G-20 నాయ‌కులు ఏమ‌రుపాటుతోనో అసంక‌ల్పితంగానో చేసిన ప‌నులు ఒక్కోసారి విమ‌ర్శ‌ల‌ను తెచ్చిపెడ‌తాయి. తాజాగా ముగిసిన జీ-20 (G-20) స‌ద‌స్సుకు వివిధ దేశాల అధ్య‌క్షులు, ప్ర‌ధాన‌మంత్రులు భార‌త్‌కు విచ్చేసిన విష‌యం తెలిసిందే. వారిలో బ్రెజిల్ అధ్య‌క్షుడు లూలా ద సిల్వ కూడా ఒక‌రు. ఆయ‌న ఈ స‌దస్సులో పాల్గొన్న సమ‌యంలో అక్క‌డే ఉన్న కొన్ని పెన్నుల‌ను త‌న చేతికి స‌రిప‌డా తీసుకున్న‌ట్లు ఓ వీడియో వైర‌ల్ అవుతోంది. ఆ పెన్నుల‌ను ఆయ‌న త‌న భార్య‌కు ఇవ్వ‌గా.. వాటిని ఆమె […]

G-20

నాయ‌కులు ఏమ‌రుపాటుతోనో అసంక‌ల్పితంగానో చేసిన ప‌నులు ఒక్కోసారి విమ‌ర్శ‌ల‌ను తెచ్చిపెడ‌తాయి. తాజాగా ముగిసిన జీ-20 (G-20) స‌ద‌స్సుకు వివిధ దేశాల అధ్య‌క్షులు, ప్ర‌ధాన‌మంత్రులు భార‌త్‌కు విచ్చేసిన విష‌యం తెలిసిందే. వారిలో బ్రెజిల్ అధ్య‌క్షుడు లూలా ద సిల్వ కూడా ఒక‌రు.

ఆయ‌న ఈ స‌దస్సులో పాల్గొన్న సమ‌యంలో అక్క‌డే ఉన్న కొన్ని పెన్నుల‌ను త‌న చేతికి స‌రిప‌డా తీసుకున్న‌ట్లు ఓ వీడియో వైర‌ల్ అవుతోంది. ఆ పెన్నుల‌ను ఆయ‌న త‌న భార్య‌కు ఇవ్వ‌గా.. వాటిని ఆమె గ‌బాగ‌బా ఎవ‌రూ చూడ‌కూడ‌ద‌న్న ఆతృత‌లో త‌న హ్యాండ్ బ్యాగ్‌లో పెట్టేసిన‌ట్లు క‌నిపిస్తోంది. ఇప్పుడు ఈ వీడియో నెట్‌లో వైర‌ల్‌గా మారింది.

బ్రెజిల్ అధ్య‌క్షుడు (Brazil President) జీ 20 స‌ద‌స్సులో పెన్నుల దొంగ‌త‌నానికి పాల్ప‌డ్డార‌ని కొంద‌రు.. కాద‌ని మ‌రికొంద‌రు వాదించుకుంటున్నారు. ఆశ్చ‌ర్య‌క‌రంగా భార‌త్ నెటిజ‌న్లు ఆయ‌న చ‌ర్య‌ను తేలిక‌గా తీసుకున్నారు. ఇలాంటి స‌ద‌స్సుల్లో ఆతిథ్య దేశం అనేక వ‌స్తువుల‌ను నాయ‌కుల‌కు అందిస్తుందని.. వాటిని తీసుకెళ్ల‌డం త‌ప్పేం కాద‌ని మ‌జ్ మానిక్ అనే యూజ‌ర్ ఎక్స్‌లో రాసుకొచ్చారు.

భార‌తీయ పెన్నులు ఒక దేశాధ్య‌క్షునికి న‌చ్చాయంటే గొప్పే క‌దా.. ఆయ‌న చ‌ర్య‌కు భార‌త్ బాధ‌ప‌డ‌దు అని మ‌రొక‌రు పేర్కొన్నారు. మ‌రోవైపు బ్రెజిల్ నెటిజ‌న్లు మాత్రం లూలాపై విరుచుకుప‌డుతున్నారు. దొంగ ఎప్ప‌టికీ దొంగేన‌ని.. ఆ స్వ‌భావం ఎక్క‌డకు వెళ్లినా దాచుకోలేర‌ని ఒక‌రు వ్యాఖ్యానించారు.

Updated On 18 Sep 2023 6:53 AM GMT
krs

krs

Next Story