Viral Video | పెళ్లి ప్రతి ఒక్కరి జీవితంలో ఒక మధురజ్ఞాపకం. ఈ వేడుకను కొందరు మరింత అందమైన జ్ఞాపకంగా మార్చుకుంటున్నారు. సంగీత్ పేరుతో వివాహ వేడుకల్లో వధూవరులు సందడి చేస్తూ బంధుమిత్రులతో ఆడి పాడుతున్నారు.
కేరళలో ఓ వధువు ఏకంగా తన పెళ్లిలోనే డ్రమ్స్ వాయించింది. ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఆ వీడియోలో వధువు చెండా (Chenda) అనే కేరళ సంగీత వాయిద్యాన్ని బృందంతో కలిసి వాయిస్తోంది. ఈ ఘటన కేరళలోని గురువాయూరులోని ఆలయంలో సోమవారం జరిగింది.
వధువు వివాహానికి ఆలయంలో ఏర్పాట్లు చేశారు. ఆమె తండ్రి చెండా మాస్టర్‌గా పని చేస్తున్నాడు. ఈ క్రమంలోనే పెళ్లిలో వధువు చెండాను వాయిస్తూ ఫిదా చేసింది. ఆ తర్వాత వధువు తండ్రితో పాటు వరుడు సైతం వధువుతో కలిసి వధువుతో జాయిన్ అయ్యాడు.
ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఇప్పటికే 13వేలకు పైగా లైక్స్ రాగా.. వేలల్లో వ్యూస్ లభించాయి. వధువు టాలెంట్‌పై నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు.