Breaking | దీర్ఘకాలంగా పెండింగ్‌లో ఉన్న మహిళా కోటా బిల్లుకు కేంద్ర క్యాబినెట్ ఆమోదం తెలిపిందని విశ్వసనీయవర్గాలు పేర్కొన్నాయి. దీని ప్రకారం లోక్‌సభ, అన్ని రాష్ట్రాల అసెంబ్లీల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్ కల్పిస్తారు. సోమవారం ప్రత్యేకంగా సమావేశమైన కేంద్ర మంత్రివర్గం ఈ మేరకు నిర్ణయం తీసుకున్నదని సమాచారం. ఈ బిల్లును పార్లమెంటు ప్రత్యేక సమావేశాల్లో ప్రవేశపెడతారని ముందు నుంచీ ఊహాగానాలు ఉన్నాయి. ఈ బిల్లును తీసుకురావాలనేది పార్టీలకు అతీతంగా చాలా కాలం నుంచి డిమాండ్ ఉన్నది. […]

Breaking |
దీర్ఘకాలంగా పెండింగ్‌లో ఉన్న మహిళా కోటా బిల్లుకు కేంద్ర క్యాబినెట్ ఆమోదం తెలిపిందని విశ్వసనీయవర్గాలు పేర్కొన్నాయి. దీని ప్రకారం లోక్‌సభ, అన్ని రాష్ట్రాల అసెంబ్లీల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్ కల్పిస్తారు. సోమవారం ప్రత్యేకంగా సమావేశమైన కేంద్ర మంత్రివర్గం ఈ మేరకు నిర్ణయం తీసుకున్నదని సమాచారం.
ఈ బిల్లును పార్లమెంటు ప్రత్యేక సమావేశాల్లో ప్రవేశపెడతారని ముందు నుంచీ ఊహాగానాలు ఉన్నాయి. ఈ బిల్లును తీసుకురావాలనేది పార్టీలకు అతీతంగా చాలా కాలం నుంచి డిమాండ్ ఉన్నది. సాధారణంగా మంత్రివర్గ సమావేశం అనంతరం వివరాలను కేంద్రమంత్రులు వెల్లడించే వారు.
అయితే.. ఈ విషయంలో ప్రెస్ బ్రీఫింగ్ జరుగని నేపథ్యంలో దీనిపై అధికారికంగా ప్రకటన వెలువడాల్సి ఉన్నది. పార్లమెంటు ప్రత్యేక సమావేశాల నేపథ్యంలో సోమవారం సాయంత్రం ఆరున్నరకు కేంద్ర క్యాబినెట్ ప్రధాని నరేంద్రమోదీ అధ్యక్షతన సమావేశమైంది.
మహిళా రిజర్వేషన్ బిల్లును యూపీఏ ప్రభుత్వ హయాంలో రాజ్యసభ ఆమోదించింది. దీనితో ఇది ఇంకా క్రియాశీలంగానే ఉన్నదని కాంగ్రెస్ చెబుతున్నది. దీనిని ఆమోదించాలనేది తమ దీర్ఘకాలిక డిమాండ్ అని పేర్కొంటున్నది.
