విధాత‌: రెజ్లింగ్ ఫెడ‌రేష‌న్ ఆఫ్ ఇండియా (డ‌బ్ల్యూఎఫ్ఐ) అధ్య‌క్షుడు, బీజేపీ ఎంపీ బ్రిజ్ భూష‌ణ్‌ను జూన్ 9 లోపు అరెస్టు చేయాల‌ని భార‌తీయ కిసాన్ మోర్చా అధ్య‌క్షుడు రాకేశ్ టికాయ‌త్ (Rakesh Tikayat) డిమాండ్ చేశారు. లేదంటే దేశ‌వ్యాప్తంగా ఆందోళ‌న‌లకు పిలుపునిస్తామ‌ని హెచ్చరించారు. శుక్ర‌వారం హ‌ర్యానాలోని కురుక్షేత్ర‌లో జ‌రిగిన ఖాప్ మ‌హాపంచాయ‌త్‌లో ఈ మేర‌కు తీర్మానం చేసింది. మే 30న రెజ్ల‌ర్లు త‌మ ప‌త‌కాల‌ను గంగ‌లో క‌లిపివేయ‌కుండా టికాయ‌త్‌ నిలువ‌రించారు. త‌న‌కు 5 రోజుల స‌మ‌యం ఇస్తే […]

విధాత‌: రెజ్లింగ్ ఫెడ‌రేష‌న్ ఆఫ్ ఇండియా (డ‌బ్ల్యూఎఫ్ఐ) అధ్య‌క్షుడు, బీజేపీ ఎంపీ బ్రిజ్ భూష‌ణ్‌ను జూన్ 9 లోపు అరెస్టు చేయాల‌ని భార‌తీయ కిసాన్ మోర్చా అధ్య‌క్షుడు రాకేశ్ టికాయ‌త్ (Rakesh Tikayat) డిమాండ్ చేశారు. లేదంటే దేశ‌వ్యాప్తంగా ఆందోళ‌న‌లకు పిలుపునిస్తామ‌ని హెచ్చరించారు.

శుక్ర‌వారం హ‌ర్యానాలోని కురుక్షేత్ర‌లో జ‌రిగిన ఖాప్ మ‌హాపంచాయ‌త్‌లో ఈ మేర‌కు తీర్మానం చేసింది. మే 30న రెజ్ల‌ర్లు త‌మ ప‌త‌కాల‌ను గంగ‌లో క‌లిపివేయ‌కుండా టికాయ‌త్‌ నిలువ‌రించారు. త‌న‌కు 5 రోజుల స‌మ‌యం ఇస్తే కొత్త కార్యాచ‌ర‌ణ‌ను ప్ర‌క‌టిస్తాన‌ని వారికి హామీ ఇచ్చారు.

ఈ మేర‌కు ఖాప్ పంచాయ‌తీలో చ‌ర్చించి జూన్ 9ని ప్ర‌భుత్వానికి డెడ్‌లైన్‌గా నిర్ణ‌యించారు. ఒక‌వేళ్ బ్రిజ్ అరెస్టు జ‌ర‌గ‌క‌పోతే దేశ‌వ్యాప్తంగా ఖాప్ పంచాయ‌తీలు జ‌రుగుతాయ‌ని, రెజ్ల‌ర్లు జంత‌ర్‌మంత‌ర్‌కు తిరిగి వెళతార‌ని విలేక‌ర్ల‌తో మాట్లాడుతూ టికాయ‌త్ వెల్ల‌డించారు. ఈ స‌మావేశానికి హ‌ర్యానా, పంజాబ్‌, రాజ‌స్థాన్‌, ఉత్త‌ర్‌ప్ర‌దేశ్ రాష్ట్రాల నుంచి రైతులు, ఖాప్‌లు త‌ర‌లివ‌చ్చారు.

Updated On 3 Jun 2023 8:49 AM GMT
Somu

Somu

Next Story