Sunday, December 4, 2022
More
    Homelatestలెహంగా న‌చ్చ‌లేద‌ని.. పెళ్లిని క్యాన్సల్‌ చేసిన వధువు

    లెహంగా న‌చ్చ‌లేద‌ని.. పెళ్లిని క్యాన్సల్‌ చేసిన వధువు

    Bride lehenga | విధాత: పెళ్లి అన‌గానే హ్యాండ్‌స‌మ్ అబ్బాయి కోసం అమ్మాయిలు ఆరాట‌ ప‌డుతారు. ఇక అనుకున్న‌ట్టే అబ్బాయి దొరికాడంటే.. షాపింగ్‌పై దృష్టి సారిస్తుంటారు. డ్రెస్సింగ్ విష‌యంలో ప్ర‌త్యేక చొర‌వ తీసుకుంటారు. ఖ‌రీదైన‌, ట్రెండింగ్‌లో ఉన్న దుస్తుల‌ను కొనేందుకు ఆస‌క్తి చూపుతారు.

    పెళ్లి చీర‌, ఇత‌ర‌త్రా వ‌స్తువుల విష‌యంలో అమ్మాయిలు త‌గ్గ‌నే త‌గ్గ‌రు. ఎందుకంటే జీవితంలో ఒకేసారి క‌దా పెళ్లి చేసుకునేది. అందుకే మంచి డిజైన్ ఉన్న డ్రెస్సుల‌నే ఎక్కువ‌గా ఇష్ట‌ప‌డుతుంటారు. అయితే ఓ అమ్మాయి కూడా త‌న పెళ్లి రోజు మంచి లెహంగా ధ‌రించాల‌ని అనుకుంది. కానీ అత్తింటి వారు తెచ్చిన లెహంగా ఆమెకు న‌చ్చ‌లేదు. దీంతో ఆమె తీసుకున్న నిర్ణ‌యానికి అంద‌రూ షాక‌య్యారు.

    ఉత్త‌రాఖండ్‌లోని హ‌ల్ద్‌వానికి చెందిన ఒక అమ్మాయికి ఈ ఏడాది జూన్ నెల‌లో నిశ్చితార్థం జ‌రిగింది. ఈ నెల‌లో పెళ్లి చేయాల‌ని నిర్ణ‌యించుకున్నారు. ఈ క్ర‌మంలో త‌మ‌కు కాబోయే కోడ‌లికి.. అత్తింటి వారు రూ. 10 వేల విలువ చేసే లెహంగాను కొనుగోలు చేసి పెళ్లి కుమార్తెకు పంపించగా దాన్ని చూసి వ‌ధువు పెద‌వి విరిచింది.

    లెహంగాను త‌క్కువ ధ‌ర‌లో తీసుకున్నార‌ని, అది చూడ‌టానికి బాగా లేద‌ని పెళ్లి కుమార్తె చెప్పింది. దీంతో త‌న‌కు ఈ పెళ్లి ఇష్టం లేద‌ని ఆమె తెగేసి చెప్పింది. ఇరు కుటుంబాలకు పోలీసులు కౌన్సెలింగ్ చేశారు. అయిన‌ప్ప‌టికీ పెళ్లికూతురు వినిపించుకోలేదు. తాను ఈ పెళ్లి చేసుకోవ‌డానికి సుముఖంగా లేన‌ని తేల్చి చెప్పింది. చేసేదేమీ లేక వ‌రుడి కుటుంబ స‌భ్యులు తిరిగి వెళ్లారు.

    RELATED ARTICLES

    Latest News

    Cinema

    Politics

    Most Popular

    You cannot copy content of this page