును చూసి కుక్క ప‌దే ప‌దే మొర‌గ‌డంతో య‌జ‌మాని అప్ర‌మ‌త్త‌మై త‌న ప్రాణాల‌ను కాపాడుకున్నాడు.

    మేయర్‌ను వదలని RGV.. ‘కుక్కల మేయర్’ అంటూ పాట విడుదల

    ద‌క్షిణాఫ్రికా (South Africa)కు చెందిన ఓ వ్య‌క్తి ఓ కుక్క‌ను పెంచుకుంటున్నాడు. ఆ శున‌కానికి య‌జ‌మాని అంటే ఎంతో ప్రేమ‌. య‌జ‌మానికి ఏమైనా జ‌రిగితే త‌ట్టుకోలేదు. అయితే మూడు రోజుల క్రితం విష‌ పూరిత‌మైన స‌ర్పం (Black Mamba Snake) య‌జ‌మానికి ఇంట్లోకి ప్ర‌వేశించి, మంచం కింద న‌క్కింది.

    Inland Taipan | ఈ పాము కాటేస్తే ఒకేసారి 100 మంది బ‌లి

    అయితే.. ఈ పామును కుక్క గ‌మ‌నించి, ప‌దే ప‌దే మొరిగింది. య‌జ‌మాని మంచం మీద నుంచి కాలు పెడుతుంటే కూడా కుక్క కింద పెట్ట‌నివ్వ‌లేదు. రెండు రోజుల పాటు అదే తంతు కొన‌సాగింది. మూడో రోజు కూడా కుక్క మొర‌గ‌డం, కాళ్ల‌ను కింద పెట్ట‌నివ్వ‌క‌పోవ‌డంతో య‌జ‌మానికి అనుమానం వ‌చ్చింది. దీంతో మంచం కింది భాగాన్ని ప‌రిశీలించ‌గా పాము క‌నిపించింది.

    ఫ్రిజ్‌లోకి దూరిన నాగుపాము.. వీడియో చూస్తే వ‌ణికిపోవాల్సిందే..u

    అప్ర‌మ‌త్త‌మైన య‌జ‌మాని పాముల‌ను పట్టే వ్య‌క్తికి స‌మాచారం అందించాడు. స్నేక్ క్యాచ‌ర్ (Snake Catcher) ఆ ఇంటికి చేరుకుని పామును ప‌ట్టేశాడు. అనంత‌రం దాన్ని స‌మీప అడ‌వుల్లో వ‌దిలేశాడు. అయితే ద‌క్షిణాఫ్రికాలో క‌నిపించే అత్యంత విష‌పూరిత పాముల్లో ఇది ఒక‌టి అని స్నేక్ క్యాచ‌ర్ పేర్కొన్నాడు.

    20 అడుగుల గిరి నాగుపాము.. చూస్తే వ‌ణుకు త‌ప్ప‌దు..

    చూసే వారి గుండెలు జారాల్సిందే.. మనిషి లోతు ప‌డ‌గ విప్పిన నాగుపాము

    spot_img
    RELATED ARTICLES

    Latest News

    Cinema

    Politics

    Most Popular